మెరుపు దాడి… నిజమా-కాదా?

Indian Army Surgical Strike real or fake

పాకిస్థాన్ ఉగ్రవాదులు ఉరీ ఘాతుకానికి పాల్పడిన తర్వాత భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్(మెరుపుదాడి) నిర్వహించింది. పాకిస్థాన్ భూభాగంలో ఉన్న పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులను మన ఆర్మీ అధికారులు మట్టుబెట్టారు. ఇందులో దాదాపుగా 40 మంది చనిపోయారని, అందులోనూ ఇద్దరు పాకిస్థాన్ సైనికులు ఉన్నారని భారత్ తెలిపింది. అయితే భారత్ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ ను ప్రపంచ దేశాలు అన్ని కూడా స్వాగతించాయి. ఉగ్రవాద వ్యతిరేక దాడులకు తాము ఎప్పుడూ మద్దతుగా నిలుస్తామని బాసటగా నిలిచాయి.

భారత ఆర్మీ అసలు సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించనేలేదని పాకిస్థాన్ వాదిస్తోంది. భారత ఆర్మీని పాకిస్థాన్ సైనికులు ఖంగుతినిపించారని అక్కడి ఆర్మీని ఓ వీడియోను పాక్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసింది. అయితే అది డూప్లికేట్ వీడియో అని భాతర ఆర్మీ వెల్లడించింది. కాగా నవాజ్ షరీఫ్ తో సహా, ఆర్మీ చీఫ్ కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదని అంటున్నారు. అందుకుగాను అంతర్జాతీయ మీడియా సిబ్బందిని బోర్డర్ కు తీసుకెళ్లి మరీ చూపించారు. ఎక్కడా ఎలాంటి దాడులు జరగలేదని, భారత్ గొప్పల కోసం మాత్రమే అలా చేస్తోందని పాకిస్థాన్ వాదిస్తోంది. మరో పక్క హఫీజ్ సయీద్ మాత్రం భారత్ కు అసలు సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఏమిటో రుచిచూపిస్తామంటూ హెచ్చరించారు.

భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ ఆ దాడులకు సంబందించిన వీడియోను రిలీజ్ చెయ్యాలని డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ తో పాటుగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సర్జికల్ స్ట్రైక్స్ వీడియోను విడుదల చెయ్యాలని పట్టుబట్టారు. కాగా కేజ్రీవాల్ డిమాండ్ ను అన్నా హజారే వ్యతిరేకించారు. భారత ఆర్మీ గురించి అలాంటి వ్యాఖ్యలు చెయ్యడం తగదు అని అన్నారు.

పాకిస్థాన్ దొంగ బుద్ధి గురించి ముందే తెలిసిన భారత ఆర్మీ మొత్తం సర్జికల్ స్ట్రైక్స్ ను వీడియో తీసింది. దాంతో ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సర్జికల్ స్ట్రైక్స్ వీడియోను విడుల చేసేందుకు భారత ఆర్మీ రెడీ అయింది. ఈ మేరకు భారత హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ ‘‘జస్ట్ వెయిట్ అండ్ వాచ్’’ (ఆగడం.. చూడండి) అని మీడియాకు స్టేట్ మెంట్ ఇచ్చారు. మొత్తంగా పిఎంవో అనుమతితో రేపు సర్జికల్ స్ట్రైక్స్ వీడియోను విడుదల చెయ్యాలని భారత ఆర్మీ డిసైడ్ అయింది. దాంతో భారత్ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ నిజమా కాదా..? అనేది తేలిపోనుంది. మరి చూడాలి ఆ వార్ సీన్స్ ఎలా ఉన్నాయో?!

Related posts:
కేసీఆర్ సమర్పించు మోదీ చిత్రం
బిజెపితో టిఆర్ఎస్ దోస్తీ.. టిడిపిలో ముసలం
అడకత్తెరలో కేసీఆర్
సింధుకు సరే.. శ్రీకాంత్ కు ఏదీ సహకారం
బాబు నిర్లక్ష్యానికి సచివాలయమే సాక్షి
చిరుకు పవన్ అందుకే దూరం
మెగా ఫ్యామిలీ పొలిటికల్ స్కెచ్
చంద్రుడి మాయ Diversion Master
దీక్షల వల్ల వచ్చేదేముంది..?
మద్యల నీ గోలేంది..?
14వ ఫైనాన్స్ కమీషన్ ఎలా ఆలోచించింది..?
ఆరిన దీపాల మధ్య పవన్ ఆవేదన
స్విస్ ఛాలెంజ్ కు హైకోర్టు స్టే.. చంద్రబాబుకు షాక్
ప్రత్యేక హోదా లాభాలు
దేశం మెచ్చిన జేమ్స్ బాండ్.. ధోవల్ అంటే పాక్ హడల్
సర్జికల్ స్ట్రైక్ క్రెడిట్ ఎన్నికల్లో ఓ పాచికా?
ఆస్పత్రులే నరకానికి రహదారులు?
బాబుకు అవకాశం లేదు... కేసీఆర్ కు తిరుగులేదు
ఒక్క అడుగు.. అదే బాటలో జననేత
రాత్రే మోదీ ‘నోట్ల’ ప్రకటన ఎందుకు?
పవన్ క్షమాపణలు చెప్పాలి
జనం అవస్థలను కళ్లకుకట్టిన జగన్
ఆ కంపెనీ దెబ్బకు పేటిఎం ఢమాల్!
మోదీ మంచి చేస్తే భయం ఎందుకు?

Comments

comments