ఆయన 256 ఏళ్లు ఎలా బ్రతికాడు..?

How He Lived 256 Years

జీవితం అంటే ఏమిటో తెలిసేలోపే.. సగం జీవితం గడుస్తోంది. కళ్లు మూసుకొని రామా.. క్రిష్ణా అంటే మిగిలిన కాలం అలా కాలం వెల్లదీయవచ్చు అని చాలా మంది అంటుంటారు. కానీ ఓ పెద్దాయన వయస్సు గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయనకు ఏకంగా 256 ఏళ్లు అని చెబుతున్నట్లు వచ్చిన వార్త సంచలనం రేపుతోంది. చైనాకు చెందిన లీ చింగ్‌ యన్‌ 1933 మే 6న మరణించాడు. ఆయన మరణించినప్పటికి అతని వయస్సు 256 ఏళ్లట. అన్నేళ్లు బతకడం చరిత్రలోనే తొలిసారి జరిగిన సంఘటన.

సిచుయాన్‌ ప్రాంతంలో జన్మించిన లీ చింగ్‌ పదేళ్ల వయస్సులో ఆయుర్వేద మూలికలు సేకరిస్తూ.. అనేక ప్రాంతాల్లో తిరిగాడు. ఆయుర్వేద వైద్యుడిగా అనేక చోట్ల కాలం వెళ్లదీసి 72ఏళ్ల వయస్సులో కై క్సియన్‌ ప్రాంతానికి చేరుకున్నాడు. ఈ సమయంలో మంచి ఆహారంతోపాటు ఔషధాలు, రైస్ వైన్ తీసుకునేవాడు. కాగా, 1749లో ఆర్మీలో చేరి మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షకుడిగా.. సలహాదారుగా విధులు నిర్వర్తించాడు. ఆ తర్వాత 1927లో లీ చింగ్‌ను తిరిగి ఆయన స్వస్థలానికి పిలిపించారు. అప్పటికీ ఆయనకు 24మంది భార్యలు.. 200మందికిపైగా పిల్లలు ఉన్నారు. ఆయన కుటుంబంలో 11 తరాలను చూశాడు. చివరికి 1933లో మరణించాడట. అయితే ఆయన వయస్సుపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. లీ చింగ్‌ తాను 1736లో జన్మించాడని స్వయంగా చెప్పాడట.

అయితే చెంగుడు యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్‌ మాత్రం లీ చింగ్‌ 1677లో జన్మించాడని అంటున్నారు. 1930లో ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ ప్రచురించిన కథనం ప్రకారం చైనా ప్రభుత్వం రికార్డుల్లో 1827లో లీ చింగ్‌కు 150వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారని.. 1877లో 200వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్లు ఆధారాలు ఉన్నట్లు చెబుతున్నాడు. ఆ రెండు కథనాల ప్రకారం లీ చింగ్‌ 197ఏళ్లు లేదా 256ఏళ్లు జీవించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇన్నేళ్లు జీవించడం అనేది ఒక అద్భుతమనే చెప్పాలి. ఇప్పటి వరకు ఫ్రెంచ్‌కి చెందిన ఓ మహిళ 122 ఏళ్లు జీవించి అత్యధిక వయస్సున్న మనిషిగా రికార్డు సాధించింది. ఆమె కంటే ఈ చైనీయుడు రెండింతలకు పైగానే బతికాడన్నమాట. కాగా, సమర్థవంతమైన ఆహార నియమాలు, శరీరక శ్రమ, భౌతిక, మానసిక ఆరోగ్యం అంశాలపై జీవనకాల పరిమతి ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆ కాలంలో అది సాధ్యమయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

Related posts:
దేశం బాగుపడే ఆ పని చేసే దమ్ము మోదీకి ఉందా..?
చచ్చిపోదామన్న ఆలోచనను చంపేస్తారు
తెలంగాణలో పచ్చదనం కోసం ఫైరింజన్లు
బావర్చి హోటల్ సీజ్
గోరక్షక్ పై మోదీ మాట.. అసదుద్దీన్ మాటకు మాట
ఐసిస్ ను స్థాపించింది ఒబామా
పాక్‌కు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ర్యాలీలు
జగన్ బాణాన్ని పార్టీ వీడేది లేదు
పివి సింధుపై ట్విట్టర్ ఏమని కూసిందో తెలుసా..?
ఆటలా..? యుద్ధమా..?
జియో దిమ్మతిరిగే ఆఫర్లు ఇవే..
డాక్టర్ చంద్రబాబు (రైతులను మోసం చెయ్యడంలో)
జలజగడానికి బ్రేక్.. అన్ని కాదు కొన్నింటికి ఓకే
మోదీకి ఫిదా.. సోషల్ మీడియాలో స్పందన
తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్..... భారత్ దెబ్బకు ఒక్కిరిబిక్కిరి
వైయస్ జగన్ కు లోకేష్ బహిరంగ లేఖ ఎందుకంటే..
పవర్ లేదు.. ఆక్వాఫుడ్ ఇండస్ట్రీ బాధితులతో పవన్ భేటి
బాధితులకు దైర్యం.. ప్రభుత్వానికి ప్రతిపాదన
బాబు గారి అతి తెలివి
ప్రజాదరణలో కేసీఆర్ నెంబర్ వన్
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
కరెన్సీ నోట్లపై మోదీ ఏమన్నారు
హిల్లరీకి భంగపాటు.. ట్రంప్ విజయం
బినామీలు భయపడే మోదీ ప్లాన్

Comments

comments