తమిళనాడు అమ్మ వారసులు ఎవరు?

Who are Heirs for Tamilnadu Amma

వైద్యానికి అమ్మ స్పందిస్తున్నారనే మాటేగానీ అమ్మని చూసొచ్చి నోరుమెదిపినవారు లేరు. చికిత్స పూర్తయ్యాక కూడా అమ్మకి కొన్ని నెలలు రెస్ట్‌ అవసరమంటున్నారేగానీ ఆమె ఆరోగ్యపరిస్థితిపై స్పష్టమైన సమాచారం లేదు. ఎక్కడికీ తరలించాల్సిన అవసరం లేదంటూనే సింగపూర్‌ డాక్టర్లు, ఎయిమ్స్ వైద్యులు చెన్నై అపోలోకి చేరుకుంటున్నారు. బాగా దగ్గరనుకున్నవారికి కూడా ఆమెని చూసే అవకాశం దొరకడంలేదు. అమ్మ కోలుకోవాలనే అంతా కోరుకుంటున్నారు. కానీ ఎన్నాళ్లిలా? అమ్మ స్థానంలో పగ్గాలు చేపట్టే వారసులెవరు?

జయలలిత చికిత్సకోసం చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరి రెండువారాలు గడిచిపోయింది. ఆమె ఆరోగ్యపరిస్థితిపై ఎన్నో వదంతులు. అభిమానులు, పార్టీ కార్యకర్తల్లో భావోద్వేగాలు. పురచ్చితలైవి త్వరగా కోలుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా పూజలు, మొక్కులు. జయలలిత కోలుకుంటే అందరికీ ఆనందమే. కానీ అమ్మకి సుదీర్ఘకాలం పాటు విరామం అవసరమయితే, ఆరోగ్యపరిస్థితి సహకరించకపోతే… ఆమె తర్వాత ఎవరనేదే జవాబులేని ప్రశ్నగా ఉంది. పురచ్చితలైవి ఇష్టసఖి శశికళ… ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారన్న సమాచారం తమిళనాడు రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఆమెతో పాటు మరికొందరికి తప్పితే అమ్మ చికిత్సపొందుతున్న ఐసీయూలోకి ఎవరికీ అనుమతి దొరకడంలేదు. ఒక్క డాక్టర్లకి తప్ప.

జయలలిత వారసులెవరనే విషయం ఇప్పటిదాకా బహిరంగంగా చర్చకే రాలేదు. ఇన్నేళ్లూ పార్టీనేతలెవరూ కలలో కూడా ఆ ఆలోచన చేయలేదు. కానీ ఇప్పుడు ఏఐడీఎంకే వర్గాలతో పాటు మిగిలిన రాజకీయపక్షాల్లోనూ అమ్మ తర్వాత ఎవరనే చర్చకి తెరలేచింది. ఆరోగ్యపరిస్థితి ఇంతగా దిగజారాక… తన తర్వాత పార్టీ బాధ్యతలు ఎవరు స్వీకరించాలో.., ప్రభుత్వాన్నిఎవరు నడిపించాలో అమ్మకు ముందే ఓ అంచనా ఉందన్న ప్రచారం జరుగుతోంది.

మధ్యలో కొన్నాళ్లు అంతరాలొచ్చినా అప్పుడూ ఇప్పుడూ అమ్మకి అత్యంత అంతరంగికురాలిగానే ఉన్నారు శశికళ. అమ్మ ఆస్పత్రిలో ఉన్నా ఆమెని చేరువగా గమనిస్తోంది, నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది ఆమెనే. అక్రమాస్తుల కేసులో జయలలితకి శిక్ష పడినప్పుడు ఒకటికి రెండుసార్లు ఆమెకి విశ్వాసపాత్రుడైన పన్నీర్‌ సెల్వం ఆపద్ధర్మ ముఖ్యమంత్రయ్యారు. అమ్మకి క్లీన్‌చిట్‌ రాగానే మళ్లీ అంతే వినమ్రంగా ఆ పదవిని ఆమెకి అప్పగించారు. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే… అత్యవసర పరిస్థితి ఎదురయినా ఇప్పుడున్న కేబినెట్‌ సహచరుల్లో ఎవరికీ అమ్మ వారసత్వం దక్కే అవకాశమే లేదంటున్నారు. జయ దత్తపుత్రుడు సుధాకరన్‌కి కూడా అమ్మని చూసేందుకు పర్మిషన్‌ దొరకలేదు. చివరికి జయ మేనకోడలు దీపా జయకుమార్‌ని కూడా అనుమతించలేదు.

విచిత్రంగా ప్రముఖ హీరో అజిత్‌ పేరు వినిపిస్తుండటం తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామమంటున్నారు. మొదటినుంచీ అమ్మతో అజిత్‌ టచ్‌లో ఉన్నారని, అతనిపై జయలలిత అన్నాడీఎంకే భవిష్యత్తుపై చర్చించారని సమాచారం. అయితే రాజకీయానుభవం లేని అజిత్‌… అంత పెద్ద బాధ్యతని ఎలా మోస్తారన్న చర్చ కూడా జరుగుతోంది. కచ్చితంగా అమ్మ రాజకీయ వీలునామా రాసే ఉంటారని, తప్పదనుకున్న పరిస్థితుల్లో అది బయటికొచ్చే అవకాశముందనీ… అమ్మ వారసులెవరో దాంతోనే తేలిపోతుందని పార్టీ కేడర్‌తో పాటు, ప్రభుత్వ పెద్దలు కూడా భావిస్తున్నారట.

Related posts:
హరీష్.. ఇది నీకు సరికాదు
నడిరోడ్డు మీద నరుకుతుంటే.. ఏం చేశారో తెలుసా..?
పది వేలలోపే ఎల్ఈడీ టీవీ
నేను స్వాతిని మాట్లాడుతున్నా అంటోంది.. ఎవరా స్వాతి??
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
ఆరో తరగతిలోనే లవ్.. తర్వాత ఏం చేశారంటే
రాఖీ సావంత్ మోదీని అలా వాడేసింది
వత్తిళ్లతో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై
నర్సింగ్.. ‘నాలుగేళ్ల’ దూరం
ఆ సినిమా స్టోరీలన్నీ చంద్రబాబు నాయుడివే...?!
చంద్రబాబు ఓ ‘పాము’.. కాపుల విషయంలో
వాట్సాప్ వదిలి అల్లో.. కొత్త ఫీచర్లు ఏంటంటే
పిహెచ్‌డి పై అబద్ధాలు
హైదరాబాద్‌లో కూల్చివేతలు షురూ
తెలుగు రాష్ట్రాలకు నాలుగు ఎయిర్‌పోర్టులు
ముందే కూయనున్న బడ్జెట్... మోదీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన
ఇక ఐటీ ప్రతాపం.. అకౌంట్లో లిమిట్ మించితే షాకే
60 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనా?
1075కు ఫోన్ చేస్తే ఫ్రీగా డాక్టర్ల సలహాలు
ఆ పెళ్లి గురించి మోదీకి తెలుసా?
గవర్నర్‌ను కలిసిన వైయస్ జగన్
బెంగళూరు ఉద్యోగాలు ఇక ఉండవా?
నరేంద్రమోదీ@50 రోజులు

Comments

comments