పవన్ చంద్రుడి చక్రమే

Is Pawan Kalyan Chandrababu Naidu's Aid

తెలుగు పాఠకుల కోసం తెలుగోడ రాజకీయ కోణాన్ని మరింత లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై లోతైన, ఆలోచనాత్మకమైన కథనాలను అందించాం… ఇక ముందు కూడా అందిస్తాం. ఏపిలో జనసేనాని నిర్వహించిన సభపై పలు కోణాల్లో కథనాలను అందించిన తెలుగోడ మరింత లోతుగా కథనాలను అందించే ప్రయత్నం చేస్తోంది. తెల్లనివన్నీ పాలూ కాదూ.. నల్లటి వన్నీ నీళ్లూ కాదు అని రాజకీయాలను కూడా తెలుగోడ సూక్ష్మ, దూరదృష్టితో అందిస్తున్న కథనాలు మరింత ఆలోచనాత్మకంగా..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా తిరుపతి సభతో ఏపిలో రాజకీయ వేడి పుట్టించారు. పవన్ ప్రసంగాన్ని తెలుగోడ మరోకోణంలో విశ్లేషించడం జరిగింది. పవన్ కళ్యాణ్ పూర్తి ప్రసంగాన్ని పరిశీలించినట్లైతే తెలుగు దేశం పార్టీని కానీ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కానీ ప్రత్యేక హోదాపై నిలదీయకపోగా చంద్రబాబు నాయుడును అతిగౌరవంగా మాట్లాడటం జరిగింది. ప్రశ్నించడానికే పార్టీ అని పెట్టి.. ఎన్నో ప్రశ్నలు ఉన్నా ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకోవడానికి అది కూడా తన అభిమాని వినోద్ రాయల్ చనిపోయిన తర్వాత ఉన్నపళంగా అతి తక్కువ సమయంలో బహిరంగ సభను ఏర్పాటుచేసుకోవడాన్ని చూస్తుంటే ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆలోచనకాదని అనిపిస్తోంది. ఇంత తక్కువ సమయంలో ఆగమేఘాల మీద తిరుపతిలో బహిరంగ సభ పెట్టడానికి అనుమతులు ఎలా వచ్చాయి అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

సుజనా చౌదరి ఈ రోజు పార్లమెంట్ లో మాట్లాడిన విధానం చూస్తే మొత్తం వ్యవహారం చంద్రబాబు నాయుడు నడిపినట్లు అనిపిస్తోంది. ఎందుకు అలా అంటే సుజనా చౌదరి పార్లమెంట్ లో మాట్లాడుతూ ‘జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పూర్తి’తో అంటూ తన ప్రత్యేక హోదా డిమాండ్ ను వినిపించడం చూస్తే చంద్రబాబు వెనకుండి ఈ తతంగాన్ని నడిపిస్తున్నట్లన్నట్లు అర్థమవుతోంది.
పవన్ కళ్యాణ్ కంటే ముందే జగన్ ప్రత్యేక హోదాపై పోరాడుతున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పార్లమెంట్ లో మాట్లాడారు. కానీ వారు మాట్లాడింది మాత్రం సుజనా చౌదరికి స్పూర్తినివ్వలేదు. కానీ ఒకరోజు పవన్ మాట్లాడిన మాటలకే సుజనాకు స్పూర్తి వచ్చిందట..!

ఏది ఏమైనా ఏపి ప్రజలకు ఎవరో ఒకరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం జరుగుతోంది.  చివరకు ఎలాగైనా సరే ఏపికి ప్రత్యేక హోదా దక్కాలని… సీమాంధ్ర ప్రజల ఆకాంక్ష నెరవేరాలని తెలుగోడ కోరుకుంటోంది.

Related posts:
ఉగ్రవాదుల టార్గెట్ హైదరాబాద్ ఎందుకు..?
తెలంగాణలో యుద్ధానికి ఆ వర్గం
కాశ్మీర్ కోసం ఇండియా, పాక్ ఆరాటం వెనక చరిత్ర ఇది
వాడు మగాడ్రా బుజ్జి కాదు.. నిజమైన హిజ్రా వీడేరా
ఏపిలో రాజకీయానికి నిదర్శనం వాచ్ మెన్ రాందాస్
కేసీఆర్ సమర్పించు మోదీ చిత్రం
పివి సింధు విజయం.. వెనక రాజకీయం
సింధుకు సరే.. శ్రీకాంత్ కు ఏదీ సహకారం
బాబు నిర్లక్ష్యానికి సచివాలయమే సాక్షి
పవన్ ను కదిలించిన వినోద్
ఎందుకు విడిగా.. లక్ష్యం ఒక్కటేగా
హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది
14వ ఫైనాన్స్ కమీషన్ ఎలా ఆలోచించింది..?
ఓటమి వైపే చంద్రబాబు అడుగులు
ఇక యుద్ధమే కానీ..
అదీ హామీ అంటే.. ఫీరీయింబర్స్మెంట్ 100శాతం
రెండున్నరేళ్లు వృధా! ఇక నుండి పాలన గాడిలోకి?
సర్జికల్ స్ట్రైక్ క్రెడిట్ ఎన్నికల్లో ఓ పాచికా?
నోటిదూల డొనాల్డ్ ట్రంప్ పతనానికి కారణం
కేవలం 57 సీట్లు మాత్రమే ఎందుకు?
రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి... కేసీఆర్ సర్కార్‌కు సూచన
పిట్టల దొరను మించిన మాటల దొర
వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?
మోదీని మించిన బ్లాక్ మనీ ప్లాన్

Comments

comments