అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారంటే…

Here is the speech of Donald Trump

అమెరికా 45వ అధ్యక్షుడిగా ప్రముఖ వ్యాపారవేత్తగా నీరాజనాలు అందుకున్న డొనాల్డ్ ట్రంప్ క్యాపిటల్ హిల్ వద్ద ప్రమాణ స్వీకారం చేశారు. రెండు బైబిళ్లపై ఆయన ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. ఈ రెండు బైబిళ్లు ట్రంప్ కు ప్రత్యేకమైనవి కావడం విశేషం. అవి ఒకటి తన తల్లి బహుకరించింది, రెండోది 150 ఏళ్ల కిందట అబ్రహాం లింకన్‌ ప్రమాణం చేసింది కావడం విశేషం. ఆయన చేత అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్‌ రాబర్ట్స్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రమాణ స్వీకారం అనంతరం అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. పెన్ ప్రమాణ స్వీకారానికి మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ప్రమాణ స్వీకారం చేసిన బైబిల్ ను ఎంచుకున్నారు.

ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేందుకు అమెరికా వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల నుంచి సుమారు 9 లక్షల మంది ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ హిల్ ముందుకు చేరుకున్నారు. అనంతరం ‘అమెరికా ప్రధాన రహదారి’గా పిలిచే పెన్సిల్వేనియా ఎవెన్యూ గుండా దాదాపు 2.4 కిలోమీటర్ల మేర వైట్‌ హౌస్‌ వరకు ఊరేగింపు ఉంటుంది. రాత్రి అధికారిక విందుతో ప్రమాణస్వీకార వేడుక ముగియనుంది. మరోవైపు ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసనవ్యక్తం చేస్తూ వేలాదిమంది అమెరికన్లు ర్యాలీ చేస్తున్నారు. అమెరికాలోని అన్ని నగరాల్లో ట్రంప్ వ్యతిరేకులు నిరసన కార్యక్రమాలు చేపట్టడం విశేషం.

ఈ సందర్భంగా ట్రంప్ అధ్యక్షుడిగా అమెరికన్లను ఉద్దేశించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలివి…
*ఒబామా దంపతులు, మాజీ అధ్యక్షులు, అమెరికా ప్రజలకు ధన్యవాదాలు
*అమెరికాను పునర్ నిర్మించే కార్యక్రమంలో మనందరం భాగస్వాములు అవుదాం
*ఎన్నో సవాళ్లను అధిగమించాం, కష్టాలు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకున్నాం
*వాషింగ్టన్ డీసీ నుంచి అధికారాన్ని ప్రజలకే అందిస్తాను
*ఇది మీరోజు.. ఈ విజయం మీది.. అమెరికా మీ దేశం
*పక్క దేశాల చొరబాట్ల నుంచి మన సరిహద్దులను రక్షించుకుందాం
*ఇక ముందు వేసే ప్రతి అడుగులోనూ మనదే గెలుపు
*అమెరికా కోసం మనం రెండే విధానాలు పాటిద్దాం. అమెరికన్లకే ఉద్యోగాలిద్దాం.. అమెరికన్ వస్తువులనే కొందాం
*మాటలు చెప్పే కాలం ముగిసింది. ఇక చేతలు ప్రారంభం
*నల్లవాడైనా, తెల్లవాడైనా.. అందరి రక్తం ఎరుపే
*నేతలు గొప్పవాళ్లు అయ్యారేమో కానీ.. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు
*ఇక నుంచి ప్రజలే పాలకులు. మిమ్మల్ని ఎప్పుడూ తలదించుకోనివ్వను
*అమెరికాను అత్యంత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దుదాం
*ఈ భూమి మీద నుంచి ఇస్లామిక్ తీవ్రవాదాన్ని నిర్మూలిస్తాం

Related posts:
అబార్షన్ చేయించుకోవడానికి క్యు.. ఎందుకంటే
బ్రిటన్‌ను విడగొట్టింది నేనే
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
రాజ్యసభలో ‘వేశ్య’ వ్యాఖ్యపై దుమారం
సల్మాన్ ఖాన్ నిర్దోషి
ఓటుకు నోటులో ’టైమింగ్ అదిరింది‘
విరుచుకుపడుతున్న జగన్ డిజిటల్ సేన
ఇలా కాదు అలా... పాక్‌కు మంటపెట్టారు
అంత దైర్యం ఎక్కడిది..?
కాశ్మీర్ భారత్‌లో భాగమే
ఇండియన్ ఆర్మీపై అక్షయ్ కుమార్ అదిరిపోయే ట్వీట్
తమిళనాడు అమ్మ వారసులు ఎవరు?
సోషల్ మీడియా పైత్యం.. ముందు వెనక ఆలోచించని వైనం
తిరిగబడితే తారుమారే
గాల్లోకి లేచిన లక్ష్మీదేవి.. మోదీ మహిమ
ప్రభుత్వం ఓడింది.. ప్రజలూ ఓడిపోయారు
స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపే కానీ..
చంద్రబాబు హైదరాబాద్ అందుకే విడిచాడా?
దిల్‌సుఖ్‌‌నగర్ బాంబ్ పేలుళ్ల బాధితులకు ఉరిశిక్ష
ఆఫర్లతో అదరగొడుతున్న జియో, ఎయిర్ టెల్
మోదీ వేసిన ఉచ్చులో మాయావతి
మంత్రిగారి సన్నిహితుడిపై ఐటీ దాడులు
నరేంద్రమోదీ@50 రోజులు
మంత్రి గంటా ఆస్తుల జప్తు

Comments

comments