అల్లుడికి పండగ.. మామకు పరేషాన్

Harish happy with rains but kcr unhappy

మామా అల్లుడు కేసీఆర్, హరీష్ రావుల గురించి అందరికి తెలుసు. కానీ తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు ఒకరికి ఆనందాన్ని, మరొకరికి మాత్రం ఆందోళనను కలిగిస్తున్నాయి. అదేంటి ఎవరికి ఆనందం.? ఎవరికి ఆందోళన.? అసలు మ్యాటర్ ఏంటి అనుకుంటున్నారా..? సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గత వారం రోజులుగా ఆనందంగా ఉన్నారని తెలుస్తోంది. కానీ వారం రోజులుగా ముఖ్యమంత్రి, హరీష్ మామ కేసీఆర్ కు మాత్రం తీవ్ర ఆందోళన కలుగుతోందని తెలుస్తోంది. దీనికి ఎవరు కారణమో తెలుసా..? వరుణుడు..అవును వాన దేవుడు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల గత వారం, పది రోజులుగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో దాదాపుగా అత్యల్పంగా 5 సెంటీమీటర్లు, అత్యథికంగా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిరంతరాయంగా కురుస్తున్న వానల కారణంగా తెలంగాణలో ఎక్కడ చూసిన పచ్చదనం తొణికిసలాడుతోంది. కాగా మంత్రి హరీష్ రావు ఈ వానలతో ఫుల్ ఖుషీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే మిషన్ కాకతీయ కింద పూడిక తీసిన చెరువుల్లో ఈ వర్షాల కారణంగా నీళ్లు వచ్చి చేరుతున్నాయి. మిషన్ కాకతీయ ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మరోపక్క సిఎం కేసీఆర్ మాత్రం ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. గత వారం పది రోజులుగా కురుస్తున్న వానల వల్ల హైదరాబాద్ ఇప్పటికే జలమయమైంది. దాదాపుగా అన్ని ప్రాంతాలు చెరువుల్లా మారాయి. రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలతో హుస్సేన్ సాగర్ నిండిపోయి.. నిండకుండలా మారింది. దాంతో హుస్సేన్ సాగర్ నుండి నీటిని నాళాల ద్వారా విడుదల చేశారు. హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలు వాననీటితో తటాకాల్లాగా మారాయి. దీంతో విశ్వనగరం అంటూ హైదరాబాద్ గురించి గొప్పలు చెప్పిన కేసీఆర్ కు ఆందోళన మొదలైంది. మరో ఐదు రోజులపాటు వర్షం ఉంది అన్న వార్త మరింత కలకలాన్ని రేపుతోంది.

మొత్తానికి ఒకే ఘటన ఇటు కేసీఆర్ లో, అటు హరీష్ రావులో భిన్న భావాలను పలికిస్తోంది. వర్షం ఒకరికి ఆనందాన్ని తీసుకువస్తే.. మరొకరికి మాత్రం ఆందోళన తీసుకురావడం నిజంగా విశేషమే.

Related posts:
రాజన్‌కు మోదీ ముళ్లకిరీటం
ఇండియా, పాక్ మధ్యలో తెలంగాణ కేసు
తెలంగాణలో యుద్ధానికి ఆ వర్గం
పూలు అమ్మిన చోట కట్టెలు కూడా అమ్మలేక
పాక్ ను వద్దనుకున్నాడు కాశ్మీర్ రాజు కానీ..
ఏపికి ప్రత్యేక హోదాపై గర్జించిన ‘విజయ’సాయిరెడ్డి
జగన్ బ్రహ్మాస్త్రం గడప గపడకు
పివి సింధు విజయం.. వెనక రాజకీయం
సింధూరంలో రాజకీయం
బాబు నిర్లక్ష్యానికి సచివాలయమే సాక్షి
బ్రీఫ్డ్‌మీ (నిన్నొదల)
హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది
నో షేక్.. ఇక హ్యాండే.. టీడీపీకి పవన్ మద్దతు లేనట్టే!
ప్రత్యేక హోదా అసలు తేడా ఎక్కడ వచ్చింది?
ఏపికి ప్రత్యేక హోదా ఓ సంజీవని
మీది ఏ జిల్లా? జిల్లాలు- వాటి పరిధి- జిల్లా మ్యాప్‌లు
చెత్త టీంతో చంద్రబాబు
ఏం పీకలేకపోతున్నారు... ఎందుకు ఇలా?
నోటిదూల డొనాల్డ్ ట్రంప్ పతనానికి కారణం
బాబుకు యముడు... మరోసారి షాకిచ్చిన ఆళ్ల రామకృష్ణ
ఈ దారుణాన్ని అడ్డుకునేదెవరు?
పందికొక్కుల కోసం ఇళ్లు తగలెడతామా?
మోదీ మంచి చేస్తే భయం ఎందుకు?
జయను ఎందుకు ఖననం చేశారంటే?

Comments

comments