గెలిచి ఓడిన రోహిత్ వేముల

Hyderabad Central University Student Rohith Vemula success as student, failed as Dalith

ఓ విద్యార్థి మరణం దేశ రాజకీయాల్లో సంచలనం రేపింది. విద్యార్థి నుండి ప్రధాని వరకు అందరూ కూడా దీని మీద స్పందించారు. ప్రధాని మోదీ కూడా ఆ విద్యార్థి మరణం మీద తన సంతాపాన్ని ప్రకటించారు. ప్రతిపక్ష నాయకుడి దగ్గరి నుండి ముఖ్యమంత్రుల వరకు అందరూ కూడా ఆ విద్యార్థి మరణం మీద స్పందించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా..? చనిపోయిన విద్యార్థి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్, దళితుడు కూడా కావడంతో ఆ ఆత్మహత్య మొత్తం దేశంలో చర్చకు తెర తీసింది. తాజాగా ఆ దళిత, హెచ్.సి.యు విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య నేపథ్యంలో జస్టిస్ రూపన్ వాలా రిపోర్ట్ ఇచ్చింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యపై నియమించిన జస్టిస్ రూపన్‌వాలా దర్యాప్తు కమిషన్ తన నివేదిక కేంద్ర మానవ వనరులశాఖకు అందజేసింది. రోహిత్ వేముల దళిత సామాజిక వర్గానికి చెందినవాడే అనటానికి సరైన ఆధారాలు లేవని అందులో వెల్లడించింది. అలాగే, వ్యక్తిగత కారణాలతోనే రోహిత్ ఆత్మహత్య చేసుకొన్నట్లు తెలిపింది. రోహిత్ ఆత్మహత్య ఘటన వ్యవహారంలో కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీకి ఎలాంటి సంబంధంలేదని కూడా కమిషన్ తన నివేదికలో క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా తెలిసింది.

హెచ్‌సీయూ అధికారులతో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లులేవని కూడా పేర్కొంది. రోహిత్ తల్లి రాధిక మాల సామాజికవర్గానికి చెందినట్లుగా చెప్పడానికి ఎలాంటి ఆధారాలులేవని, రాధికను దత్తత తీసుకున్న కుటుంబానికి ఆమె వాస్తవ సామాజికవర్గం గురించి వివరించలేదని, కాబట్టి ఆ కులం పేరును ఆమె వాడుకునే అవకాశంలేదని తన నివేదికలో కమిషన్ పేర్కొన్నట్లు సమాచారం. అదేసమయంలో, రోహిత్ కులం గురించి తెలుసుకోవడం కమిషన్ విచారణ పరిధిలోని అంశంకాదని, కేవలం యూనివర్సిటీలో ఇలాంటి ఘటనలు జరుగకుండా చూసేందుకు చేయాల్సిన సిఫారసులపైనే తాము దృష్టి పెడుతామని కమిషన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.

కాగా రోహిత్ వేముల ఆత్మహత్య చాలా వరకు రాజకీయంగా మారినా కానీ ఎంతో మందిలో ఓ చైతన్యాన్ని తీసుకువచ్చింది. చాలా విద్యాలయాల్లో ఇప్పటికీ సాగుతున్న దురాగతాల మీద సంస్థ రోహిత్ వేముల చేసిన పోరాటం ఎంతో మంది విద్యార్థులను కదిలించింది. దేశంలోని చాలా యూనివర్సిటీల్లో దీనిపై చర్చించుకునేలా చేయడంలో మాత్రం రోహిత్ వేముల దాదాపుగా సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు రోహిత్ వేముల దళితుడు కాదు అన్న క్లారిటీ వల్ల కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీకి మాత్రం కాస్త రిలీఫ్ అనే అనుకోవచ్చు. కాగా మొన్నటిదాకా రోహిత్ వేముల కుటుంబ సభ్యులు దళితులకు వర్తించే వెనలుబాటులు మాత్రం ఇక మీదట ఉండవు. మొత్తానికి రోహిత్ వేముల ఓ విద్యార్థిగా అసమానతలపై పోరాటంలో గెలిచినా, కులంపరంగా మాత్రం ఓడిపోయినట్లు అనిపిస్తోంది.

Related posts:
ఇది గూగుల్ సినిమా(వీడియో)
చచ్చిపోదామన్న ఆలోచనను చంపేస్తారు
బ్రిటన్‌ను విడగొట్టింది నేనే
సిద్దపేటలోని చెట్టు రాజకీయ కథ
తెలంగాణ సర్కార్ కు జై కొట్టిన అల్లు అర్జున్
సానియాను ఆ ప్రశ్న వేసి.. క్షమాపణలు చెప్పిన జర్నలిస్ట్
పాక్ తో భారత్ కు అణుయుద్ధం తప్పదు!
అతడి హనీమూన్ కు సుష్మా స్వరాజ్ సహాయం
చంద్రబాబుతో ఆడుకున్న సింధు
స్థూపం కావాలి
ఇలా కాదు అలా... పాక్‌కు మంటపెట్టారు
జలజగడానికి బ్రేక్.. అన్ని కాదు కొన్నింటికి ఓకే
వేలకోట్ల అధిపతి (అక్రమాల్లో..)
అర్నాబ్ గోస్వామికి అంత భద్రత!
పెట్టుబడులు అలా వస్తాయి... చంద్రబాబు మొహం చూసి కాదు
అర్నాబ్ గోస్వామి రాజీనామా ఎందుకు? సోషల్ మీడియాలో వెరైటీ స్పందన
కేసీఆర్ - నమోకు జై.. డిమోకు జైజై
ఆ పెళ్లి గురించి మోదీకి తెలుసా?
ఉద్యోగాలు ఊస్టింగేనా ?
తమిళనాట అప్పుడే రాజకీయాలా?
కేసీఆర్ మార్క్ ఏంటో?
మోదీ మీద మర్డర్ కేసు!
వంద విలువ తెలిసొచ్చిందట!
ఒక్క రూపాయికే చీర

Comments

comments