దేశభక్తి అంటే ఇదేనా?

Is it patriotism Pawan Kalyan questions

జనాలకు దాదాపుగా దూరంగా ఉంటున్నాడు అయి ఫిక్స్ అయిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ట్విట్టర్ ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. పవన్ కల్యాణ్ ఐదు అంశాలపై అధికార పార్టీ బిజెపిని ట్విట్టర్ ద్వారా ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ దేశభక్తి అంశంపై ప్రశ్నలు వేశారు. పార్టీల విధానాల ఆధారంగా దేశభక్తిని అంచనా వేయొద్దంటూ ట్వీట్ చేశారు. ఆయా పార్టీల సమావేశాలను జాతీయ గీతాలాపనతో ఎందుకు ప్రారంభించరని ప్రశ్నించారు.

టైంపాస్ కోసం వచ్చే సినిమా థియేటర్లలో దేశభక్తిని పరిక్షీంచడం ఎంతవరకు సబబు అని అడిగారు. సినిమాహాళ్లు దేశభక్తికి పరీక్షా వేదికలు కాకూడదని చెప్పారు. విలువలతో కూడిన మానవ సంబంధాలే దేశభక్తికి నిజమైన అర్థమన్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే దేశభక్తి లేనట్టు కాదని విమర్శించారు. కాగా దేశభక్తి గురించి చర్చిస్తూ తాను చేసిన ఓ ట్విట్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్షమాపణలు కోరారు. ఈ రోజు ప‌వ‌న్ క‌ల్యాణ్ బీజేపీని త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా నిజ‌మైన‌ దేశభ‌క్తి అంటే ఏంటో బీజేపీకి చెప్పారు. అయితే ఈ సంద‌ర్భంగా ఆయ‌న ‘జేఎన్‌టీయూలో విద్యార్థుల‌పై దేశ ద్రోహం పెట్టారు, కానీ, వారు దేశ ద్రోహానికి పాల్పడ‌లేదు.. తరువాత ఆ విషయం రుజువైంది’ అని పేర్కొన్నారు. మ‌రికొద్ది సేప‌టికే ఆయ‌న మ‌ళ్లీ ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ త‌న ఫాలోవ‌ర్ల‌కు సారీ చెప్పారు. తాను త‌న ట్వీట్‌లో జేఎన్‌టీయూ అని పేర్కొన్నాన‌ని, దాన్ని స‌రిచేస్తున్నాన‌ని అది ‘జేఎన్‌టీయూ కాదు- ఢిల్లీలోని జేఎన్‌యూ’ అని పేర్కొన్నారు. చివరగా ఎపికి ప్రత్యేక హోదా అంశంపై శనివారం ట్వీట్ చేయనున్నట్లు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.

Related posts:
పెట్రోల్ లీటర్‌కు 250
బురఖా నిషేదం.. వేస్తే భారీ జరిమాన
టర్కీలో మూడు నెలల ఎమర్జెన్సీ
వీళ్లకు ఏమైంది..?
బాబా ముందు సెక్స్ చేస్తేనే.. ఫలితం??
నా స్కూల్ కంటే మీ మీటింగులే ఎక్కువా..?
3వేల మందికి ఇన్ఫోసిస్ భారీ షాక్
జగన్ బాణాన్ని పార్టీ వీడేది లేదు
ప్రత్యేక దగ.. ఏపికి జరిగిన ద్రోహంపై ఉండవల్లి
నవాజ్.. ఆవాజ్ తగ్గించు
చెరువుల్లో ఇక చేపలే చేపలు
మంత్రుల ఫోన్లు బంద్
అమెరికా ఏమంటోంది?
బినామీలకు గుబులే.. బ్రహ్మాండం పగిలే
మోదీ హీరో కాదా?
కొత్త క్యాంపు కార్యాలయంలోకి కేసీఆర్
తెలంగాణ 3300 కోట్లు పాయె
మోదీ కోసం 1100కోట్ల ఖర్చు!
ఆయన మాట్లాడితే భూకంపం
నల్లడబ్బును మారుస్తున్న బ్లాక్ షీప్
అవినీతి ఆరోపణల్లో రిజిజు
మోదీ మీద మర్డర్ కేసు!
ఎన్డీయేలో చేరనున్న టిఆర్ఎస్
ప్రత్యేక హోదా కోసం సోషల్ మీడియాలో వినూత్న ఉద్యమం

Comments

comments