ఆస్పత్రులే నరకానికి రహదారులు?

Hospital or Hells for patients

వైద్యో నారాయణో హరి: అంటారు. వైద్యుడు నారాయణుడితో సమానం. ఇక ఆస్పత్రులను దేవాలయాలతో పోలుస్తాం. మరి అలాంటి ఆస్పత్రులకు అనారోగ్య కారణాలతో వెళితే పూర్తి ఆరోగ్యం వస్తుందని నమ్మకంతో వస్తాం. కానీ అక్కడికి వెళితే నరకానికి వెళతాం అని తెలిస్తే ఎలా ఉంటుంది. కానీ అచ్చంగా ఇదే జరుగుతోంది. ఆస్పత్రికి వైద్యం కోసం అని వెళితే ఏకంగా ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. లాభాల వేటలో ఆస్పత్రులు భద్రతను గాలికి వదిలేస్తున్నాయి.

రోగుల భద్రతను గాలికి వదిలెయ్యడంలో కార్పొరేట్ ఆసుప‌త్రులతో ప్ర‌భుత్వ ఆసుప‌త్రులు కూడా పోటీపడుతున్నాయి. రోగులు, వారి బంధువుల‌తో కిట‌కిట‌లాడే ఆసుపత్రుల్లో ఎలాంటి ప్ర‌మాదం చోటు చేసుకున్నా, దాని తీవ్ర‌త‌ను ఏ మాత్రం అంచ‌నా వేయ‌లేం. ప్ర‌మాద తీవ్ర‌త‌నూ నియంత్రించ‌లేం. అలాంటి చోట అగ్ని ప్ర‌మాదాలు సంభ‌విస్తే.. దాన్ని అదుపు చేయ‌డం మ‌న చేతుల్లో ఉండ‌దు. వాటి య‌జ‌మానులు భ‌ద్ర‌త చ‌ర్య‌ల‌ను పాటించ‌క‌పోవ‌డం, భ‌ద్ర‌త ప్ర‌మాణాల‌కు విరుద్ధంగా ఆసుప‌త్రి భ‌వ‌నాల‌ను నిర్మించ‌డం దీనికి ప్ర‌ధాన కార‌ణం.

భువనేశ్వర్‌లోని ఎస్‌యూఎం కార్పొరేట్ ఆసుపత్రిలో ఒకేసారి మంటలు వేగంగా వ్యాపించడంతో.. రోగులు, వారి బంధువులు సజీవ దహనమయ్యారు. ప్రమాదంలో 24 మంది మృతి చెందగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. షార్ట్‌ సర్క్యూట్‌ తోనే ఆసుపత్రిలో ప్రమాదం జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి అంతస్థులోని డయాలసిస్ వార్డులో మంటలు చెలరేగి అదే అంతస్థులోని ఐసీయూ తదితర విభాగాలకు వేగంగా వ్యాపించాయని అగ్నిమాపకదళం అధికారులు తెలిపారు. ఆ సమయంలో వార్డులో 30 మంది వరకు పేషెంట్లు ఉన్నారు. మొత్తం నాలుగంతస్తుల ఆ దవాఖానలో మొత్తం 500 మంది వరకు పేషెంట్లు ప్రమాద సమయంలో లోపలే ఉండిపోయారు.

ఇలా గతంలో కూడా చాలా ఘటనలు జరిగాయి. ఆస్పత్రులకు తమ బాధ తీరుతుంది.. రోగం తగ్గుతుందని వెళితే అక్కడ ఏకంగా ప్రమాదవశాత్తు ప్రాణాలు పోతే ఎవరికీ నమ్మకం ఉండదు. ఆస్పత్రులు, స్కూల్స్, షాపింగ్ మాల్స్ లాంటి రద్దీ ప్రదేశాల్లో ఖచ్చితంగా అగ్నిమాపక శాక సూచనలతో తగిన ఏర్పాట్లు ఉండాలి. అగ్ని ప్రమాదాలు జరగకుండా అడ్డుకునే పరిస్థితులు ఉండాలి. కానీ అలాంటి వాటిని పట్టించుకోకపోవడంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతోంది. ప్రభుత్వాలు కనీసం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఇలాంటి వాటిపై చర్యలకు పూనుకోవాలి.

Related posts:
బ్రెగ్జిట్ వరమా..? శాపమా..?
5రూపాయలకే భోజనం.. అన్న క్యాంటీన్.. వెనకున్నది ఒకరే
ఉగ్రవాదుల టార్గెట్ హైదరాబాద్ ఎందుకు..?
ఉగ్రవాదిలో చూడాల్సింది.. మతమా..? మారణహోమమా..?
కాశ్మీర్ కోసం ఇండియా, పాక్ ఆరాటం వెనక చరిత్ర ఇది
తండ్రి కోటీశ్వరుడు.. కొడుకు కూలి(రియల్ స్టోరీ)
ఏపికి ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య హీరోనా..? విలనా..?
బాబ్బాబు.. బాబ్బాబ్.. బాబూ
పవన్, అల్లు అర్జున్ పాటలపై గరికపాటి సెటైర్లు
పవన్ ను కదిలించిన వినోద్
ముద్రగడకు నాడు పవన్ అందుకే దూరం
ఆ అరుపులేంటి..?
అన్నదమ్ముల సవాల్
ఊరట పవన్ ఫ్యాన్స్ కు
పట్టిసీమ వరమా..? వృధానా..?
వెనకడుగు
కాపు ఉద్యమం+ప్రత్యేక హోదా ఉద్యమం - చంద్రంబలి
మీది ఏ జిల్లా? జిల్లాలు- వాటి పరిధి- జిల్లా మ్యాప్‌లు
ఇక యుద్ధమే కానీ..
హైదరాబాద్ లో ఇక నీళ్లే నీళ్లు.. ఇంకుడు గుంత ప్రభావం
టిఆర్ఎస్ లో వర్గపోరు.. వరంగల్ నుండే
కేవలం 57 సీట్లు మాత్రమే ఎందుకు?
సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా?
శశికళ ‘సిఎం’ స్ట్రాటజీ

Comments

comments