మల్లన్న సాగర్ కు మొదటి బలి హరీష్ రావు

Harishrao will be first victim for Mallanna Sagar project in Telangana

Harishrao will be first victim for Mallanna Sagar project in Telangana.For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఎంతో చాణిక్యంతో రెండేళ్ల పాలనను కొనసాగించారు. ప్రజల నుండి ఎక్కడ కూడా వ్యతిరేకత రాకుండా చాలా జాగ్రత్తగా మానేజ్ చేశారు. బలం బలహీనత అనేవి కష్టమొచ్చినప్పుడే తెలుస్తాయి. బలం ఉంటే అది నాది అని అదే బలహీనత వేరే వాళ్లది అనే సంసృతి ఏమాత్రం మంచిది కాదు. అసలు ఇది ఎందుకు వచ్చింది అంటే కేసీఆర్ వైఖరిని వివరించాడానికి దీన్ని వాడాం. అసలు కేసీఆర్ చేసిన మంచి పనుల వల్లే అంతా సుభిక్షంగా ఉంది, పార్టీ తిరుగులేకుండా పోయింది అని డబ్బా కొట్టే డబ్బారాయుళ్లు నిన్న మొన్న వస్తున్న ప్రజా వ్యతిరేకతను మాత్రం ప్రస్తావించడం లేదు.

మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడ్డారు. తిరగబడిన వాళ్లపై తెలంగాణ సర్కార్ లాఠీలతొ దాడి చేయించింది. రైతులను పొలాల గట్ల వెంట పోలీసులు పరుగెత్తించి పరుగెత్తించి కొట్టారు. మరి దీన్ని కూడా కేసీఆర్ అకౌంట్ లోనే వెయ్యాలి కదా. కానీ మంత్రులు కానీ టిఆర్ఎస్ నాయకులు కానీ దీనిపై స్పందించరు. ఎందుకంటే కేసీఆర్ అంటే అంతా మంచి చేస్తారు అనే భావన మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్లాలి. తెలంగాణ ఏర్పడ్డాక బంద్ లు, ర్యాలీలు, నిరసనలు ఉండనే ఉండవు అని నాడు ఉద్యమ నాటి కేసీఆర్ మాటలు అదికార పీఠంపైకి రాగానే గాల్లో దీపాలుగా మారాయి.

అధికారానికి వచ్చిన కేసీఆర్ ముందు నుండి అరచేతిలో అద్భుతాలను చూపించారు. చేసేది గోరంత కానీ దాన్ని ప్రచారం చేసేది మాత్రం కొండంత. కాగా ఇప్పుడు మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ఎలాగూ మాట్లాడలేదు. కానీ మంత్రి హరీష్ రావు మాత్రం తొందరపాటును ప్రదర్శిస్తున్నారు. మల్లన్నసాగర్ కు ముందు నుండి అన్ని అవరోధాలే ఎదురవుతున్నాయి. భూసేకరణ దగ్గరే నిలిచిపోయిన మల్లన్న సాగర్ గురించి కేసీఆర్ కు బాగా తెలుసు. అందుకే దానిపై పెద్దగా పట్టించుకోలేదు. గెలుపు గుర్రాలపై మాత్రమే బెట్టుకాసే కేసీఆర్ అందుకే హరీష్ రావును రంగంలోకి దించి చివరకు మొదటి బలి ఇచ్చేశారు.

హరీష్ రావు మల్లన్నసాగర్ కు రైతులు అనుకూలంగా ఉన్నారు.. ఎక్కడా కూడా వ్యతిరేకత లేదు అని చాలా ముంపు గ్రామాల్లో పర్యటించి చెప్పిన మాటలు. కానీ ఆ మాటలు చెప్పిన వారానికి ఇలా పరిస్థితి తిరగబడింది. మల్లన్నసాగరాన్ని ముందు నుండి వ్యతిరేకిస్తున్న ప్రజలు తమ భూములను మంచి ధరకు అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం కేవలం 7 లక్షలు మాత్రమే ఇస్తే ఎకరానికి గిట్టుబాటు కాదు అన్నది వాళ్లవాదన. కనీసం పాతిక లక్షలు ఇవ్వాలని డిమాండ్.

కాగా మొన్నటి మల్లన్న సాగర్ నిర్వాసితులపై లాఠీ చార్జ్ పై కేవలం మంత్రి హరీష్ రావు మాత్రమే మాట్లాడారు. మిగిలిన ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. సరే కనీసం హరీష్ రావుకు సపోర్ట్ గా మాట్లాడారా..? అంటే అది కూడా లేదు. ప్రభుత్వం నుండి కూడా దీనిపై ఎలాంటి స్పందన రాలేదు. లాఠీ చార్జ్ కు వ్యతిరేకంగా హరీష్ రావు ప్రకటన చేశారు. మెదక్ జిల్లా బంద్ జరగలేదని.. అదంతా ప్రతిపక్షాల రాజకీయ కుట్ర అని వ్యాఖ్యానించారు. కానీ చాలా వరకు ఇలాంటి సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రజా బలం ముందు ఏమీ చెయ్యలేవు. కానీ హరీష్ రావు చేసిన ఈ ప్రకటన ఆయనకు నష్టాన్ని కలిగించేదే. మొత్తంగా హరీష్ రావును మల్లన్న సాగర్ కోసం మొదటి బలిపశువును చేశారా..? అనే వాదనతో చాలా మంది ఏకీభవిస్తారు.

Related posts:
మోదీ అంటేనే చిరాకుపడుతున్న ఆ గ్రామస్తులు.. ఎందుకంటే
పూలు అమ్మిన చోట కట్టెలు కూడా అమ్మలేక
ఎవడిచ్చాడు ఆ ర్యాంకులు...?
చరిత్రలో ప్రశాంతమైన కాశ్మీర్... అతడికి మాత్రమే సాధ్యమైంది
ఏం చేసినా తప్పు అంటే ఎలా..?
చిరుకు పవన్ అందుకే దూరం
మెగా ఫ్యామిలీ పొలిటికల్ స్కెచ్
అన్నదమ్ముల సవాల్
14వ ఫైనాన్స్ కమీషన్ ఎలా ఆలోచించింది..?
చంద్రబాబుకు పవన్ లెంపకాయ
స్విస్ ఛాలెంజ్ కు హైకోర్టు స్టే.. చంద్రబాబుకు షాక్
ప్రత్యేక హోదా పై కాంగ్రెస్ కూడా సై....!
ఒకే ఒరలో లక్షల అస్త్రాలు.. యువభేరి
బుల్లెట్ లేదు.. రక్తం లేదు అయినా పాక్ కు చావు దెబ్బ
ఏం పీకలేకపోతున్నారు... ఎందుకు ఇలా?
57లో 20.. పాపం వారి పరిస్థితి ఏంటో?
లోకేష్ వారసుడిగా కూడా పనికిరాడా..?
రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి... కేసీఆర్ సర్కార్‌కు సూచన
మేడిపండులాంటి కేసీఆర్ సర్కార్
తమ్ముడు ఎవరిని ప్రశ్నిస్తాడు?
మోదీ కరెన్సీ ప్లాన్ ఇంతకీ తప్పా? ఒప్పా?
మోదీని వేధిస్తున్న ఏటీఎం కష్టాలు
పైసలు వసూల్ కాలేదుగా..
మోదీ భజన అందుకేనా?

Comments

comments