జయలలిత గొంతుకు రంధ్రం.. ఎందుకంటే

Hole on Jayalalitha throat for treatment

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై గత కొంత కాలంగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆమె ప్రాణాలతో లేదు అని కూడా ప్రచారం నడిచింది. జయలలిత చనిపోయి చాలా రోజులైందని.. కానీ బయటకు మాత్రం ఆమె బ్రతికే ఉన్నట్లు చూపిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం కూడా సాగింది. దాంతో అసలు జయలలితకు ఏం జరిగింది..? ఏం జరుగుతోంది..? అన్నదానిపై ఎవరికీ క్లారిటీలేకుండాపోయింది. కానీ తాజాగా కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా వెంటిలేటర్ మీద ఉంచగా.. తాజాగా ఆమెకు వెంటిలేటర్ తొలగించారు. ట్రీట్ మెంట్ లో భాగంగా జయ గొంత దగ్గర ఓ చిన్న రంధ్రం చేశారు.దీన్ని వైద్య పరిభాషలో ట్రాకోస్టమీ అంటారు. ఈ చికిత్స కారణంగా ఆమె కొన్ని రోజులు మాట్లాడలేదని తెలిసింది. తొందరలోనే జయను స్పెషల్ రూంకు మారుస్తారని సమాచారం. జయలలిత న్యూస్ పేపర్లు చదివేందుకు ఇష్టపడితే… వైద్యులు సలహా మేరకు ఆమె ప్రస్తుతానికి న్యూస్ పేపర్లు చదవడం మంచిది కాదు అని చెప్పినట్లు తెలుస్తోంది. డాక్టర్లను తప్ప ఎవరినీ అనుమతించని సందర్భంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ భార్య నీతూ అంబానీ జయలలితను ఆస్పత్రిలోకి అనుమతించడం విశేషం. ఈ పరిణామాలు చూస్తుంటే త్వరలో జయలలిత కోలుకొని ప్రజల ముందుకు వచ్చేందుకు అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. ఇది జయ అభిమానులకు, తమిళ ప్రజలకు శుభవార్త.

Related posts:
కొవ్వుకు ట్యాక్స్.. కొవ్వెక్కువైందా..?
ఆరు నెలల్లో కేసీఆర్ రాజీనామా..?
ఇది ధోనీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ
ఫ్రాన్స్ లో ఘోరం.. 84 మంది మృతి
మోదీకి సిద్దు బల్లే భలే షాక్
మల్లన్న సాగర్ కు లైన్ క్లీయర్.. హరీష్ ఆనందం
పాక్ తో భారత్ కు అణుయుద్ధం తప్పదు!
మీది ఏ జిల్లా..? ఇదీ తంటా
నయీం జీవితంపై రాంగోపాల్ వర్మ సినిమాలు
విరుచుకుపడుతున్న జగన్ డిజిటల్ సేన
ఏమన్నా అంటే పర్సనల్ అంటారు
డాక్టర్ చంద్రబాబు (రైతులను మోసం చెయ్యడంలో)
స్థూపం కావాలి
జియోకు పోటీగా రిలయన్స్ ఆఫర్లు
తెలుగు రాష్ట్రాలకు నాలుగు ఎయిర్‌పోర్టులు
కోలుకోలేని పరిస్థితి వస్తోందట
సుష్మా స్వరాజ్‌కు అనారోగ్యం
బ్యాంకు నుండి రెండున్నర లక్షలు డ్రా చేసుకోవచ్చు
అప్పు 60 రోజులు ఆగి చెల్లించవచ్చు.. కేంద్రం తీపి కబురు
అకౌంట్లలోకి 21వేల కోట్లు
దేశభక్తి మీద సైనికుడి సమాధానం
పైసల్లేవ్..ప్రకటనలూ లేవ్
ఆ క్రికెటర్ అంటే జయకు పిచ్చి
బాబును వదిలేదిలేదు

Comments

comments