జగన్ గెస్ట్ యాక్టర్ అయితే మరి చంద్రబాబు..??

If Jagan is guest actor inpolitics then what about Chandrababu

ఏపిలో అధికారపక్షానికి చెందిన నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు కాస్త నవ్వుతెప్పిస్తున్నాయి. తాజాగా మరోసారి ఉపముఖ్యమంత్రి కేఈ చేసిన వ్యాఖ్యలపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చసాగుతోంది. జగన్ మీద కేఈలాంటి సీనియర్ నాయకుడు తెలిసి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా.? లేదంటే తెలియకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అని చర్చించుకుంటున్నారు. ఏపిలో టిడిపి పరిపాలనను ఎండగట్టడంలో జగన్ ఫుల్ సక్సెస్ అయ్యారు అన్నది అందరికి తెలిసింది. కానీ జగన్ ను రాజకీయాల్లో గెస్ట్ యాక్టర్ గా అభివర్ణించడం విడ్డూరంగా అనిపించింది.

వైయస్ జగన్ ఏదో ఓ కార్యక్రమం పేరుతో నిత్యం ప్రజల మద్యన ఉండే ప్రయత్నం చేస్తారు. తాజాగా ఆయన గడపగడపకు వైసీపీ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా గ్రామగ్రామాన పర్యటనలు చేస్తున్నారు. అయితే దీనిని ఎద్దేవా చేస్తున్న కేఈ ప్రతిపక్షపార్టీ పోషించడంలో వైసీపీ విఫలమైందని అన్నారు. వైయస్ జగన్ అప్పుడప్పుడు బయటకు వస్తున్నారని, ఆయన రాజకీయాలలో గెస్ట్ యాక్టర్‌లా వచ్చి పోతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ చేపట్టిన ‘గడపగడపకూ వైసిపి’ ఓ ప్లాప్ షో అన్నారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. వైసీపీ పార్టీ లేదా జగన్ నిజంగా విఫలమై ఉంటే ఏపిలో టిడిపి నాయకులకు, అధికారపక్షానికి తిరుగులేకుండా ఉండేది. అసెంబ్లీ సాక్షిగా జగన్ ప్రభుత్వాన్నిఏకిపారేశాడు. దాన్ని ప్రత్యక్షంగా కోట్ల మంది చూశారు. కానీ అవేవీ కుదరవు అన్నట్లు  ఆ పార్టీ విఫలమైంది అన్న చిన్న వ్యాఖ్య చంద్రబాబు ప్రభుత్వాన్ని వెనకేసుకురావడానికి ఎంత మాత్రం సెట్ కాదు. అయినా అసలు జగన్ చేస్తున్న గడపగడపకు వైసీపీ ప్లాఫ్ షో అయితే కేఈలాంటి సీనియర్ లు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి మాట్లాడారు అంటే దానర్థం ఏమనుకోవాలి..?

Related posts:
కాపుల కోసం చంద్రబాబు మూడు బాణాలు
లోకేష్ గ్యారేజ్.. పార్టీకి రిపేర్లు చెయ్యబడును
ఇండియా, పాక్ మధ్యలో తెలంగాణ కేసు
ఉగ్రవాదుల టార్గెట్ హైదరాబాద్ ఎందుకు..?
ఉగ్రవాదిలో చూడాల్సింది.. మతమా..? మారణహోమమా..?
మల్లన్న సాగర్ కు మొదటి బలి హరీష్ రావు
బాబు నిర్లక్ష్యానికి సచివాలయమే సాక్షి
చిరుకు పవన్ అందుకే దూరం
టైం కోసం ఎదురుచూస్తున్న పవన్?
ఆ అరుపులేంటి..?
రక్తం మరిగింది అన్నారు.. ఎందుకు కరిగిపోయారు?
ముంచింది కమ్యూనికేషన్ గ్యాపే
తొందరపడి ఆంధ్రజ్యోతి ముందే కూసింది
ఏం చేస్తున్నావ్ సామీ! ఏంది ఈ పాలన
మింగడంలో శభాష్ అనిపించుకున్నారు
హైదరాబాద్ లో ఇక నీళ్లే నీళ్లు.. ఇంకుడు గుంత ప్రభావం
57లో 20.. పాపం వారి పరిస్థితి ఏంటో?
ఛీ..కొట్టించుకుంటున్న చంద్రబాబు నాయుడు
కాపీ క్యాట్ పవన్.. జగన్‌ను ఫాలో అవుతున్న జనసేనాని
పిట్టల దొరను మించిన మాటల దొర
ఏలూరు వెనక ఇంత కథ ఉందా?
తమ్ముడు ఎవరిని ప్రశ్నిస్తాడు?
వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?
కుక్కలు చించిన విస్తరే.. ఎన్టీఆర్ పార్టీ పెడితే

Comments

comments