పవన్ పొలిటికల్ లీడర్…. అవునా..? కాదా..? నిజాలు

Is Pawan kalyan can be a Perfect Political Leader

తెలుగులో భలే క్రేజ్ ను సంపాదించుకున్న హీరోల్లో టాప్ లో పవన్ కళ్యాణ్ ఉన్నారు. తెలుగు సినిమాల్లో పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న పవన్ జనసేన పార్టీని స్థాపించారు. జనసేన పార్టీతో ప్రజల గొంతుకగా నిలుస్తానని మాటిచ్చారు. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా తాను ముందుంటానని ప్రకటించారు. పార్టీ పెట్టిన వెంటనే ఎన్నికల్లో తెలుగుదేశం, బిజెపికి మద్దతిస్తూ తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ప్రచారం నిర్వహించారు. అప్పటికి ఇంకా జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపునివ్వలేదు. కానీ తాజాగా జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు తెలంగాణలో జనసేనకు పార్టీ గుర్తింపు లభించింది. తన అన్నతో కలిసి పొలిటికల్ స్టెప్స్ వెయ్యడం మొదలుపెట్టిన పవన్ లీడర్ గా… పొలిటికల్ లీడర్ గా మారాడా..? మారతాడా..? అన్న విషయాలు చూద్దాం

నాడు సీనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు తెలుగు ప్రజలు ఎంతలా అయితే బ్రహ్మరథం పలికారో… చిరంజీవి పార్టీ పెట్టేటప్పుడు కూడా అలాంటి హైప్ క్రియేట్ అయింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించగా.. అప్పుడు ఆయన కుటుంబ సభ్యులు అందరూ ఆయన వెంటనడిచారు. చిరంజీవి తర్వాత పార్టీలో ఎంతో కీలకంగా ఉన్నారు పవన్. కానీ పరిస్థితులు కలిసిరాక చిరంజీవి చివరకు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ అంతకంటే ముందే పవన్ చాలా మంది కాంగ్రెస్ నాయకుల మీద పరుష వ్యాఖ్యలు చేశారు. పైగా మార్పు తీసుకువస్తామంటూ వచ్చిన చిరంజీవి తానే మారి.. ఏకంగా పార్టీని కాంగ్రెస్ సముద్రంలో కలపడం పవన్ కు పెద్దగా నచ్చలేదని తెలిసింది.

కాంగ్రెస్ లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసినప్పుడు చాలా మంది చాలా ప్రశ్నలు వేశారు. ఓట్లు అడిగేప్పుడు, పార్టీ పెట్టినప్పుడు ఏకంగా మార్పు, సామాజిక న్యాయం అంటూ ముందుకు వచ్చారు.. మరి ఇప్పుడు ఆ రెండు ఏమయ్యాయి అన్న ప్రశ్న. దాంతో చాలా కాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు పవన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణలో కేసీఆర్, ఏపిలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు.

14 మార్చ్ 2014లో హైదరాబాద్ వేదికగా పవన్ కళ్యాణ్ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. ఆ పార్టీ పేరును జనసేన అని వెల్లడించారు. నాటి నుండి నేటి వరకు ఎన్నో పరిణామాలు జరిగాయి మరి వాటి ఆధారంగా ఆయన పొలిటికల్ లీడరా..? కాదా..? అన్నది మీరే తేల్చుకోండి.

నెగిటివ్స్..
-పార్టీ పెట్టిన తర్వాత కేవలం ఒకే ఒక్క వ్యక్తిగా నడిచారు. పార్టీ అన్నాక ఉండాల్సిన వ్యవస్థాగత నిర్మాణం లేకుండానే ముందుకు పోయారు.
– ఏపిలో చంద్రబాబు నాయుడుకు పవన్ వల్ల చాలా వరకు ఓటు బ్యాంకు పెరిగింది అన్నది మాత్రం వాస్తవం. (కాపు వర్గానికి చెందిన వారిలో చాలా మంది చంద్రబాబుకు పవన్ ను చూసి జై కొట్టారు అని ఓ వాదన)
– తెలంగాణలో కూడా ప్రచారం నిర్వహించినప్పటికీ కూడా తెలుగుదేశం, బిజెపికి ఓటు శాతంలో ఎలాంటి మార్పురాలేదు
– ఎన్నికల తర్వాత పొలిటికల్ పార్టీగా జనసేన కానీ, ఓ పార్టీ అధినేతగా కానీ పవన్ ఎలాంటి యాక్షన్ ప్లాన్ కు దిగలేదు.
– ఎన్నికల అనంతరం తనకేమీ పట్టదన్నట్లుగా వ్యవహరించారు పవన్ అనే వాదన ఉంది
కానీ అమరావతి గ్రామాల్లో రైతుల నుండి ప్రభుత్వం భూములను లాక్కునే ప్రయత్నం చేసినప్పుడు రైతుల ఆకాంక్ష మేరకు అక్కడ పర్యటించడం మినహా ఎన్నికలేతర కార్యక్రమం ఏదీ లేదు.
– తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఘటనలు జరుగుతున్నా కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
– ఇప్పటికీ కూడా పొలిటికల్ గా ఎలాంటి గ్రౌండ్ ప్లాన్, వ్యవస్థలేకుండా పోవడం

ప్లస్ లు..
– ఏపిలో పవన్ కు మంచి ఫాలోయింగ్ ఉండటం. అక్కడ చాలా మందిని పవన్ ఓటింగ్ పరంగా ప్రబావితం చెయ్యడం
– చంద్రబాబు, మోదీలాంటి వ్యక్తులను తన దగ్గరకు రప్పించుకోవడం
– దేశరాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు చేత రెడ్ కార్పేట్ వెల్ కమ్ చెప్పించుకున్నారు అంటే పవన్ సత్తా గల వ్యక్తి అని అందరికి తెలుసు.
– అమరావతి భూముల మీద రంగంలోకి పవన్ దిగిన వెంటనే ప్రభుత్వం వెనక్కి తగ్గింది
–  కేవలం ఒకటి రెండు ప్రెస్ మీట్ లు, అప్పుడప్పుడు ట్వీట్లతోనే మంచి ప్రభావాన్ని చూపించగలిగారు
– ఇప్పటికీ కూడా పార్టీ విధానాలపై క్లారిటీతో ముందుకు వెళుతుండటం

మిగతావి..
– పవన్ వల్ల రాజధాని గ్రామాల్లోని రైతులు పరోక్షంగా లాభం పొందారు (తమ సమస్యను ఎవరూ పట్టింకోకపొతే.. అప్పుడు పవన్ కళ్యాణ్ తమను కాపాడాలనే స్లోగన్ ఎత్తుకుంటే మీడియా వాళ్లు వార్తలను ప్రసారం చేశారని, చివరకు సమస్య అందరికి తెలిసింది అని ఓ వార్త ఉంది)
– అన్నింటికి మించి పవన్ చేసే ట్వీట్లు, మీడియా సమావేశాలతో మీడియా వాళ్లకు ఫుల్ జోష్.
– పొలిటికల్ గా ఎలాంటి స్టెప్పులు వెయ్యలేకుండా స్తబ్దుగా ఉండటం పవన్ స్టైల్

నిజానికి లీడర్ కు, పొలిటికల్ లీడర్ కు తేడా ఉంటుుంది. లీడర్ కు రాజకీయాలు అవసరం లేదు.. కానీ పొలిటికల్ లీడర్ కు లీడర్ షిప్ క్వాలిటీలు, పొలిటికల్ స్ట్రాలజీలు రావాలి. మరి పవన్ ఆ రెండో కోవకు చెందుతాడా..? అన్నది చూడాలి. రాజకీయాల్లో ఎత్తుకు ఎత్తు వెయ్యాలి.. అలాగే గతంలో తన అన్నయ్య చిరంజీవి చేసిన పనిని.. వవన్ ఎన్నడూ చెయ్యడు అనే నమ్మకాన్ని కలిగించాలి.. అలాగే కేవలం స్టార్ డమ్ మాత్రమే సరిపోదు అని అందరికి తెలుసు. కానీ అగ్గికి ఆజ్యం తోడైనట్లు.. పవన్ లాంటి సెలబ్రెటీకి ప్రజా సమస్యల మీద, వాటి పరిష్కారాల మీద అవగాహన వస్తే మాత్రం చాలా మంచిది. అది ఆయనను ఉన్నత స్థాయికి చేర్చుతుంది.

Related posts:
వాళ్ల రక్తం చిందిస్తే లక్షలు ఎందుకు..?
ఆ అద్భుతానికి పాతికేళ్లు
ప్రత్యేక హోదాపై ఇద్దరూ ఇద్దరే
బాబ్బాబు.. బాబ్బాబ్.. బాబూ
జగన్ బ్రహ్మాస్త్రం గడప గపడకు
పవన్ హైజాక్ చేశాడా..? జగన్ పరిస్థితి ఏంటో..?!
పవన్ చంద్రుడి చక్రమే
ఊరట పవన్ ఫ్యాన్స్ కు
ఆళ్లరామకృష్ణ నైతిక విజయం
హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది
మూడింటికి తేడా ఏంటి..?
ఓటమి వైపే చంద్రబాబు అడుగులు
కర్ణాటక, తమిలనాడుల మధ్య కావేరీ వివాదం
ఒకే ఒరలో లక్షల అస్త్రాలు.. యువభేరి
తొందరపడి ఆంధ్రజ్యోతి ముందే కూసింది
చెత్త టీంతో చంద్రబాబు
అప్పుడు బ్రిటిష్ ఇప్పుడు టెర్రరిజం.. గాంధీ-బోస్ మళ్లీ పుట్టాలా?
చైనాకు టెర్రర్ మరక.. భారత్ ఎత్తుగడకు డ్రాగన్ ఉక్కిరిబిక్కిరి
బాబుకు అవకాశం లేదు... కేసీఆర్ కు తిరుగులేదు
57లో 20.. పాపం వారి పరిస్థితి ఏంటో?
దొంగదారిలో అయినా సరే.. స్విస్ ఛాలెంజ్ పై బాబు సర్కార్ తీరు
కేజ్రీవాల్, రాహుల్ లు చేసేది రాజకీయాలేనా?
40 Vs 40.. జగన్, బాబుల్లో ఎంత తేడా ఉందో తెలుసా?
జయలలిత జీవిత విశేషాలు

Comments

comments