ఆధార్ ఉంటే చాలు..క్యాష్ లేకున్నా ఓకే

Indian govt proposed to Aadhar card for cashless service

మోదీ నిర్ణయంతో దేశం మొత్తం క్యాష్ లెస్ వైపు అడుగులు వేస్తోంది. దేశంలో నగదు వాడకాన్ని తగ్గించి, మొత్తం ఆన్ లైన్ ద్వారా చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తోంది. అయితే క్యాష్ లెస్ కావాలి అంటే అందరూ కూడా మనీ ట్రాన్సఫర్, బిల్ పేమెంట్స్, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ లో నగదు లేకుండా డబ్బు చెల్లించే కెపాసిటి ఉండాలి. అయితే దీని కోసం సరికొత్త క్యాష్ లెస్ సేవల వైపు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్. ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ అనుసంధానం అయ్యిందని.. గ్యాస్ సబ్సిడీ కూడా ఆధార్ అనుసంధానం ద్వారా బ్యాంక్ లో నగదు పడుతుందన్నారు.

ఆధార్ నంబర్ ఎంట్రీ చేసి.. వేలి ముద్ర వేస్తే చాలు.. ఎలాంటి పిన్, కార్డ్ లేకుండా నగదు లావాదేవీల విధానంపై ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారాయన. కమిటీ మొదటి మీటింగ్ లో ఈ విధానాన్ని పరిశీలిస్తామన్నారాయన.కార్డ్ లెస్, పిన్ లెస్ మరియు క్యాష్ లెస్ సొసైటీని ఒక్క ఆధార్ నంబర్ తో సాధించవచ్చన్న కోణంలో ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. ప్రపంచంలోనే నగదు రహిత లావాదేవీలు ఏ దేశంలో నడుస్తున్నాయో స్టడీ చేయనుంది. భారత్ ను నోట్ల రద్దు ప్రభావంతో నెలకొన్న సందిగ్ధతకు ఈ కమిటీ సూచనలిస్తుందన్నారు కమిటీలో భాగస్వామ్ములైన నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్.

నోట్ల రద్దుతో దేశం క్యాష్ లెస్ ఎకానమీ దిశగా అడుగులు వేస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో.. డిజిటల్ లావాదేవీల వైపు అందరూ అడుగులు వేయాలని మన్ కీ బాత్ ద్వారా ప్రజలను కోరారు మోడీ. ఫేక్ కరెన్సీ, బ్లాక్ మనీ నిల్వలు దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయన్నారాయన. వరల్డ్ ది బెస్ట్ క్యాష్ లెస్ సొసైటీగా భారత్ ను మార్చడానికి ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సభ్యులుగా చేర్చుతూ నీతి ఆయోగ్ కేంద్ర కమిటీని ప్రకటించింది. ఈ దిశగానే డిజిటల్ అధ్యయన కమిటీ చర్చిస్తుంది.

Related posts:
సల్మాన్ పరిస్థితి రేప్ చేసిన మహిళగా మారిందట
మైఖేల్ జాక్సన్.. ఓ కామాంధుడు..?
పెట్రోల్ లీటర్‌కు 250
దాని వల్లే చంద్రబాబు ర్యాంకు గల్లంతట
తాగుబోతుల తెలంగాణ!
గుజరాత్ సిఎం రాజీనామా
అతడు బ్రతికినప్పుడు బిచ్చగాడు.. చచ్చాక కోటీశ్వరుడు
గ్యాంగ్ స్టర్ నయీం ఎవరో తెలుసా..?
వత్తిళ్లతో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై
తెలుగు రాష్ట్రాలకు నాలుగు ఎయిర్‌పోర్టులు
పది వేల ఉద్యోగాలు పాయే... ఇదంతా చంద్రబాబు పుణ్యమే!
ఇండియన్ ఆర్మీపై అక్షయ్ కుమార్ అదిరిపోయే ట్వీట్
సదావర్తి సత్రం షాకిచ్చింది
చంద్రబాబుకు అదే ఫ్యాషన్
సల్మాన్ ను వదలని కేసులు
అర్నాబ్ గోస్వామి రాజీనామా ఎందుకు? సోషల్ మీడియాలో వెరైటీ స్పందన
పాత 500, 1000 నోట్లు మార్చుకోండి ఇలా
దివీస్ పై జగన్ కన్నెర్ర
ట్రంప్, పుతిన్ లను మించిన మోదీ
ఆ 400 మంది సాక్షిగా పవన్ ప్రమాణం
ఏపికి డబ్బేది? జగన్ ప్రశ్న
పార్టీ నుండి ముఖ్యమంత్రినే సస్పెండ్ చేశారు ఎందుకంటే..
బీసీసీఐకి సుప్రీం షాక్
AP 70% జనాభా పల్లెల్లోనే..!

Comments

comments