మ్యాచ్ ఓడినా.. ధోనీ మాత్రం గెలిచాడు

Indian loss newzeland match but MS Dhoni won

ఎన్ని ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడినా.. ఎన్ని రికార్డులు సృష్టించినా.. సొంతగడ్డపై ఆడటమంటే క్రీడాకారులకు కాస్త తడబాటు ఉంటుంది. సచిన్ వంటి మహామహులు కూడా చాలా సందర్భాల్లో సొంతగడ్డపై అభిమానులను అలరించలేకపోయారు. వండే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సైతం న్యూజీలాండ్ తో జరిగిన 4వ వన్డేలో సొంతగడ్డ రాంచీలో విఫలయ్యాడు. తమ అభిమాన ఆటగాడు వస్తున్నాడని జార్ఖండ్ మొత్తం రాంచీలో వాలిపోయిన సందర్భంలో.. ధనాధన్ ఫటాఫట్ ఆటను ప్రదర్శిస్తాడనుకున్న ధోనీ 31 బంతులు ఎదుర్కొని కేవలం 11 రన్స్ కే ఔట్ కావడం ఫ్యాన్స్ ను ఎంతో నిరాశకు గురిచేసింది. ధోనీ ఆటను కళ్లారా తిలకిద్దామని వచ్చిన అభిమానులు ధోనీ ఔట్ కాగానే చాలా వరకు స్టేడియం వదిలి వెళ్లిపోయారు.

ధోనీ బ్యాటింగ్ విషయంలో నిరాశ చెందిన ఫ్యాన్స్.. ఫీల్డింగ్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు. కారణం.. వికెట్లను చూడకుండా స్టంప్ చేయడం. గేమ్ టాక్టిక్స్ లో అత్యంత తెలివి ప్రదర్శించే ధోనీ.. కీపింగ్ లో తనకు తానే సాటి అని ఇప్పటికే చాలా సార్లు నిరూపించుకున్నాడు. అయితే 4వ వన్డేలో ధోనీ చేసిన స్టంప్ ఔటు అందరినీ ఆశ్చర్య పరిచింది. 46వ ఓవర్ లో ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో రాస్ టేలర్ బంతిని ఫైన్ లెగ్ వైపు కట్ చేశాడు. ఒక పరుగు తీసి రెండో పరుగు కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో బాల్ ను కులకర్ణి ధోనికి విసిరాడు. మెరుపు వేగంతో అందుకున్న ధోనీ వెనక్కు తిరగకుండా.. వచ్చిన బాల్ ను వచ్చినట్లే రివర్స్ లో వికెట్స్ కు విసిరాడు. అత్యంత వేగంగా ధోనీ చేసిన స్టంప్ ఔటు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇలాంటి టెక్నిక్ కేవలం ధోనీకే సాధ్యమని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఇక ఈ మ్యాచ్ లో ఇండియా ఓడినా.. ధోనీ మాత్రం అభిమానుల మనసు గెలుచుకున్నాడని చెప్పవచ్చు.

Related posts:
ఒలంపిక్స్ లో దారుణం.. అథ్లెట్ కల చెదిరింది
లవ్ స్టోరీ @రియో ఒలంపిక్స్
మువ్వన్నెలు మురిసె.. కాంస్యం సాక్షిగా భారత్ మెరిసె
సాక్షిమాలిక్ విజయప్రస్థానం ఇది
రియోలో ఓడినా.. భారతీయుల మనసులు గెలిచింది
అడుగుదూరంలో సింధు బంగారం
శివంగిలా రెచ్చిపోయిన సింధు.. బెదిరిపోయిన ప్రత్యర్థి
సింధూకు చాముండేశ్వర్నాధ్ భారీ గిఫ్ట్
గెలిచిన తర్వాత సింధూ ఏమందో తెలుసా..?
సాక్షి మాలిక్‌కి పతకం ఎలా వచ్చిందో తెలుసా.. రెప్‌ఛేజ్ అంటే ఏమిటంటే..
పివి సింధు గెలిచింది సిల్వర్ మెడల్ కాదు.. 125 కోట్ల మనసులు
ఆ బంగారం ఒక్కటే బంగారమా..?
భరత మాత ముద్దుబిడ్డ దీపా మాలిక్
మరో బంగారం.. జావెలిన్ లో దేవేంద్ర జజారియా గోల్డ్ మెడల్
నెంబర్ వన్ గా టీమిండియా.. అరుదైన రికార్డ్ క్రియేట్
కారు వద్దు అంటున్న ఒలంపిక్స్ విజేత ఎందుకంటే
చిన్నోడిని పెళ్లి చేసుకుంటున్న సాక్షి
వన్డేలో టీమిండియా విజయం
రెండో వన్డేలో ఓడిన టీమిండియా
నెహ్వాల్ ఆట ముగిసిందా..?
మూడో టెస్ట్ లో మనదే విజయం
సిరీస్ టీమిండియా సొంతం
ముచ్చటగా ట్రిపుల్ సెంచరీ
రెండో మ్యాచ్‌లో ఊపేసిన టీమిండియా

Comments

comments