స్విస్ ఛాలెంజ్ కు హైకోర్టు స్టే.. చంద్రబాబుకు షాక్

High Court breaks for Swiss Challenge in Amaravathi

High Court breaks for Swiss Challenge in Amaravathi. For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People.

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం చకచక ముందుకు సాగుతున్న ఏపీ ప్రభుత్వంకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు షాక్‌ ఇచ్చింది. అమరావతి ప్రారంభ ప్రాంతాన్ని స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో అభివృద్ది చేసేందుకు రాజధాని ప్రాంత అభివృద్ది సంస్థ నోటిఫికేషన్‌ జారీ చేయడం జరిగింది. అయితే ఆ నోటిఫికేషన్‌పై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. అమరావతి సీడ్‌ కేపిటల్‌ అభివృద్ది పనులను స్విస్‌ ఛాలెంజ్‌ విధానం కింద అప్పగించడాన్ని ఆదిత్య హౌసింగ్‌ కంపెనీ వారు ఛాలెంజ్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.

స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో పలు లొసుగులు ఉన్నాయి అని, అన్ని కూడా విదేశీ కంపెనీలకు అనుకూలంగా ఉన్నాయి అంటూ ఆదిత్య హౌసింగ్‌ కంపెనీ హైకోర్టు ముందుకు తీసుకు వెళ్లడం జరిగింది. విదేశాల్లో పనులు చేసిన అనుభవం ఉండాలంటూ ఒక కొత్త రూల్‌ను తీసుకు వచ్చి తమకు అనుకూలంగా ఉన్న సంస్థలకు రాజధాని నిర్మాణ పనులు అప్పగించినట్లుగా పిటీషన్‌ సంస్థ పేర్కొవడం జరిగింది. పిటీషన్‌ను స్వీకరించిన కోర్టు నిర్మాణంపై స్టే విధించడం జరిగింది. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్‌ 31కి వాయిదా వేయడం జరిగింది. అమరావతి నిర్మాణంకు తాము అన్ని విధాలుగా సరిపోతాం అని, అలాంటిది మాకు కాకుండా స్విస్‌ కంపెనీకి ఇవ్వడం వల్లే ప్రభుత్వం చేపడుతున్న తప్పులను కోర్టు దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని ఆదిత్య హౌసింగ్‌ కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.

సింగపూర్ సంస్ధలే ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం చేయబోతున్నాయి. కాగా తాజాగా హైకోర్టు తీర్పుతో ఇది మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాజధాని నిర్మాణం కోసం రెండు సింగపూర్ కంపెనీలు, ఎపి ప్రభుత్వ సంస్ధ అమరావతి డెవలప్ మెంట్ కంపెనీ కన్సార్టియం గా ఏర్పడ్డాయి. ఇందులో అమరావతి కంపెనీ భాగస్వామ్యం 42 శాతం కాగా 58 శాతం వాటాలు సింగపూర్ కంపెనీలవే! ఏపి రాజధాని నిర్మాణంలో స్విస్ ఛాలెంజ్ పద్ధతిపై వస్తున్న విమర్శలకు, అడ్డగింపుల గురించి మొత్తం అర్థం కావాలంటే ముందు స్విస్ ఛాలెంజ్ అంటే ఏంటో తెలుసుకోవాలి.

స్విస్ చాలెంజ్ పద్ధతి అంటే…
ఒక ప్రైవేట్ సంస్థతో మాట్లాడుకొని వారిచ్చే ప్రతిపాదనకు ఒప్పుకొని కాంట్రాక్ట్ ఇవ్వజూపడం. అనంతరం ఇతర సంస్థలను కూడా ఆహ్వానించి అంత కంటే మంచి ప్రతిపాదన ఇవ్వమని అడగడం లేదా మొదటి ప్రతిపాదనలో మార్పులు సూచించమని చెప్పడం. ఇతర సంస్థలు సూచించిన మంచి మార్పు లను అమలు చేయడానికి అంగీకరిస్తే మొదటి సంస్థకే ఆ కాంట్రాక్టు అప్పగి స్తారు. ఇతర సంస్థలు ప్రతిపాదించిన మార్పులను అమలుచేయడం సాధ్యం కాదని మొదటి సంస్థ చేతులెత్తేస్తే ఆ కాంట్రాక్టును వేరే సంస్థకు ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే, మాస్టర్ ప్లాన్ తయారుచేసిన వారికి దానిలోని మతలబు తెలుస్తుంది కనుక సహజంగానే మాస్టర్ డెవలపర్‌గా తెలివైన ప్రతిపాదనలతోనే ముందు కొచ్చే అవకాశముంది.

అమరావతి విషయంలో ఈ చాన్స్ సింగపూర్ కంపెనీలకు దొరికింది స్విస్ చాలెంజ్ పద్ధతి మన దేశంలో గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలలో అమలు జరుగుతోంది. స్విస్ చాలెంజ్ విధానంలో పారదర్శకత తక్కువ. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ పద్ధతిలో జరిగే పనులకే ఈ విధానం కొంతవరకు అనుకూలం. అక్కడ కూడా ప్రైవేటు సంస్థ సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేయకపోయినా, వ్యయం ఎక్కువ అవుతోందని చెప్పినా కాంట్రాక్టు కొనసాగించలేకా, బయటపడలేకా సతమతం కావలసివస్తుంది.

స్విస్ చాలెంజ్ కాంట్రాక్టు తీసుకున్న పెద్ద పీపీపీ (పబ్లిక్ ప్రయివేట్ పార్టిసిపేషన్) ప్రాజెక్టులను యూపీఏ ప్రభుత్వం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పరిధిలోకి తీసుకొని వచ్చింది. పారదర్శకతను, జవాబుదారీతనాన్ని నిలబెట్టడానికి అలాంటి వ్యవస్ధ ఆంధ్రప్రదేశ్ లో లేదు. స్విస్ ఛాలెంజ్ అనే కొత్త విధానం ద్వారా చంద్రబాబు నాయుడు అమరావతిలో తన చతురతను ప్రదర్శిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వ్యతిరేకత ఎందుకంటే..
స్విస్ చాలెంజ్ పేరుతో సింగపూర్ కంపెనీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ధారాదత్తం చేస్తోందని వైసీపీ ముందు నుండి వాదనను వినిపిస్తోంది. తనవాళ్లకు మేలు చేసేందుకు సీఎం చంద్రబాబు ఇదంతా చేస్తున్నారని, సింగపూర్ కంపెనీలతో కలిసి ఏర్పాటు అమరావతి డెవలప్ మెంట్ ప్రాజెక్టుతో రాష్ట్రానికి తీవ్రనష్టం జరుగుతోందని అంటున్నారు. సింగపూర్ కంపెనీలు చేసేవి కేవలం భూముల వ్యాపారం మాత్రమేనని వారి బలమైన వాదన.

సింగపూర్ కంపెనీలకు అన్నివిధాలా మేలు చేసే సౌకర్యాలు కల్పించినా వారు పెట్టే పెట్టుబడులు మాత్రం నామమాత్రమని జగన్ వర్గం అంటోంది. భారతదేశ చట్టాల్లో లేనివిధంగా సింగపూర్ కంపెనీలతో చంద్రబాబు సర్కారు ఒప్పందాలు చేసుకుందని వైసీపీ నాయకులు అంటున్నారు. ఈ ఒప్పందాలేవీ భారతదేశ నిబంధనలకు అనుకూలంగా లేవన్నారు. అప్పులు ఆంధ్రప్రదేశ్ కు.. లాభాలకు సింగపూర్ కు తరహాలో ఒప్పందాలున్నాయన్నారు.

Related posts:
కొత్త జిల్లాల వెనుక కేసీఆర్ ప్లాన్ ఏంటి..?
బ్రెగ్జిట్ వరమా..? శాపమా..?
టిఆర్ఎస్‌తో బిజెపి మైండ్ గేమ్
జగన్ ఆస్తుల విషయంలో బాబు ఎందుకు తగ్గుతున్నాడు...?
తెలంగాణలో యుద్ధానికి ఆ వర్గం
టెర్రరిస్టులకు ఓవైసీ సపోర్ట్ ఎందుకు? పచ్చినిజాలు
ఉగ్రవాదిలో చూడాల్సింది.. మతమా..? మారణహోమమా..?
తండ్రి కోటీశ్వరుడు.. కొడుకు కూలి(రియల్ స్టోరీ)
శుక్రవారం వస్తే కాశ్మీర్ లో వణుకు ఎందుకంటే..
బాబ్బాబు.. బాబ్బాబ్.. బాబూ
ఇదే జగ‘నిజం’
దీక్షల వల్ల వచ్చేదేముంది..?
జనసేన పార్టీ (తెలుగుదేశంలో ఓ డివిజన్)
ఊరట పవన్ ఫ్యాన్స్ కు
బాబు Khan
పట్టిసీమ వరమా..? వృధానా..?
ప్రత్యేక హోదా లాభాలు
అదీ హామీ అంటే.. ఫీరీయింబర్స్మెంట్ 100శాతం
చెత్త టీంతో చంద్రబాబు
పెడన నుండి పోటు... టిడిపిలో ఇదే చర్చ
కాపీ క్యాట్ పవన్.. జగన్‌ను ఫాలో అవుతున్న జనసేనాని
ఒక్క అడుగు.. అదే బాటలో జననేత
పందికొక్కుల కోసం ఇళ్లు తగలెడతామా?
మోదీ భజన అందుకేనా?

Comments

comments