భరత మాత ముద్దుబిడ్డ దీపా మాలిక్

India's Daughter Deepa malik

భారత్‌కు మరో తీపికబురు. సమ్మర్‌ ఒలింపిక్స్‌లో కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూసినా తీవ్ర జాప్యానంతరం భారత్‌ బోణీ కొట్టింది. కానీ దివ్యాంగులు మాత్రం మేము మినహాయింపంటు పతకాలతో మోతెక్కిస్తున్నారు. షాట్‌పుట్‌లో మాలిక్‌ దీపా పర్సనల్‌ బెస్ట్‌ 4.61 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకున్నది. పర్సనల్‌ బెస్ట్‌తో ఫైనల్‌కు అర్హత సాధించిన దీపా ఫైనల్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నది. షాట్‌పుట్‌లో ఆరు చాన్స్‌లలో దీపా 4.61 మీటర్లు విసరింది. క్వాలిఫయింగ్‌ రౌండ్‌ నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన దీపా ఫైనల్‌లో కూడా అదే ప్రదర్శనతో కట్టిపడేసింది. మొత్తంగా పారాలో మూడో పతకాన్ని భారత్‌ తన ఖాతాలో వేసుకున్నది. అంతకు ముందు మరియప్పన్ తంగవేల్ గోల్డ్ మెడల్ ను, వరుణ్ భాటి బ్రాంజ్ ను సాధించారు.

చీకటి నుండి వెలుగుల వైపు..
రియోలో సత్తా చాటిక దీపా మాలిక్ ను విధి వెక్కిరించింది. మాలిక్‌ భర్త సైనికాధికారి. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. దీపాకు 1999లో స్పైనల్‌ ట్యూమర్‌ (నరాల సంబరధిత వ్యాధి) సోకడంతో కాళ్లు చచ్చుబడిపోయాయి. చికిత్స కోసం 31 సర్జరీలు చేసుకున్నా లాభం లేకపోయింది. ఆరేళ్ల అనంతరం మాలిక్‌ వీల్‌ చైర్‌లోనే పారా గేమ్స్‌ వైపు మళ్లింది. దీపా కేవలం షాట్‌పుట్‌ మాత్రమే కాకుండా స్విమ్మింగ్‌, జావెలిన్‌ త్రో కూడా ఆడుతుంది.

ఖాళీ సమయాలల్లో మోటివేషన్‌ తరగతులు చెబుతూ ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేస్తుంది. షాట్‌పుట్‌ లోనే కాదు స్విమ్మింగ్‌, జావెలిన్‌ త్రోలో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కూడా సాధించింది. జావెలిన్‌ త్రోలో ఎషియన్‌ రికార్డు సొంతం చేసుకోవడంతో పాటు వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌లో సిల్వర్‌ మెడల్‌ కైవసం చేసుకున్నది. అంతేకాకుండా మాలిక్‌ ధైర్య సాహసాలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. లిమ్కా బుక్‌లో ఇప్పటికే తన పేరిట రెండు రికార్డులు లిఖించుకున్నది. యమునా నదిలో కిలో మీటర్‌ ఈత ఒకటి కాగా… రెండోది ప్రత్యేక బైక్‌ పై 58 కిలోమీటర్ల దూరం రైడింగ్‌ చేయడం. 2012లో దీపాకు అర్జున అవార్డు కూడా వచ్చింది. ఇలాంటి వాళ్లందరిని చూసి భరతమాత కూడా గర్వంతో పొంగుపోతోంది.

Related posts:
ఇండియన్ క్రికెట్ కోచ్ ఎవరో మొత్తానికి ఫైనల్ అయ్యింది.. ఎవరో తెలుసా?
ఒలంపిక్స్ లో దారుణం.. అథ్లెట్ కల చెదిరింది
సానియా, హింగిస్ ఎందుకు విడిపోయారు..?
సాక్షిమాలిక్ విజయప్రస్థానం ఇది
భారత్ కు సాక్షి ఇచ్చిన బహుమతి
రియోలో ఓడినా.. భారతీయుల మనసులు గెలిచింది
శివంగిలా రెచ్చిపోయిన సింధు.. బెదిరిపోయిన ప్రత్యర్థి
శభాష్ సింధు.. సోషల్ మీడియాలో నామస్మరణ
అరుపే గెలుపు
సింధూకు చాముండేశ్వర్నాధ్ భారీ గిఫ్ట్
సాక్షి మాలిక్‌కి పతకం ఎలా వచ్చిందో తెలుసా.. రెప్‌ఛేజ్ అంటే ఏమిటంటే..
యోగేశ్వర్‌దత్‌కు ఒలంపిక్స్‌లో సిల్వర్!
ఆ బంగారం ఒక్కటే బంగారమా..?
మరో బంగారం.. జావెలిన్ లో దేవేంద్ర జజారియా గోల్డ్ మెడల్
నెంబర్ వన్ గా టీమిండియా.. అరుదైన రికార్డ్ క్రియేట్
కారు వద్దు అంటున్న ఒలంపిక్స్ విజేత ఎందుకంటే
బౌలర్ అశ్విన్ వందేళ్ల రికార్డు
వన్డేలో టీమిండియా విజయం
నెహ్వాల్ ఆట ముగిసిందా..?
మూడో టెస్ట్ లో మనదే విజయం
సిరీస్ టీమిండియా సొంతం
ముచ్చటగా ట్రిపుల్ సెంచరీ
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి
రెండో మ్యాచ్‌లో ఊపేసిన టీమిండియా

Comments

comments