వినాయక విగ్రహాలపై రాజకీయ గ్రహ

Politics-on-Vinayaka-Idols

హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలు అంటే దేశంలోని నలుమూలల నుండి భక్తులు తరలివస్తారు. శోభాయమానంగా సాగే ఉత్సవాన్ని తిలకించడానికి రెండు కన్నులు చాలవు. అలాంటి గణేష్ ఉత్సవాలపై కాస్త పర్యవరణవేత్తల ఆగ్రహం ఎదురవుతోంది. వినాయకుడిని ఎంతో భక్తితో కొలుచుకోండి.. అందులో తమకు ఎలాంటి అడ్డులేదని.. కానీ ఎత్తైన విగ్రహాలను పెట్టడం ద్వారా పర్యావరణానికి చేటు చేస్తున్నాయని వారు మండిపడుతున్నారు. అందుకే పర్యావరణహిత మట్టి విగ్రహాలను, తక్కువ ఎత్తున్న విగ్రహాలను ఏర్పాటు చెయ్యాలని వారు ముందు నుండి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇందులో పర్యవరణవేత్తల సదుద్దేశమే ఉన్నా.. కొంత మంది రాజకీయ నాయకుల దురుద్దేశం కూడా ఉంది అనే ఓ వార్త వెలుగులోకి వచ్చింది.

అదేంటి విగ్రహాలపై దురుద్దేశంతో ఏం చేస్తారు అని అనుకుంటున్నారా.? అయితే మొత్తం చదవండి. ఎన్నో సంవత్సరాల నుండి హైదరాబాద్ లోని విగ్రహాలను ఉస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారీస్ తో తయారు చేసిన విగ్రహాల వల్ల ఉస్సేన్ సాగర్ కాలుష్యం బారిన పడుతోంది. దీంతో ప్రభుత్వం ఇందిరాపార్క్ లో భారీ ఎత్తున ఓ చెరువును నిర్మించాలని బావించింది. అందులో విగ్రహాలను నిమజ్జనం చెయ్యాలని ప్రభుత్వం లాంఛన ప్రాయంగా అభిప్రాయపడింది. అంతకు ముందు విగ్రహాల ఎత్తును 15 అడుగులకు మించి పెట్టకూడదు అని కూడా అనుకుంటోంది.

ఇప్పటికే హైకోర్టులో కొంత మంది వేసిన కేసు మూలాన.. 15 అడుగులకు మించిన వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చెయ్యడానికి వీలులేదని హైకోర్టు తీర్పునిచ్చింది. దాంతో ఖైరతాబాద్ తో సహా అన్ని ప్రాంతాల్లో విగ్రహాలను 15 అడుగులకు మించి ఏర్పాటు చెయ్యకూడదు అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తోంది. అయితే ఇందులో ఓ చిన్న మతలబు ఉంది అని కొంత మంది గట్టి భావిస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం.. సర్కార్ హుస్సేన్ సాగర్ చుట్టు ఉన్న భూములను స్వాధీనం చేసుకోవలని అనుకుంటోంది. ఇప్పటికే ప్రకటించినట్లు హుస్సేన్ సాగర్ చుట్టూ స్కైవేలు, నింగిని అంటే అపార్ట్ మెంట్లు కట్టాలని భావిస్తోంది. ప్రతి సంవత్సరం విగ్రహాల నిమజ్జనం కారణంగా చాలా ఇబ్బందిగా ఉందని కొంత మంది పిర్యాదు చేశారట.

దాంతో ప్రభుత్వం ఎవరికి ఇబ్బంది కానట్లుగా ఇందిరా పార్క్ లో చెరువు తవ్వించి అందులో నిమజ్జన కార్యక్రమం నిర్వహించేలా చెయ్యాలని చూస్తున్నారట. అయితే ఇక్కడ భూములను స్వాధీనం చేసుకోవాలనుకుంటే నేరుగా అడిగి తీసుకోవాలి తప్పితే.. వినాయకుడి విగ్రహాల సాకును ఎందుకు చెబుతున్నారని, ఓ వర్గం వారికి ఎందుకు కోపం తెప్పిస్తున్నారు అన్నది కొంత మంది ప్రశ్న. మరి ఈ ప్లాన్ నిజంగా సదుద్దేశంతో వేసిందో లేదంటే.. దురుద్దేశంతో వేసిందో ఆ వినాయకుడికే తెలియాలి. అయినా ా బొజ్జగణపయ్య తలుచుకుంటే ఇదో ఓ వివాదమేనా అనే వాళ్లూ ఉన్నారు.

Related posts:
అంతే బాబూ.. టైం అలాంటిది మరి!
బిల్డింగ్ కుంగింది.. బాబు ఎడమకన్ను అదిరింది
టీజర్ లో ఎన్టీఆర్ రాజకీయం!
కేంద్రం నిధులు.. గుటకాయస్వాహా
గులాబీవనంలో కమలం?
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
తెలుగుదేశంలో ఆగష్టు భయం
తెలుగుదేశంలోకి నాగం జనార్దన్ రెడ్డి
రోజా పదవి కోసమేనా ఇన్ని పాట్లు..?
పవన్ పోరాటం రాజకీయమే... చిత్తశుద్దిలేని పవన్
ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..?
స్టే వస్తే కురుక్షేత్రమే
నిత్యానంద ‘భక్తి ఛానల్’ ఏ సీడీలు వేస్తారంటే..
నయీం కేసులో మాజీ మంత్రి... రౌడీలా ప్రవర్తించిన మంత్రివెంట రౌడీ బ్యాక్‌గ్రౌండ్
ఐదుగురి మంత్రి పదవులు ‘గోవింద’.... ఏపిలో త్వరలో కేబినెట్‌లో మార్పులు
దీపావళి ధమాకా.. మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ నిర్ణయం!
అరుణకు ఏకంగా ఆ పదవి? టిఆర్ఎస్ భారీ ఆఫర్
ఏపి సిఎంగా నారా బ్రాహ్మణి?
బాబుగారి చిరు ప్లాన్
క్లాస్‌లు తీసుకోవడానికి కేసీఆర్ రెడీ
అల్లుడి కార్లే కొనాలా..? మరోసారి కేసీఆర్ ఫ్యామిలీ డ్రామా?
తెలంగాణ ఉద్యోగులకు జీతాలు తగ్గుతాయా?
నల్లధనం ఎఫెక్ట్‌తో మోదీ పదవి ఊడుతుందా?!
ట్యాక్స్ పై ఓ సామాన్యుడి ప్రశ్న

Comments

comments