హైదరాబాద్ లో ఆ బిల్డింగ్ కూలడానికి ఊహించని కారణం ఇదే!

here is the reason behind Hyderabad Building collapse

హైదరాబాద్ లో విషాయం చోటుచేసుకుంది. నానక్ రామ్ గూడ దగ్గర నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల మేడ ఒక్కసారిగా కూలిపోయింది. రాత్రి పూట జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. ఈ బిల్డింగ్ శిథిలాల కింద దాదాపుగా 20 మంది చిక్కుకోవడం… వారితో ఒక్కరిని తప్ప మిగిలిన వారందరిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించడం జరిగింది. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా పలువురు మంత్రులు కూడా ఆరా తీయడం జరిగింది. అయితే అసలు ఈ బిల్డింగ్ ఎలా కూలింది అనే దానిపై అటు పోలీసులు, ఇటు జీహెచ్ఎంసీ కూడా ఎంక్వైరీ మొదలుపెట్టారు. అయితే అసలు ఏం జరిగింది అంటే..

2015 సెప్టెంబర్‌ నుంచి ఈ భవన నిర్మాణం కొనసాగుతోందని, నిర్మాణంలోని  ఆ భవనంలోనే కూలీలు నివసిస్తున్నారని తెలుస్తోంది. ప్రమాద సమయంలో వారంతా భవనంలోనే ఉన్నారని, కొన్ని కుటుంబాలకు చెందిన చిన్న పిల్లలు కూడా ఉండటం విచారకరం. శిథిలాల కింద చిక్కుకున్న వారు చేసిన ఆర్తనాదాలు స్థానికులు మరిచిపోలేకపోతున్నారు. అయితే ఈ విషాదానికి తావిచ్చిన ఆ బిల్డింగ్ కు అసలు జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమ‌తులు లేవ‌ని తెలిసింది.

నానక్ రాంగూడలో కూలిపోయిన ఆ బిల్డింగ్  కేవలం 360 గజాల స్థలంలో ఏకంగా జీప్లస్‌ 6 (ఏడు అంతస్తులు)తో పాటు పైన పెంట్‌హౌస్‌ కూడా నిర్మిస్తున్నారు. 2015 సెప్టెంబర్‌ నుంచి ఈ భవన నిర్మాణం కొనసాగుతోందని, నిర్మాణంలోని  ఆ భవనంలోనే కూలీలు నివసిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఆ బిల్డింగ్ వెనక మరో బిల్డింగ్ కోసం లోతైన గోతి తవ్వడం జరిగింది. కాగా ఈ గోతి వల్ల పక్కనే ఉన్న బిల్డింగ్ బేస్ మెంట్ కు సరైన పట్టులేక చివరకు కూలిపోయిందని తెలుస్తోంది. బిల్డింగ్ కూలిపోయినప్పటి నుండి పరారీలో ఉన్న బిల్డర్ సత్యనారాయణ సింగ్ కేరళలో పోలీసులకు చిక్కాడు.

Related posts:
తెలంగాణ సర్కార్ కు జై కొట్టిన అల్లు అర్జున్
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
బావర్చి హోటల్ సీజ్
ఆ ఎమ్మెల్యే వల్లే నయీం ఎన్ కౌంటర్ ..?
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌దే
ప్రత్యేక హోదా పై ‘పవర్’ పంచ్
ప్రత్యేక హోదా వచ్చితీరుతుంది
ఆప్ కాదు పాప్ వర్మ... ట్వీట్ కు దిల్లీ సిఎం దిమ్మతిరిగింది
2018లో తెలుగుదేశం ఖాళీ!
ఇక స్కూల్స్‌లో ఫ్రీ వైఫై.. డిజిటల్ ఇండియా దిశగా డిజిటల్ విద్య
రాహుల్ గాంధీకి మోక్షం..అంతా సిద్ధం
బెంగళూరుకు భంగపాటే
నక్సలైట్ల కోసం మహిళా కమాండోలు
నోట్ల రద్దుపై బిల్ గేట్స్ ఏమన్నారంటే?
నోట్లపై గాంధీ బొమ్మ తొలగించాలట!
కొత్త క్యాంపు కార్యాలయంలోకి కేసీఆర్
బినామీలు భయపడే మోదీ ప్లాన్
ఉద్యోగాలు ఊస్టింగేనా ?
ఆ క్రికెటర్ అంటే జయకు పిచ్చి
మమత జుట్టుపట్టుకుని దిల్లీలో..
అపోలోలో శశికళ మాస్టర్ ప్లాన్
గ్రామీణ బ్యాంకులను ఖూనీ చేస్తున్న మోదీ సర్కార్
డబ్బు మొత్తం నల్లధనం కాదు
ఎన్డీయేలో చేరనున్న టిఆర్ఎస్

Comments

comments