యుద్ధం మొదలైందా..? పాకిస్థాన్ మీద భారత్ దాడి

Is it War started between India and Pakistan

భారత్ బరిలోకి దిగిందా..? పాకిస్థాన్ మీద దాడికి సిద్ధమైందా..? భారత ప్రజల ఆకాంక్షకు ఇండియన్ ఆర్మీ ఆజ్యం పోస్తోందా..? అనే అనుమానాలకు తెర తీస్తూ భారత్ మొదటి సర్జికల్ స్ట్రయిక్  పాకిస్థాన్ మీద చేసింది. అయితే దీని మీద ముందుగానే పాకిస్థాన్ కు సమాచారం అందించింది భారత్. కుప్వారా, నౌగాం, పూంఛ్ సెక్టార్ లలో వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ దళాలు కవ్వింపు చర్యలకు దిగడంతో అదే అదనుగా భారత దళాలు ఎదురుదాడి మొదలెట్టాయి. అదే పదే కాల్పులు జరుపుతూ పాక్ పై ఒత్తిడి పెంచాయి.

“నౌగాం సెక్టార్ లోని ధనేష్, లక్ష్మీ పోస్టుల నుంచి భారత దళాలు ముందుకు చొచ్చుకెళ్ళి మరీ కాల్పులు జరిపాయి. ఉగ్రవాద మూకలు తలదాచుకునే శిబిరాలపై కాల్పులు సాగించాయి. ఈ దాడుల్లో  పాక్ వైపు నుంచి భారీగా ప్రాణనష్టం సంభవించింది. మాకందిన సమాచారం ప్రకారం ఇద్దరు పాక్ సైనికులను కాల్చిచంపాం. కొందరు టెర్రరిస్టులనూ మట్టుబెట్టాం..” అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ డిజిఎంఓ వెల్లడించారు. టెర్రరిస్టు స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఆపరేషన్ కంటిన్యూ అవుతుందని ఆయన తేల్చిచెప్పారు.

భారతే కవ్వింపు చర్యలకు దిగుతోందని పాక్ విదేశాంగ శాఖ ఈ ఉదయం ఆరోపించింది. భీంబర్, హాట్ స్పింగ్ కేల్, లెపా సెక్టార్లలో భారత్ దళాల దాడిని తిప్పికొట్టినట్లు పాక్ ఆర్మీ చెప్పుకొచ్చింది. దీనికి భారత విదేశాంగ శాఖ ఘాటుగా బదులిచ్చింది. “మేం రెండు విషయాల్ని స్పష్టం చేస్తున్నాం. ఒకటి పాకిస్థాన్ కు.. ఇక ఏ విషయాన్నీ మేం తేలిగ్గా తీసుకొనేది లేదని పాక్ గ్రహించాలి.. ఏమాత్రం రెచ్చగొట్టారో భారీ మూల్యం తప్పదు. ఇక రెండో ది ప్రపంచదేశాలకు.. ఉద్రక్తతలు పెంచే ఉద్దేశం మాకు లేదు.. అదే సమయంలో మేం చేసే దాడులు పూర్తిగా టెర్రరిస్టులను వేటాడి వెంటాడి హతమార్చడం, ఉగ్రవాద తండాల స్థావరాలను నేలమట్టం చేయడమేనని తెలియజేస్తున్నాం” అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

సర్జికల్ స్ట్రయిక్ అంటే ఏమిటి..?
పెద్ద యెత్తున విధ్వంసం జరగకుండా నిర్దిష్టమైనదాన్ని విధ్వంసం చేసే వ్యూహంతో సైన్యం చేసే దాడి సర్జికల్ స్ట్రయిక్. ఒక్క నిర్దిష్టమైన స్థలంపై గురి తప్పకుండా సైన్యం దాడి చేయడం సర్జికల్ స్ట్రయిక్‌లో ఉంటుంది. తాము ఉద్దేశించిన, దాడికి అర్హమైన దాన్ని మాత్రమే విధ్వంసం చేయడానికి, పరిసరాల్లో నష్టం జరగకుండా చూస్తూ ఉద్దేశిస్తారు. అంటే, పరిసరాల్లోని నిర్మాణాలు, వాహనాలు, భవనాలు, ప్రజల మౌలిక సదుపాయాల వంటివాటికి నష్టం జరగకుండా జాగ్రత్త పడుతారు.

Related posts:
యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే
11 రోజుల పాటు బ్యాంకులు బంద్
కటకటాల్లో కోడి.. ఖమ్మంలో వింత
మోదీకి సిద్దు బల్లే భలే షాక్
ఫ్యాన్స్ కు షాకిచ్చిన కేటీఆర్
అలా వస్తే పెట్రోల్ ఫ్రీ .. అది కూడా ఫుల్ ట్యాంక్
కువైట్ లో 13మంది భారతీయులకు ఉరి
గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్
అతడి హనీమూన్ కు సుష్మా స్వరాజ్ సహాయం
కృష్ణా పుష్కర భక్తులకు హెచ్చరిక: కృష్ణా జలాల్లో బ్యాక్టీరియా
ఓటుకు నోటులో ’టైమింగ్ అదిరింది‘
చంద్రబాబు ఓ ‘పాము’.. కాపుల విషయంలో
చంద్రబాబుకు చుక్కలే.. సుప్రీంకోర్టు ఆదేశం
తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్..... భారత్ దెబ్బకు ఒక్కిరిబిక్కిరి
బతుకు బస్టాండ్ అంటే ఇదే
లోకేషా.. ఏంటీ ఆ మాటలు
కేంద్ర మంత్రికే నోట్ల ఇబ్బంది
అకౌంట్లలోకి 21వేల కోట్లు
ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?
60 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనా?
1075కు ఫోన్ చేస్తే ఫ్రీగా డాక్టర్ల సలహాలు
కరెన్సీ కష్టాలు ఇంకో ఐ..దా..రు నెలలా?!
డబ్బుల కోసం విదేశీయుల డ్యాన్స్
థియేటర్లో ఆ పాటకు లేచినిల్చోవాల్సిందే

Comments

comments