కొండంత అండ.. చేయి చేయి కలిపి చేయూత

Hyderabad Police and GHMC workers har work in Hyderabad Heavy Rains1

హైదరాబాద్ లో వర్షానికి  జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతుకుల రోడ్లు.. కాలనీల్లో నీళ్లు. ఎటు చూసిన వరదనీరే అన్నట్టు తయారైంది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇటు మున్సిపల్ సిబ్బంది అటు పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నారు. నాలుగురోజులుగా బురదనీటిలో మున్సిపల్ సిబ్బంది ఉంటే.. రాత్రనక పగలనకా… రోడ్ సేఫ్టీ చూస్తూ ట్రాఫిక్ సిబ్బంది సహాయక చర్యల్లో మునిగిపోయారు. గవర్నమెంట్ సర్వెంట్స్ అంటే సాధారణంగా ప్రజల్లో ఉండే ఆలోచనలను పక్కన పెట్టేసేలా.. మేమంటే ఇదీ అని నిరూపించారు.

ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.. గోతులు పడితే పూడ్చేశారు. రోడ్డుపై నీళ్లు నిలిస్తే.. తలో చెయ్యేసి.. నీళ్లు వెళ్లిపోయే విధంగా గునపం, పారా పట్టుకుని పని చేశారు. చలాన్లు రాయడమే తమ పని కాదంటూ.. సిటీ వ్యాప్తంగా ఉన్న పోలీసులు విధుల్లో మునిగిపోయారు. ఇక మున్సిపల్ సిబ్బంది అయితే.. మురుగు నీరు.. బురద ఇవేమీ పట్టించుకోకుండా.. నిరంతరం క్లీనింగ్ పనిలోనే ఉన్నారు. సమాచారం అందడమే ఆలస్యం వీలైనంత వరకు తమ సేవలను అందించారు. డ్రైనేజీలను పరిశీలిస్తూ.. నిలిచిన నీటిని బయటకు పంపే మార్గాలు వెతుకుతూ.. ఎక్కడ ఏ చిన్న అడ్డం ఉన్నా తొలగిస్తూ… నిమిషం ఖాళీ లేకుండా పని చేశారు. ఫోన్ చేస్తే తక్షణం సర్వీస్ కు అటెండ్ అవుతూ.. తమ డ్యుటీలో నిజాయితీని చూపుతున్నారు.

ఇక మున్సిపల్ కార్మికులతో పాటుగా పోలీసులు కూడా  హైదరాబాదీలకు అండగా నిలుస్తున్నారు. మరోపక్క ఆర్ఎస్ఎస్ వాళ్లు, స్వచ్ఛంద సంస్థల వాళ్లు, మూవీ అసోసియేషన్ వాళ్లు కూడా సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఇప్పటికే రంగంలోకి దిగింది. లోత్తట్టు ప్రాంతాల్లోని వారికి తమవంతు సహాయాన్ని చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న హైదరాబాదీలకు సహాయపడుతున్న ప్రతి ఒక్కరికి తెలుగోడ చేస్తోంది సలాం.

This slideshow requires JavaScript.

Related posts:
ఇండియాను టచ్ చెయ్యలేదు.. ఎందుకు..?
ఎవరీ జకీర్..? ఉగ్రవాదులతో సంబందం ఏంటి..?
ఆ బట్టతలకు భయపడుతున్న దేశ ప్రజలు
పోకిమన్ గో హిట్.. అడితే ప్రాణాలు ఫట్
రక్తంతో ముఖ్యమంత్రికి లేఖ రాసిన చిన్నారి
చంద్రబాబుతో ఆడుకున్న సింధు
ఏపీకి టోపీ..ప్రత్యేక హోదా లేదు....!
జలజగడానికి బ్రేక్.. అన్ని కాదు కొన్నింటికి ఓకే
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
ప్రత్యేక హోదా వచ్చితీరుతుంది
చెరువుల్లో ఇక చేపలే చేపలు
ప్యాకేజీ కాదు క్యాబేజీ
బాబుకు భయం.. మున్సిపల్ ఎలక్షన్ల ఆలస్యం అందుకే
ఆ సిఎంను చూడు బాబు...
యుపీలో ఘోర రైలు ప్రమాదం
అకౌంట్లలోకి 21వేల కోట్లు
ఏపిలో అందరికి సెల్‌ఫోన్‌లు
మోదీ వాళ్లతో ఏం మాట్లాడారు?
వడ్డీ రేట్లు తగ్గుతున్నాయ్?
ఆ పెళ్లి గురించి మోదీకి తెలుసా?
హైదరాబాద్ లో ఆ బిల్డింగ్ కూలడానికి ఊహించని కారణం ఇదే!
ఆ తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఖల్లాస్
ఇక మీ వాళ్లకు ఫోన్ ద్వారా ముద్దులు పెట్టుకోవచ్చు
జుట్టు పీక్కుంటున్న ఆర్.బి.ఐ

Comments

comments