3వేల మందికి ఇన్ఫోసిస్ భారీ షాక్

Infosys may remove three thousand employees

దేశంలోనే రెండో అతిపెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీగా పేరున్న ఇన్ఫోసిస్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒకే దెబ్బతో దాదాపుగా3వేల మంది ఉద్యోగుల పరిస్థితి గందరగోళంగా మారినట్లు తెలుస్తోంది. పైగా ఇన్ఫోసిస్ ఆర్థిక లావాదేవీలు, స్టాక్ మార్కెట్లపై ఈ ప్రభావం కనిపించనుంది. రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ ఇచ్చిన షాక్ తో రానున్న ఆరు నెలల్లో దాదాపుగా 4 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతుంది అని అంచనా. మొత్తంగా ఇన్ఫోసిస్ కు చెందిన మూడు వేల మంది ఉద్యోగుల్లో ముఖ్యంగా భారత్ కు చెందిన ఉద్యోగుల్లో ఇప్పుడు భయం మొదలైంది.

అసలు ఏం జరిగింది:
ఐబిఎం, ఇన్ఫోసిస్ కంపెనీలతో రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ దాదాపుగా 30 కోట్ల డాలర్ల కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. బ్రిటన్ వరకు ఉన్న విలియమ్స్ అండ్ గ్లిన్ ను బ్యాంకుగా మార్చాలని అందుకు సంబందించిన సాఫ్ట్ వేర్లను  తయారు చెయ్యడానికి ఈ కాంట్రాక్ట్ ను కుదుర్చుకుంది. ఇందులో దాదాపుగా 20 కోట్ల డాలర్లు కేవలం ఇన్ఫోసిస్ తో మాత్రమే లావాదేవీలు నడిచాయి. అయితే అనుకోని కారణాల వల్ల రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ తన నిర్ణయాన్ని విరమించుకుంది. విలియమ్స్ అండ్ గ్లిన్ ను బ్యాంకుగా మార్చే ప్రయత్నాన్ని మానుకుంటున్నట్లు ప్రకటన చేసింది. దీంతో ఇన్ఫోసిస్ కు భారీ దెబ్బ తగిలింది.

ఉద్యోగులకు గండమే:
విలియమ్స్ అండ్ గ్లిన్ కార్యక్రమానికి సంబంధించి సలహా, అప్లికేషన్ డెలివరీ, టెస్టింగ్ సేవలు అందించేందుకు గాను ఇన్ఫోసిస్ భాగస్వామిగా ఉంది. ప్రత్యేకంగా కంపెనీ ఏర్పాటు చేయరాదన్న ఆర్‌బీఎస్ నిర్ణయం ఫలితంగా వచ్చే కొన్ని నెలల్లో 3 వేల మంది ఉద్యోగులను తొలగించాల్సి ఉంటుంది. ఇందులో ఎక్కువ మంది భారత్ నుంచే ఉంటారని ఇన్ఫోసిస్ తన ప్రకటనలో స్పష్టం చేసింది.  అతి తక్కువ వడ్డీ రేట్ల విధానం అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాంకులు, ఆర్థిక సేవల కంపెనీలకు ఇబ్బందిగా మారింది. దీనికి తోడు బ్రెగ్జిట్ పరిణామం ఆర్‌బీఎస్ వంటి బ్యాంకులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. ఈ పరిణామాలతో ఐటీ కంపెనీల బ్యాంకింగ్ సేవల వ్యాపారంపై ప్రతికూల ప్రభావం పడిందన్నది విశ్లేషకుల అంచనా. అమెరికాకు చెందిన దిగ్గజ ఐటీ సేవల కంపెనీ కాగ్నిజెంట్ 2016లో ఆదాయ అంచనాలను రెండు సార్లు తగ్గించడంతోపాటు, ఆర్థిక సేవల విభాగంలో గడ్డు పరిస్థితులే ఇందుకు కారణంగా పేర్కొనడాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

మొత్తంగా దేశంలోనే టాప్ కంపెనీగా ఉన్న ఇన్ఫోసిస్ కు ఆర్థికంగా భారీ నష్టాన్ని కలిగిస్తోంది. రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ నిర్ణయం. ఇన్ఫోసిస్ తో పాటుగా ఐబీఎం కూడా ఈ కాంట్రాక్ట్ లో పాలుపంచచుకున్నా కానీ చాలా వరకు తమ డీల్ లోనే టాస్క్ లను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మరి ఇన్ఫోసిస్ ఈ గడ్డుకాలాన్ని ఎలా ఎదుర్కొంటుంది..? మూడు వేల మంది ఉద్యోగుల భవిష్యత్తును ఎలా కాపాడగలుగుతుంది అన్నది చూడాలి.

కాగా ఇన్ఫోసిస్ లాంటి పెద్ద కంపెనీ తమ కంపెనీకి చెందిన మూడు వేల మంది ఉద్యోగులను తొలగిస్తుంది అన్నది మాత్రం చాలా ఆలోచించాల్సిన విషయం. మూడు వేల మంది ఉద్యోగులను తీసివెయ్యడం కాకుండా దానికి ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తుంది అని ఆశిస్తున్నాం.

Related posts:
ఇది గూగుల్ సినిమా(వీడియో)
మైఖేల్ జాక్సన్.. ఓ కామాంధుడు..?
అబార్షన్ చేయించుకోవడానికి క్యు.. ఎందుకంటే
ఫేస్ బుక్ లో ఆఫీస్ లోనూ వేధింపులు
ఆవిడతో లేచిపోయిన ఈవిడ
సిద్దపేటలోని చెట్టు రాజకీయ కథ
సముద్రం పై ప్రేమ.. బట్టలు లేకుండా చేసింది
ఖందిల్ బలోచ్ హత్య వెనక కుట్ర !
రాజ్యసభలో ‘వేశ్య’ వ్యాఖ్యపై దుమారం
జాతీయగీతం పాడిన సన్నీ.. కేసు నమోదు
అలా వస్తే పెట్రోల్ ఫ్రీ .. అది కూడా ఫుల్ ట్యాంక్
జగన్ అన్న.. సొంత అన్న
జలజగడానికి బ్రేక్.. అన్ని కాదు కొన్నింటికి ఓకే
వాట్సాప్ వదిలి అల్లో.. కొత్త ఫీచర్లు ఏంటంటే
గెలిచి ఓడిన రోహిత్ వేముల
రూపాయికే స్మార్ట్ ఫోన్.. ఎలా అంటే
పెట్టుబడులు అలా వస్తాయి... చంద్రబాబు మొహం చూసి కాదు
జగన్ సభలో బాబు సినిమా
ఏయ్ పులి.. కొంచెం నవ్వు
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
మోదీని ఏకంగా ఉరి తియ్యాలంట!
జైలు నుండి పరారైన ఉగ్రవాది దొరికాడు
స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపే కానీ..
అమెరికాలాంటి దేశాల వల్లే కాలేదు కానీ..

Comments

comments