చైనాకు టెర్రర్ మరక.. భారత్ ఎత్తుగడకు డ్రాగన్ ఉక్కిరిబిక్కిరి

India step aganist china

భారత్ బద్ధ శత్రవు పాకిస్థాన్ కు చెక్ చెబుతోంది. యురీ ఘటన తర్వాత భారత్ పాకిస్థాన్ ను అన్ని విధాలుగా అడ్డుకుంటోంది. అందులో భాగంగా విదేశాంగ విధానంతో అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్ ను ఏకాకి చేసిన భారత్.. తాజాగా చైనా మీద కూడా దాడికి దిగుతోంది. గతంలో భారత్ పాకిస్థాన్ ను కట్టడి చేసేందుకు సింధు నదిపై కొన్ని చర్యలకు ఉపక్రమిస్తే.. అందుకు బదులుగా చైనా బ్రహ్మపుత్ర నదిపై కొన్ని ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అలాగే ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి కూడా చైనా అడ్డుతగిలింది. దాంతో పాటుగా భారత్ మసూద్ అహ్మద్ లాంటి పాకిస్థాన్ ఉగ్రవాదులను అంతర్జాతీయ ఉగ్రవాదులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తుంటే.. చైనా మాత్రం మన వాదనను నీరుగారుస్తోంది. ఇలా భారత్ కు గుదిబండగా మారిన చైనాపై భారత్ యుద్ధానికి దిగింది.

యుద్ధం అంటే భారత్ నేరుగా చైనా మీద నేరుగా ఆయుధాలతో కాకుండా.. పరోక్షంగా యుద్ధానికి దిగింది. బ్రిక్స్ సమావేశాల్లో చైనాను కార్నర్ చేసేలా భారత్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే రష్యాతో కలివిడిగా మెలుతున్న భారత్ చైనాను బ్రిక్స్ లో ఎలాగైనా కార్నర్ చెయ్యాలని ఫిక్స్ అయింది. పాకిస్థాన్-చైనా ఇండస్ట్రియల్ కారిడార్ మీద, ఐక్యరాజ్య సమితిలోని అంతర్జాతీయ భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశంగా భారత్ ను చైనా వ్యతిరేకించడం మీద, అలాగే జైషే అహ్మద్ చీఫ్ మసూద్ అహ్మద్ ను అంతర్జాతీ ఉగ్రవాదిగా ప్రకటించడంలో చైనా వేసిన అడుగులను భారత్ బ్రిక్స్ వేదికగా అడగనుంది. ఇప్పటికే భారత్ అనధికారంగా చైనా వస్తువుల బహిష్కరణు పాటిస్తుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చైనా తాజాగా బ్రిక్స్ లో భారత్ దెబ్బను ఎలా తట్టుకుంటుంది అనేది చూడాలి. మొత్తానికి భారత్ పాకిస్థాన్ తర్వాత చైనాను కూడా టార్గెట్ చేస్తోంది.. ఆ దిశగా మోదీ అడుగులు వేస్తున్నారు.

Related posts:
ఇండియా, పాక్ మధ్యలో తెలంగాణ కేసు
టిఆర్ఎస్‌తో బిజెపి మైండ్ గేమ్
ఉగ్రవాదుల టార్గెట్ హైదరాబాద్ ఎందుకు..?
తెలంగాణలో యుద్ధానికి ఆ వర్గం
మోదీ అంటేనే చిరాకుపడుతున్న ఆ గ్రామస్తులు.. ఎందుకంటే
తెలుగువాళ్లను వెర్రివెంగళప్పలను చేస్తున్నారే..?!
ఎవడిచ్చాడు ఆ ర్యాంకులు...?
ఆ అద్భుతానికి పాతికేళ్లు
మల్లన్న సాగర్ కు మొదటి బలి హరీష్ రావు
వాడు మగాడ్రా బుజ్జి కాదు.. నిజమైన హిజ్రా వీడేరా
‘గతుకుల’ హైదరాబాద్ అసలు లోపం అదే
చిరుకు పవన్ అందుకే దూరం
పవన్ హైజాక్ చేశాడా..? జగన్ పరిస్థితి ఏంటో..?!
పవన్ మాస్టర్ స్కెచ్
చంద్రుడి మాయ Diversion Master
ఆళ్లరామకృష్ణ నైతిక విజయం
ముంచింది కమ్యూనికేషన్ గ్యాపే
చంద్రబాబుకు పవన్ లెంపకాయ
ప్రత్యేక హోదా లాభాలు
పవన్ పనికిమాలిన స్ట్రాటజీ అదే!
కేవలం 57 సీట్లు మాత్రమే ఎందుకు?
రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి... కేసీఆర్ సర్కార్‌కు సూచన
ఈ దారుణాన్ని అడ్డుకునేదెవరు?
శశికళ ‘సిఎం’ స్ట్రాటజీ

Comments

comments