అప్పు 60 రోజులు ఆగి చెల్లించవచ్చు.. కేంద్రం తీపి కబురు

emi

నోట్ల రద్దుతో కేంద్రం చిక్కుల్లో పడింది.కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం వల్ల దేశంలో చాలా మంది ఇప్పటికే రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే బ్యాంకుల్లోనూ నగదులేని కారణంగా, జనాల చేతిలో డబ్బులు లేని కారణంగా కేంద్ర ప్రభుత్వం రుణగ్రహీతలకు కొన్ని వెసలుబాటులను కల్పించింది. అందులో భాగంగా 60 రోజుల వరకు అప్పు చెల్లించే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తోంది. హౌజింగ్, కార్, వ్యవసాయ రుణాలతో పాటు మిగిలిన కొన్ని కోటి లేదా కోటి రూపాయలకన్నా తక్కువ రుణాలకు కేంద్రం 60 రోజుల చెల్లింపు గడువును కల్పించింది. నవంబర్ 1తేది నుండి డిసెంబర్ 31 వరకు ఈ అవకాశాన్ని కల్పిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో ఒక్కసారిగా దేశంలో తీవ్ర కలకలం రేగుతోంది. నిన్నమొన్నటి దాకా చలామణిలో ఉన్న ఐదువందలు, వెయ్యి రూపాయల నోట్లు రద్దు చెయ్యడంతో అందరూ ఖంగుతిన్నారు. అయితే మోదీ నిర్ణయంతో చేతులో ఉన్న డబ్బులు ఎందుకు పనికిరాకుండాపోవడంతో పాటు, కొత్తగా బ్యాంకుల నుండి ఎలాంటి నగదు రావడం లేదు. దాంతో మోదీ ప్రభుత్వం మీద అన్ని వైపుల నుండి వత్తిడి పెరిగింది. ముఖ్యంగా వ్యాపారులకు, రైతులకు తీవ్ర ఇబ్బంది తలెత్తింది. కాగా తాజాగా మోదీ ప్రభుత్వం రైతుల కోసం కొన్ని షరతులను సడలించింది.

రైతులు విత్తనాలు కొనుగోలు చేసుకునేందుకు పాత 500 నోట్లను వినియోగించుకోవచ్చని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ లేదా కేంద్ర ప్రభుత్వ ఔట్‌లెట్లు, యూనిట్లు, కేంద్రాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ లేదా రాష్ట్ర విత్తన సంస్థలు, కేంద్ర లేదా రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీలు, భారత వ్యవసాయ పరిశోధన మండలి కేంద్రాల్లో గుర్తింపు కార్డు చూపించి విత్తనాలు కొనుగోలు చేసుకోవచ్చునని ఆర్థికశాఖ ప్రకటించింది. దీనితోపాటు పంట బీమా ప్రీమియం చెల్లింపు గడువును 15 రోజులు పొడిగించింది. ఏపీఎంసీ రిజిస్టర్డ్ వ్యాపారులకు వారానికి రూ.50,000 విత్‌డ్రా చేసుకునే వీలు కూడా కల్పించింది.

ఓవర్‌డ్రాఫ్ట్, క్యాష్ క్రెడిట్ ఖాతాదారులు వారానికి రూ.50వేలు విత్‌డ్రా చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. అయితే వ్యక్తిగత ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాదారులకు ఈ వెసులుబాటు వర్తించదు. విత్‌డ్రా చేసుకునే నగదును కూడా కొత్త రూ.2000 నోట్ల రూపంలో చెల్లిస్తారు. పెళ్లి వేడుకల కోసం కేంద్ర విధించిన క్యాష్ విత్ డ్రా మీద కొన్ని షరతులతో అవకాశం కల్పించింది.  పెళ్లి కోసం 2.5 లక్షలను వధువు, వరుడి తల్లిదండ్రులు విత్‌డ్రా చేసుకునేందుకు నిబంధనలను ఆర్బీఐ ప్రకటించింది. వీటి ప్రకారం వివాహ శుభలేఖ, మ్యారేజ్ హాల్‌ను బుక్ చేసినందుకు ఇచ్చిన అడ్వాన్స్ రశీదు, వంట వాళ్లకు ఇచ్చిన అడ్వాన్స్ రశీదు తదితరాలను సమర్పించాల్సి ఉంటుంది.

Related posts:
జెండా తెచ్చిన తిప్పలు
యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే
జగన్‌కు తెలుసు.. ముద్రగడకు తెలిసొచ్చింది?
పది వేలలోపే ఎల్ఈడీ టీవీ
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
ఆవిడతో లేచిపోయిన ఈవిడ
ఆటకు 9 మిలియన్ కండోమ్స్ రెడీ
బాబోయ్ బాబు వదల్లేదట
పార్లమెంట్ లో మోదీకి రాహుల్ సూది
నయీం రెండు కోరికలు తీరకుండానే...
ఏపీకి టోపీ..ప్రత్యేక హోదా లేదు....!
బాబా రాందేవ్ సమర్పించు...పతంజలి జీన్స్
తెలుగు రాష్ట్రాలకు నాలుగు ఎయిర్‌పోర్టులు
ఆస్పత్రిలో కేబినెట్ మీటింగ్.. బయట హారతులు, పూజలు- ఏం జరుగుతోంది?
గెలిచి ఓడిన రోహిత్ వేముల
జయలలిత గొంతుకు రంధ్రం.. ఎందుకంటే
అర్నాబ్ గోస్వామికి అంత భద్రత!
చంద్రబాబు చిన్న చూపు
మొత్తానికి కుదిరిన జీఎస్టీ
బ్లాక్ మనీపై మోదీ సర్జికల్ స్ట్రైక్
లోకేషా.. ఏంటీ ఆ మాటలు
గాల్లోకి లేచిన లక్ష్మీదేవి.. మోదీ మహిమ
అకౌంట్లలోకి 21వేల కోట్లు
బంగారంపై కేంద్రం ప్రకటన ఇదే..

Comments

comments