పాత ఐదు వందల నోట్లు ఇక్కడ చెల్లుతాయి

Here five Hundred rupee notes are valid

కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లు రద్దయిన వార్త అందరికి తెలిసిందే. ఇప్పుడిక ఐదు వందలు, వెయ్యి రూపాయలను కేవలం బ్యాంకుల్లో మాత్రమే డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించింది కేంద్రం. అయితే ఇందులో ఐదు వందల నోట్లకు ఓ చిన్న వెసలుబాటు కల్పించింది. పాత ఐదు వందల నోట్లు కొన్ని ప్రదేశాల్లో చెల్లుబాటు అవుతాయి అని తెలిపింది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని సంస్థలకు ఈ అవకాశం కల్పించింది. మరి పాత ఐదు వందల నోట్లు ఎక్కడ చెల్లుతాయో తెలుసుకోవాలా? అయితే ఈ లిస్ట్ చూడండి.

– డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌తో ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ షాపులలో బిల్లుల చెల్లింపులు
– ఇక ఇతర అన్ని ఫార్మాసిస్‌లలో ప్రిస్క్రిప్షన్ దానికి తోడుగా వ్యక్తిగత గుర్తింపు కార్డుతో కొనుగోళ్లు
– రైల్వే టికెట్ కౌంటర్లు , రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లేదా ప్రభుత్వ బస్సు సర్వీసుల టికెట్ కౌంటర్లు, ఎయిర్‌పోర్టుల కౌంటర్లు
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉండే పాల బూతులలో
– ప్రభుత్వ ఆధీన చమురు కంపెనీల పరిధిలోని పెట్రోలు , డీజిల్ బంక్‌లు, గ్యాస్ స్టేషన్లలో
– శ్మశాన వాటికలు, ఖనన వాటికల వద్ద
– అంతర్జాతీయ విమానాశ్రయాలలో వచ్చిపోయే ప్రయాణికులు పాత రూ. 500 నోట్లను ఇచ్చి విదేశీ కరెన్సీని పొందవచ్చు.
– వినియోగదారుల సహకార స్టోర్స్‌లో కొనుగోళ్లకు
– వంటగ్యాసు సిలిండర్ల కొనుగోళ్లకు
– రైలు ప్రయాణాల సమయంలో భోజనం కేటరింగ్ సేవల వినియోగానికి
– ‘సబర్బన్, మెట్రో రైలు టికెట్లకు
– ఆర్కియాలాజికల్ సర్వే వారు నిర్వహించే మ్యూజియంలు ఇతర కట్టడాలలో ప్రవేశ టికెట్ల కొనుగోళ్లకు
– కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించాల్సిన రుసుంలు, ఛార్జీలు, పన్నులు, పెనాల్టీల చెల్లింపునకు
– మున్సిపాల్టీలు, స్థానిక సంస్థల పన్నులకు
– వాటర్, కరెంటు వంటి గృహ వినియోగ సేవల బిల్లులకు ( ఇది కేవలం ప్రస్తుత నెల బిల్లుకు వర్తిసుంది) , అడ్వాన్స్ చెల్లింపులకు వీల్లేదు
– కోర్టు ఫీజుల చెల్లింపునకు
– నిర్ణీత విత్తన కేంద్రాలనుంచి విత్తనాల కొనుగోళ్లకు
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపాల్టీలు, స్థానిక సంస్థల పరిధిలోని స్కూళ్లలో రూ . 2,000 వరకూ ఫీజుల చెల్లింపు
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని కాలేజీలలో రుసుంల చెల్లింపునకు
– రూ . 500 మేరకు ప్రతి రీఛార్జ్‌కు ప్రీ పెయిడ్ మొబైల్ టాప్ అప్‌ల కోసం
– ఏకమొత్తంలో రూ 5 వేల పరిమితి వరకూ వినియోగదారుల కోపరేటివ్ స్టోర్స్‌లలో కొనుగోళ్లకు

Related posts:
జగన్‌కు తెలుసు.. ముద్రగడకు తెలిసొచ్చింది?
నేను స్వాతిని మాట్లాడుతున్నా అంటోంది.. ఎవరా స్వాతి??
చంద్రబాబు మాట్లాడుతుంటే.. బావలు సయ్యా పాట!
ఆటకు 9 మిలియన్ కండోమ్స్ రెడీ
చిలిపి.. చేష్టలు చూస్తే షాక్
రాజ్యసభలో ‘వేశ్య’ వ్యాఖ్యపై దుమారం
బకరా మంత్రిని అనుకుంటున్నావా..? హరీష్ రావు ఆగ్రహం
బావర్చి హోటల్ సీజ్
గాల్లో తేలినట్టుందే.. పెళ్లి చేసినట్టుందే
ఐసిస్ ను స్థాపించింది ఒబామా
కృష్ణా పుష్కర భక్తులకు హెచ్చరిక: కృష్ణా జలాల్లో బ్యాక్టీరియా
వత్తిళ్లతో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై
ఆ సైనికులకు శ్రద్ధాంజలి
కొండంత అండ.. చేయి చేయి కలిపి చేయూత
గూగుల్ బర్త్ డే.. విశేషాలు ఇవే
రైతుకు జగన్ భరోసా... అనంతపురంలో రైతుపోరు
కొత్త జిల్లాల వెనక కేసీఆర్ రాజకీయ కుట్ర?
పవర్ లేదు.. ఆక్వాఫుడ్ ఇండస్ట్రీ బాధితులతో పవన్ భేటి
కరెన్సీ నోట్లపై మోదీ ఏమన్నారు
అప్పు 60 రోజులు ఆగి చెల్లించవచ్చు.. కేంద్రం తీపి కబురు
మోదీ చేసిందంతా తూచ్..
మోదీని ఏకంగా ఉరి తియ్యాలంట!
థియేటర్లో ఆ పాటకు లేచినిల్చోవాల్సిందే
పైసల్లేవ్..ప్రకటనలూ లేవ్

Comments

comments