సాధించా..

babu-stay-news

‘ఓటుకు నోటు’ కేసులో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ఊరటనిచ్చింది. తనమీద ఉన్న కేసులపై స్టే తెచ్చుకోవడంలో సిద్దహస్తుడైన బాబు.. వైకాపా ఎమ్మెల్యే రామకృష్ణ ‘ఓటుకు నోటు’పై వేసిన పిటిషన్‌, దానిపై ఏసీబీ కోర్టు ఇచ్చిన విచారణా నోటీస్‌పై స్టే తెచ్చుకున్నారు. సరిగ్గా విచారణ ఎదుర్కోవాల్సిన సమయంలో.. ఆయన ఈ కేసుపై టెక్నికల్‌గా ‘స్టే’ పొందారు.

వివరాల్లోకి వెళ్తే.. ఓటుకునోటు కేసులో.. తెలంగాణ ఏసీబీ దర్యాప్తు సక్రమంగా లేదని, చంద్రబాబు నాయుడిపై దర్యాప్తుకు ఆదేశించాలంటూ వైకాపా ఎమ్యెల్యే రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. దీనికి ఏసీబీ కోర్టు సానుకూలంగా స్పందిస్తూ.. చంద్రబాబు నాయుడుపై విచారణకు ఆదేశించింది. దీన్ని సవాలు చేస్తూ.. బాబు స్టే కోసం హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ క్రమంలో తన పిటిషన్‌లో పేర్కొన్న విషయాలు మీకోసం..

– రామకృష్ణ వేసిన పిటిషన్ కాపీ చంద్రబాబు నాయుడికి అందలేదు.
– ఫిర్యాదు చేయడానికి ఎమ్మెల్యేకు అర్హత లేదు. ఈ కేసులో ఆయన సాక్షి కూడా కాదు. ఈ కేసుకు, రామకృష్ణకి వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధం లేదు.
– తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు, చంద్రబాబుకి ఎలాంటి సంబంధం లేదు.
– ఓటుకు నోటు కేసు వ్యవహారం ఇప్పటికే కోర్టులో ఉంది. ఇప్పుడు అదే కేసుకు సంబంధించి చంద్రబాబుపై ఒక సంవత్సరం తర్వాత పిటిషన్ వేయడం సరికాదు. పిటిషన్‌లో దానికి సంబంధించి ఎటువంటి వివరణ లేదు.
– ఫోన్ సంభాషణలు, బహిరంగ ప్రసంగాలు, ఇంటర్య్యూలు ఆధారాలుగా చూపించడం సరికాదు.
– ఏసీబీ కోర్టు ఉత్తర్వులు చట్టవిరుద్ధం.
– క్రిందికోర్టు దర్యాప్తుకు ఆదేశించిన కారణాలు ఉత్తర్వుల్లో వివరించలేదు.

పై కారణాలను చంద్రబాబు తన పిటిషన్‌లో పేర్కొనడంతో.. ‘ఓటుకు నోటు’ కేసుపై ‘స్టే’ లభించింది. అది కూడా 8 వారాలు స్టే ఇవ్వడం జరిగింది. ఈలోపు.. ఫిర్యాదుదారుడు రామకృష్ణని కౌంటర్ దాఖలు చేసుకోవచ్చునని తెలిపింది. ఏదేమైనా.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతానికి తాను అనుకున్నది సాధించారు.

Related posts:
దాసరి అండ్ కో‌ కు సూటి ప్రశ్నలు
మోదీ నిర్ణయంతో మంత్రులకు హడల్
రెండు పార్టీలు.. ఇద్దరు ఎంపీలు.. ఓ లవ్ స్టోరీ
అమిత్ షా రేస్ లో... తుస్
చంద్రబాబు నెంబర్ వన్..
నయీం పరేషన్ చేస్తే కేసీఆర్ ‘ఆపరేషన్’
హిల్లరీని చంపమనేనా.. ట్రంప్ మాటల్లో అర్థం..?
ఆ ఫీట్ ఓటు బ్యాంకు కోసమేనా..?
మోదీని మూడుసార్లు కాల్చినా పాపంలేదట
జనసేనలోకి చిరంజీవి.. అప్పుడే
రెండు వేల కోట్లు.. కృష్ణార్పణం
నింద్రాప్రదేశ్
ఇదేం రాజకీయం: రెండేళ్లు ఆలోచించినా అవగాహన లోపం!
బాబు అసెంబ్లీ రాజకీయం ఇదేనా..?
ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రే
ప్రత్యేక హోదాకి పోలవరంకి లింకేంటి?
నిలదీస్తున్న జననేత
చంద్రబాబూ.. నువ్వెవడివయ్యా?
ఉత్తమ్ పదవి ఊస్టింగ్.. కాంగ్రెస్ లో పనిలేని కలకలం
లోకేష్ మంత్రికాకపోతే అదే భయం
యుపిలో అఖిలేష్, ములాయంల వార్
తెలంగాణకు కొత్త గవర్నర్
ఈ ప్రధానమంత్రి మనకువద్దు
చిత్రవధకు లోనవుతున్న చంద్రబాబు!

Comments

comments