నేను స్వాతిని మాట్లాడుతున్నా అంటోంది.. ఎవరా స్వాతి??

I Am Swathi a whatsapp Message going viral

తాజాగా వాట్సాప్ గ్రూపుల్లో వేగంగా ఓ మెసేజ్ ఫార్వర్డ్ అవుతోంది. నేను స్వాతిని మాట్లాడుతున్నా అంటూ సాగే ఈ వాయిస్ అందరికి షాకిస్తోంది. వాట్సాప్ లో అంత స్పీడ్ గా వెళుతున్న ఈ మెసేజ్ విన్న వారు మాత్రం షాక్ తింటున్నారు. మగాళ్లకు, మనిషికి ప్రశ్నలు సంధిస్తూ సాగిన ఈ మెసేజ్ అందరికి ఓ కనువిప్పే అవుతుంది. చెన్నై నుంగబాక్కం రైల్వే స్టేషనులో పట్టపగలు అందరూ చూస్తుండగా నల్ల ప్యాంటు ధరించిన ఓ దుండగుడు చెన్నై ఇన్పోసిస్ లో పనిచేస్తున్న స్వాతి అనే 24 ఏళ్ల యువతిని పీక కోసి అత్యంత కిరాతకంగా హతమార్చాడు. క్రిక్కిరిసిన రైల్వే స్టేషనులో దుండగుడు ఆమెపై కత్తితో దాడి చేస్తున్నా అంతా అలా చూస్తూ ఉండిపోయారు. తేరుకునేసరికి దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. దాంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగి చనిపోయింది. కాగా అక్కడే ఉన్నసిసిటివి పుటేజీల్లో హత్యద దృష్యాలు రికార్డయ్యాయి.

తాజాగా చనిపోయిన స్వాతి పేరుతో వాట్సాప్ లో ఓ మెసేజ్ స్పీడ్ గా స్రెడ్ అవుతోంది. ఆ వాట్సాప్ తమిళ్ మెసేజ్ తెలుగులో..

చనిపోయిన నేను ఇంకా కొద్దిరోజులు ప్రసార మాధ్యమాల ద్వారా మీ మధ్య జీవిస్తూనే ఉంటాను. అంతకుముందు మీతో కొన్ని విషయాలు మాట్లాడి వెళ్లాలని ఆశిస్తున్నాను. అందరిలాగే కలలతో జీవితాన్ని ప్రారంభించిన సమకాలీన సమాజంలో నేను ఒకవ్యక్తిని. ఈరోజు నేను ఎప్పటిలాగే ఉద్యోగానికి బయలుదేరాను, వారాంతపు రోజులను ఆనందంతో గడపాలని భావించే కలతో… మా నాన్న కూడా అలాగే భావించి నన్ను రైల్వేస్టేషన్లో దిగబెట్టి వెళ్లారు. మీలో ఎంతమంది ఈ రోజు ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసి ఉంటారనే విషయం నాకు తెలియదు. అయితే అది మీ మనస్సాక్షికి తెలుసు. మీలో ఎంతమంది మహిళా సాధికారత కోసం నోరు చిరిగేలా మాట్లాడి ఉంటారో నాకు తెలియదు. ఈరోజు నేను నోరు చిరిగే ఉన్నాను. అయితే మీలో ఒకరికి కూడా దానిని (హత్యను) అడ్డుకోవాలనే ఆలోచన రాలేదు. అతడు (హంతకుడు) వెళ్లిన తర్వాత నాకు చికిత్స అందించడానికో లేక నా దాహార్తిని తీర్చడానికో ఒక్కరూ ముందుకు రాలేదు. రెండు గంటల పాటు నన్ను చోద్యం చూసిన దృశ్యాలు మిమ్మల్ని దహించలేదా? ఆడపిల్లలు బయటకు వెళ్లేటప్పుడు ‘చూసి వెళ్లు’ అని చెప్పే మీరు దానిని మగపిల్లలకు కూడా చెప్పండి. మహిళలకు వ్యతిరేకంగా జరిగే నేరాలను మొగ్గ దశలోనే తుంచేయండి’..

Related posts:
చచ్చిపోదామన్న ఆలోచనను చంపేస్తారు
ఫేస్ బుక్ లో ఆఫీస్ లోనూ వేధింపులు
కాటేసిందని పాముకు శిక్ష
కేసీఆర్ ఆరోగ్యంపై కవిత ఏం చెప్పిందంటే..
పోకిమన్ గో హిట్.. అడితే ప్రాణాలు ఫట్
అమ్మకానికి రేప్ వీడియోలు, ఫోటోలు
నయీం రెండు కోరికలు తీరకుండానే...
పాక్‌కు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ర్యాలీలు
జాబులకు భయంలేదన్న ఇన్ఫోసిస్
ఓడినా విజేతనే.. భారత సింధూరం
స్వర్ణం సాధిస్తే హైదరాబాద్ రాసిచ్చే వారేమో...
ఏపీ బంద్.. హోదా కోసం
సన్మానం చేయించుకున్న వెంకయ్య
హైదరాబాద్ లో వానొస్తే.. కేటీఆర్ కు వణుకొస్తుంది
హైదరాబాద్‌లో కూల్చివేతలు షురూ
విమానంలో చక్కర్లు కాదు.. రైతులకు న్యాయం కావాలి
యుద్ధం మొదలైందా..? పాకిస్థాన్ మీద భారత్ దాడి
అమ్మ తర్వాత అమ్మ.. ఎవరు ఈమె?
వేలకోట్ల అధిపతి (అక్రమాల్లో..)
బాబు కుటుంబానికి వార్నింగ్.. ఆత్మాహుతి దాడికి సిద్ధం అంటూ మావోల లేఖ
నారా వారి నరకాసుర పాలన
దివీస్ పై జగన్ కన్నెర్ర
బ్యాంకులకు మూడు రోజులు సెలవులు
పాత ఐదు వందల నోట్లు ఇక్కడ చెల్లుతాయి

Comments

comments