మెరుపుదాడి నిజమే.. ఇదిగో సాక్ష్యం

Indian Army Surgical Strike was true

భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్(మెరుపుదాడి) చేసిందా? లేదా..? అనే అనుమానాలకు దాదాపుగా ఓ క్లారిటీ లభించింది. అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్లతో సహా కొన్ని పొలిటికల్ పార్టీలు కూడా సర్జికల్ దాడికి సంబందించిన సాక్ష్యాలను చూపించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ కు సంబంధించిన వీడియోను విడుదల చెయ్యడానికి సిద్ధంగా ఉందని తేలిపోయింది. భద్రతా కారణాల దృష్యా ఆ వీడియోను విడుదల చెయ్యాలా..? వద్దా..? అన్న దానిపై తీవ్ర చర్చ సాగుతోంది. కాగా సర్జికల్ స్ట్రైక్ జరిగింది అని చెప్పడానికి ఓ బలమైన సాక్ష్యం లభించింది.

పాకిస్థాన్ భూభాగం మీద మన ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ తో తుగ్గురేపిందని అక్కడి పోలీస్ ఉన్నతాధికారే వెల్లడించడంతో కుండబద్దలైంది. సర్జికల్ స్ట్రైక్ జరిగిందా.? లేదా? అనే దానిపై గత కొన్ని రోజులుగా సాగుతున్న చర్చకు దాదాపుగా ఓ ముగింపు లభించినట్లే.  ‘సర్జికల్ స్ట్రైక్స్ నిజమేనా? ఎలా? జరిగాయి? ఏ సమయంలో జరిగాయి? మన ఆర్మీ ఎలా స్పందించింది?’ అన్న ప్రశ్నలకు ఓ పాకిస్థాన్ ఉన్నతాధికారి సమాధానాలిచ్చి.. అందరికి సర్జికల్ దాడి మీద ఉన్న అనుమానాలను తొలగించాడు.

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని మీర్పూర్ రేంజికి చెందిన స్పెషల్ బ్రాంచి ఎస్పీ అయిన గులాం అక్బర్ వెల్లడించిన వివరాలు భారత ఆర్మీ సర్జికల్ దాడికి దిగింది అని తేలిపోయింది. కాగా భారత ఆర్మీ దాడిలో పాకిస్థాన్ సైనికులు చనిపోయినట్లు భావిస్తున్న ఇద్దరు సైనికుల గురించి కూడా ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఆ ఘటనలో చనిపోయింది ఇద్దరు పాకిస్థానీ సైనికులు కాదని.. ఐదుగురు పాకిస్థాన్ సైనికులు చనిపోయినట్లు ఆయన వెల్లడించారు. సైన్యం ఉగ్రవాదులకు ఎలా సహకరిస్తుందో కూడా ఆయన తన మాటల్లో వివరించాడు.

‘సర్.. అది రాత్రి సమయం. ఒక్కసారిగా కాల్పులు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు జరుగుతూనే ఉన్నాయి. సుమారు 3 నుంచి 4 గంటల పాటు కాల్పులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఒక్కసారిగా దాడులు ప్రారంభం కావడంతో పాకిస్థానీ సైనికులకు ఏం చేయాలో దిక్కు తోచలేదు. వారు తేరుకునే లోపే ఐదుగురు సైనికులు తూటాలకు బలయ్యారు. ఉగ్రవాదులు కూడా పెద్దఎత్తునే చనిపోయారు. వెంటనే అందరి మృతదేహాలను ట్రక్కులో వేసుకుని పాక్ సైన్యం వెళ్లిపోయింది. అయితే ఎంతమంది ఉగ్రవాదులు మరణించారో మాత్రం లెక్క సరిగ్గా తెలీదు’ అని గులాం అక్బర్ తెలిపారు.

భారత సైన్యం దాడులు జరిపిన ప్రాంతాల పేర్లు కూడా ఆయన చెప్పడం గమనార్హం. సర్జికల్ స్ట్రైక్స్ తరువాత తేరుకున్న పాకిస్థానీ సైన్యం ఆ ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పట్టిందని అన్నారు. అందులో భాగంగా ఉగ్రవాదులు సరిహద్దులు దాటి భారత్‌లో ప్రవేశించడానికి పాకిస్థాన్ సైన్యం సాయం చేస్తోందని కూడా ఆయన వివరించారు. మొత్తానికి సర్జికల్ దాడి మీద ప్రభుత్వం వీడియోను విడుదల చెయ్యాలా.?వద్దా.? అనే చర్చ సాగుతున్నప్పుడే ఈ ఆధారాలు బయటపడటం మీడియాలో సంచలనం రేపుతోంది.

Related posts:
ఇది గూగుల్ సినిమా(వీడియో)
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
ఫ్రాన్స్ లో ఘోరం.. 84 మంది మృతి
మోదీకి సిద్దు బల్లే భలే షాక్
బకరా మంత్రిని అనుకుంటున్నావా..? హరీష్ రావు ఆగ్రహం
కృష్ణానదిలో ‘పిరానా’ చేపలు..?
నాలుగేళ్లకే బ్యాట్ పట్టిన బుడ్డోడు(వీడియో)
గ్రౌండ్ లో రాందేవ్ బాబా ఏం చేశాడంటే..
గుజరాత్ సిఎం రాజీనామా
జగన్ అన్న.. సొంత అన్న
రైనోకు పిఎంను మించిన సెక్యూరిటీ ఎందుకంటే
జియో దిమ్మతిరిగే ఆఫర్లు ఇవే..
ఈ SAM ఏంటి గురూ..?
నాయుళ్లను ఏకిపారేసిన జగన్
ప్రత్యేక హోదా వచ్చితీరుతుంది
విమానంలో చక్కర్లు కాదు.. రైతులకు న్యాయం కావాలి
చెరువుల్లో ఇక చేపలే చేపలు
ప్యాంటు తడిసినా పొగరు తగ్గలేదా?
రూపాయికే స్మార్ట్ ఫోన్.. ఎలా అంటే
దిగజారుతున్న చంద్రబాబు పాలన
బ్లాక్ మనీపై మోదీ సర్జికల్ స్ట్రైక్
బిచ్చగాళ్లు కావలెను
పెద్దనోట్ల కారణంగా ఆగిన పెళ్లి
బాబును వదిలేదిలేదు

Comments

comments