ఆ ఇంగ్లీష్‌తో పెట్టబడులు వస్తాయా?

Investments wont come with Chandrababu Naidu's English

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద మరోసారి ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ విరుచుకుపడ్డారు. పెట్టబడుల పేరుతో చంద్రబాబు నాయుడు చేస్తున్న విదేశీ పర్యటనలపై కూడా ఆయన తనదైన స్టైల్లో సెటైర్‌వేసారు. విజయనగరం యువభేరిలో భాగంగా వైసీపీ అధినేత యువతతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వైఖరిని ఎండగట్టారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫ్లైట్లలో విదేశాలకు వెళ్లి వచ్చీ రాని ఇంగ్లీష్ తో పెట్టుబడిదారులను బెదిరించడం మినహా ఉద్ధరించేమీలేని జగన్ విమర్శించారు. చంద్రబాబు మొహం చూసి పెట్టుబడులు వస్తాయనుకోవద్దని అన్నారు.

ఏపికి కేంద్రం ప్రత్యేక హోదా కేటాయించాలని, అలా కుదరని పక్షంలో కేంద్రానికి మద్దతిచ్చే పరిస్థితిలేదని అన్నారు. వ‌చ్చే ఏడాదిలోనో, రెండేళ్ల‌లోనే బాబు ప్ర‌భుత్వం కూలిపోతుంద‌ని జోస్యం చెప్పారు. మోడీని గ‌ట్టిగా నిల‌దీసి ప్ర‌త్యేక హోదా తీసుకురాగ‌లిగితే ఏపీకి ఎంతో ప్ర‌యోజ‌నం ఉంటుందున్నారు.ఏపీలో అధికారంలోకి రాగానే ఫీజు రీయంబ‌ర్స్ మెంట్ స్కీమ్ ను విప్ల‌వాత్మ‌క మార్పుల‌తో అమ‌లు చేస్తామ‌న్నారు. బీసీల మీద ప్రేమ ఉంటే ఇస్త్రీ పెట్టె ఇవ్వ‌డం కాద‌ని , అంద‌రికీ చ‌దువుకోవ‌డానికి ఫీజు రీయంబర్స్ మెంట్ అమ‌లు చేయాల‌ని చంద్ర‌బాబుకి స‌ల‌హా ఇచ్చారు. సింగ‌పూర్ వాళ్ల పేరుతో అవినీతికి పాల్ప‌డితే ఎవ‌రికీ తెలియ‌ద‌ని చంద్ర‌బాబు ఆశిస్తున్న‌ట్టు జ‌గ‌న్ విమ‌ర్శించారు. తాత్కాలిక స‌చివాల‌యంలో చ‌ద‌ర‌పు గ‌జానికి ప‌ది వేల‌రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తూ దోచుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. సింగ‌పూర్ అకౌంట్ల‌లో చంద్ర‌బాబుకి డ‌బ్బులు ప‌డ‌తాయ‌ని జ‌గ‌న్ అన్నారు.

Related posts:
బాబోయ్ బాబు వదల్లేదట
రాజ్యసభలో ‘వేశ్య’ వ్యాఖ్యపై దుమారం
వత్తిళ్లతో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై
3వేల మందికి ఇన్ఫోసిస్ భారీ షాక్
పెళ్లిలో రక్తపాతం.. 51 మంది మృతి
సన్మానం చేయించుకున్న వెంకయ్య
బాంబులతో కాదు టమాటలతో .. పాక్ పై భారత్ టమాట యుద్ధం
పదివేల కోట్లచిచ్చుపై మోదీకి జగన్ లేఖ
బుల్లెట్‌ను ప్రశ్నించిన బ్యూటీ.. పాక్ ఆర్మీని కడిగేసింది
కోలుకోలేని పరిస్థితి వస్తోందట
సౌదీలో యువరాజుకు ఉరి
బాబుకు ఇంగ్లీష్ వచ్చా?
హిల్లరీకి భంగపాటు.. ట్రంప్ విజయం
కరెన్సీ కష్టాల నుండి విముక్తి
బ్యాంకులకు మూడు రోజులు సెలవులు
ప్రభుత్వం ఓడింది.. ప్రజలూ ఓడిపోయారు
మోదీ కోసం 1100కోట్ల ఖర్చు!
నకిలీ కరెన్సీకి అంత భారీ శిక్షా?
తమిళనాట అప్పుడే రాజకీయాలా?
హైదరాబాద్‌లో కూలిన బిల్డింగ్
ఆయన మాట్లాడితే భూకంపం
ముద్రించిన నోట్లు నేరుగా ఆ ఇంటికే
నువ్వు ఫిక్స్ చేసినా సరే..నన్ను ఫిక్స్ చెయ్యమన్నా సరే..
డబ్బు మొత్తం నల్లధనం కాదు

Comments

comments