స్టే వస్తే కురుక్షేత్రమే

stay2

ఓటుకు నోటు కేసులో ఎలాగైనా బయటపడాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు చివరకు కోర్టు మెట్లెక్కారు. ఏసీబీ కోర్టు తీర్పును సవాల్ చేస్తు హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన విచారణ తీర్పును డిస్మిస్ చెయ్యాలని చంద్రబాబు నాయుడు తరఫున లాయర్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు హైకోర్టు మెట్లెక్కిన చంద్రబాబు నాయుడు ఒకవేళ రేపు స్టే తెచ్చుకుంటే తర్వాత జగన్ ఏం చెయ్యబోతున్నారు అన్న దానిపై అందరూ చర్చించుకుంటున్నారు. ఒకవేళ చంద్రబాబు కోర్టు ద్వారా స్టే తెచ్చుకుంటే.. జగన్ ప్రజాకోర్టుకు వెళ్లనున్నారు.

వైయస్ జగన్ చంద్రబాబు నాయుడుకు ఓటుకు నోటు కేసులో చెక్ చెప్పిన జగన్ ఇప్పడు చంద్రబాబు నాయుడు కోర్టులో న్యాయపరంగా స్టే తెచ్చుకుంటే దాన్ని ఖచ్చితంగా ప్రజాకోర్టులో తేల్చుకునే అవకాశం ఉంది. కోర్టులు న్యాయంచెయ్యలేని పక్షంగా ఎవరైనా కూడా ప్రజాకోర్టులోనే దానిని ప్రశ్నిస్తారు. ఇప్పుడు జగన్ కూడా అదే చెయ్యబోతున్నట్లు కనిపిస్తోంది. రేపు కోర్టు స్టే అని ప్రకటించిన వెంటనే న్యాయస్థానాలపై కాకుండా కేసు మీద ప్రజా క్షేత్రంలోకి జగన్ దూసుకెళ్లే అవకాశం ఉంది.

చంద్రబాబు నాయుడుతో జగన్ ఆడుతున్న ఈ ఓటుకు నోటు కేసు చివరకు కురుక్షేత్రాన్ని తలపిస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు నిజంగా నిప్పే అయితే ఎందుకు స్టే కోసం కోర్టుకు వెళ్లారు..?  విచారణ ఎదురుకోకుండా స్టే ఎందుకు తెచ్చుకున్నారు..? అని వైసీపీ ఎక్కడిక్కడ చంద్రబాబును నిలదీసే అవకాశాలున్నాయి. చూస్తుంటే చంద్రబాబు నాయుడుకు భగవంతుడే దిక్కు అనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో జరుగుతున్న అన్యాయానికి జగన్ ప్రజలను చైతన్యవంతులను చేసి.. చంద్రబాబుకు కోలుకోలేని పరిస్థితిని కల్పించే అవకాశాలున్నాయి. ఓటుకు నోటు కేసులో విచారణ ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యాలని వైసీపీ ప్రజాసాక్షిగా డిమాండ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మొత్తానికి గతంలో తెలంగాణ సర్కార్ కు, చంద్రబాబు నాయుడు మధ్య తారాస్థాయికి వెళ్లిన  ఓటుకు నోటు కేసు ఇప్పుడు జగన్,  చంద్రబాబుల మధ్య కురుక్షేత్రాన్ని సృష్టిస్తుంది.

Related posts:
చంద్రబాబు గుళ్లో దేవుళ్లనే టార్గెట్ చేశాడా..?
టీజర్ లో ఎన్టీఆర్ రాజకీయం!
కేంద్రం నిధులు.. గుటకాయస్వాహా
దిల్లీకి లోకేష్.. చంద్రబాబు స్కెచ్ అది
ఏపిలో మంత్రి పదవి కోసం రన్ రాజా రన్
చిరు ‘ఖైదీ’ వెనక రాజకీయం
ఏపిలో జగన్ Vs పవన్
పంజా విసిరిన జననేత
పేదోళ్లవి కూల్చు.. పెద్దలవి ఆపు
చంద్రబాబుకు లోకేష్ మీద డౌట్ ?
ఎందుకంటే భయమంట.. ఆ రిపోర్ట్‌లో ఏముంది?
అరుణకు ఏకంగా ఆ పదవి? టిఆర్ఎస్ భారీ ఆఫర్
చినబాబుకు దీపావళి గిఫ్ట్!
సోము వీర్రాజు సైలెంట్.. దాని కోసమే?
బ్రాహ్మణి దెబ్బకు బుల్లెట్ ఎక్కిన బాలయ్య
క్లాస్‌లు తీసుకోవడానికి కేసీఆర్ రెడీ
అల్లుడి కార్లే కొనాలా..? మరోసారి కేసీఆర్ ఫ్యామిలీ డ్రామా?
పెద్దనోట్లపై కేసీఆర్ ఏమనుకుంటున్నారు?
తెలంగాణ సర్కార్‌కు కరెన్సీ దెబ్బ
ఎన్టీఆర్ కొత్త పార్టీ!
ట్యాక్స్ పై ఓ సామాన్యుడి ప్రశ్న
ఏపి సిఎంగా నారా లోకేష్
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి
చంద్రబాబు సమర్పించు ‘దావోస్ మాయ’

Comments

comments