కరెన్సీ కష్టాలు ఇంకో ఐ..దా..రు నెలలా?!

Indian currency problems will be for five or six months

దేశంలో అందరూ ఎదుర్కొంటున్న కరెన్సీ కష్టాల నుండి ఎప్పుడు గట్టెక్కుతామా? అని సర్వత్రా చర్చ జరుగుతోంది. మరి ఆ కరెన్సీ కష్టాలు ఎప్పటికి తీరతాయో ఓ అంచనా వేస్తే.. ఆ అంచనా వింటే మాత్రం మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇంతకీ కరెన్సీ కష్టాలు ఎప్పటికి తీరతాయో తెలుసా? ఐదు నెలలపాటు దేశ ప్రజలను కరెన్సీ కష్టాలు వీడే అవకాశం లేదని బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులు అంటున్నారు. దేశవ్యాప్తంగా ఆర్‌బిఐకి నాలుగు కరెన్సీ ముద్రణాలయాలు ఉన్నాయని.. ఈ నాలుగు ముద్రణాలయాల్లో నిర్విరామంగా డబ్బులు ముద్రిస్తే తప్ప ఆరు నుంచి ఏడు నెలల్లో నగదు సమస్య తీరదని చెప్పారు.

ఆర్‌బిఐ విధానాలు దారుణంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 85 శాతం మంది ప్రజలు ప్రభుత్వ రంగ బ్యాంకు (పిఎస్‌బి)లలో ఖాతాదారులుగా ఉన్నారని వారు చెప్పారు. కేవలం 14 శాతం మంది ప్రైవేటు బ్యాంకుల్లో ఖాతాదారులుగా ఉన్నారని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ వేల కోట్ల రూపాయలను ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో జమ చేసిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు డబ్బులు అవసరం మేరకు ఇవ్వడం లేదని వారు చెప్పారు. ఇంత విపరీత పరిస్థితులను ఎందుకు కల్పించారు? దీనంతటికీ కారణం ఎవరు? ఇలాంటి సమస్యలపై పరిష్కారాలు ఏమిటి? అని వారు అడిగారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ప్రాణాలు కోల్పోతున్నారని వారు మండిపడ్డారు.

ప్రైవేటు బ్యాంకులకు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులకు ఇవ్వడానికి ఉన్న ఇబ్బందులు ఏమిటని ఫెడరేషన్‌ ప్రతినిధులు ఆర్‌బిఐని తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో దేశ ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని వారు మండిపడ్డారు. ఈ ఏడాది మార్చి వరకు 15,707 మిలియన్ల 500 రూపాయల నోట్లు, 6,326 మిలియన్ల 1000 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయని వారు చెప్పారు. ఇంత పెద్ద స్థాయిలో నోట్లను రద్దు చేస్తున్నప్పుడు మన దగ్గర ఉన్న నిల్వలు, ముద్రించగల సామర్థ్యాన్ని చూసుకోరా అని వారు ప్రశ్నించారు. దానికి తోడు ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయని, నోట్లు అందుబాటులో ఉన్నాయని అబద్ధాలు చెబుతున్నారని వారు మండిపడ్డారు. ప్రైవేటు బ్యాంకుల్లో పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్టు తమకు సమాచారం అందుతోందని వారు తెలిపారు. భారీ ఎత్తున డిపాజిట్లు ఉన్న తాము వెళ్లి ప్రైవేటు బ్యాంకులు, ఇతర రాష్ట్రాలను అడుక్కోవాల్సిన అవసరం ఏమిటని వారు ఆర్బీఐ, కేంద్రాన్ని నిలదీశారు.

Related posts:
గోమూత్రంలో బంగారు.. నిజంగా నిజం
వాళ్లకు ఎంపీలను మించిన జీతాలు
నిధులు కృష్ణార్పణం.. అవినీతి ఆంధ్రప్రదేశ్
ఎవరీ జకీర్..? ఉగ్రవాదులతో సంబందం ఏంటి..?
ఆరిపోయే దీపంలా టిడిపి?
ఫ్లెక్సీలందు కేటీఆర్ ఈ ఫ్లెక్సీవేరయా
సల్మాన్ ఖాన్ నిర్దోషి
పివి సింధుకు కేసీఆర్ 5 కోట్ల నజరానా
ఏపీ బంద్.. హోదా కోసం
ప్రత్యేక దగ.. ఏపికి జరిగిన ద్రోహంపై ఉండవల్లి
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
అమ్మకు ఏమైంది?
నయీం కేసులో ఆర్.కృష్ణయ్య విచారణ
లోకేష్ కామెడీ చేసే విలన్ కు తక్కువ
వంద, యాభై నోట్లు ఉంటాయా?
అప్పు 60 రోజులు ఆగి చెల్లించవచ్చు.. కేంద్రం తీపి కబురు
కేవలం 500 రూపాయిల్లో పెళ్లి
ప్రభుత్వం ఓడింది.. ప్రజలూ ఓడిపోయారు
దేశభక్తి అంటే ఇదేనా?
నగదుపై కేంద్రం గుడ్ న్యూస్
మోదీ వేసిన ఉచ్చులో మాయావతి
నరేంద్ర మోదీ తెచ్చిన భీం యాప్ గురించి తెలుసా?
‘రేటు తగ్గించు.. లేదంటే కాల్చేస్తా’
AP 70% జనాభా పల్లెల్లోనే..!

Comments

comments