భారత్‌కు స్విస్ అకౌంట్ల వివరాలు

India will get Swiss accounts details soon

దేశం మొత్తం ఎదురుచూస్తున్న నల్లధనం వెల్లడిలో కేంద్రం ఒక్కో అడుగు ముందుకేస్తోంది. అందులో భాగంగా మోదీ చేసుకున్న ఓ పెద్ద డీల్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. తాజాగా కేంద్రం నల్లడబ్బును వెలికితియ్యడానికి పెద్దనోట్ల రద్దు ప్రకటన సంచలనంరేపగా.. మరో విషయం అందరికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తోంది. అదేమిటంటే.. మన వాళ్లు విదేశాల్లో, ముఖ్యంగా స్విట్జర్లాండ్ లో తమ నల్లడబ్బును దాచుకున్నారు. అయితే మోదీ చొరవతో స్విస్ బ్యాంకు ఖాతాల్లో ఉన్న నల్లధనం మీద వివరాలను వెల్లడించడానికి అక్కడి ప్రభుత్వం ముందుకు వచ్చింది. అవును అక్కడ డబ్బును దాచుకున్న వారి వివరాలను అందించడానికి స్విట్జర్లాండ్ ముందుకు వచ్చింది.

స్విస్ బ్యాంకు ఖాతాల్లో దాచుకున్న డబ్బుల వివరాలను వెల్లడించానికి స్విట్జర్లాండ్ అంగీకరించింది. అయితే ఇప్పటికిప్పుడు కాకపోయినా కానీ సెప్టెంబరు 2018 నాటికి స్విస్‌ బ్యాంకుల్లో ఖాతాలున్న భారతీయుల వివరాలను అందించడానికి స్విట్జర్లాండ్‌ అంగీకరించింది. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. అదేమిటంటే 2018 సెప్టెంబరు నాటికి ఉన్న ఖాతాల వివరాలను మాత్రమే అందిస్తారు. అంతకు ముందు ఉన్న ఖాతాల వివరాలను మాత్రం వెల్లడించరు. అంటే ప్రస్తుతం స్విస్‌ బ్యాంకులో ఖాతా ఉన్నప్పటికీ 2018లోపు దానిని మూసివేసుకుంటే ఆ ఖాతాదారుడి వివరాలను మాత్రం ఇవ్వబోరు. కాగా అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఆటోమేటిక్‌ ఎక్సేంజ్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌(ఏఈవోఐ)కు స్విట్జర్లాండ్‌ అంగీకరించింది. దీని ప్రకారం స్విస్‌ బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న భారతీయుల తొలిజాబితా 2019 సెప్టెంబరులో అందనుంది. అయితే దీనిపై చాలా మంది పెదవి విరుస్తున్నారు. పైగా మరో ట్విస్ట్ కూడా ఉంది. 2019 నాటికి మోదీ పదవీకాలం కూడా ముగుస్తుంది.

Related posts:
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
కబాలీగా మారిన చంద్రబాబు నాయుడు
నాలుగేళ్లకే బ్యాట్ పట్టిన బుడ్డోడు(వీడియో)
అలా వస్తే పెట్రోల్ ఫ్రీ .. అది కూడా ఫుల్ ట్యాంక్
గుత్తాజ్వాల, సైనా గురించి సింధూ చెప్పిన నిజాలు
ప్రత్యేక హోదా పై ‘పవర్’ పంచ్
ఆ సినిమా స్టోరీలన్నీ చంద్రబాబు నాయుడివే...?!
ఏపీ బంద్.. హోదా కోసం
ప్రత్యేక దగ.. ఏపికి జరిగిన ద్రోహంపై ఉండవల్లి
హైదరాబాద్‌లో కూల్చివేతలు షురూ
యుద్ధం మొదలైందా..? పాకిస్థాన్ మీద భారత్ దాడి
అమ్మ తర్వాత అమ్మ.. ఎవరు ఈమె?
రూపాయికే స్మార్ట్ ఫోన్.. ఎలా అంటే
చంద్రబాబు ఆస్తులు ఇవేనట!
బిచ్చగాళ్లు కావలెను
నోట్ల రద్దుపై బిల్ గేట్స్ ఏమన్నారంటే?
ప్రభుత్వం ఓడింది.. ప్రజలూ ఓడిపోయారు
అమ్మను పంపించేశారా?
ముద్రించిన నోట్లు నేరుగా ఆ ఇంటికే
దిల్‌సుఖ్‌‌నగర్ బాంబ్ పేలుళ్ల బాధితులకు ఉరిశిక్ష
డీమానిటైజేషన్ పై పవన్ ఏమన్నాడంటే..
అందుకే భూకంపం రాలేదట
అప్పుడు చిరు బాధపడ్డాడట

Comments

comments