ఓటుకు నోటు కేసులో అవినీతిలేదా?

Is there no illigal issue in Cash for Vote case

ఓటుకు నోటు కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన ఓటుకు నోటు కేసులో ఇప్పుడు కోర్టులో వాదనలు రసవత్తరంగా నడుస్తున్నాయి. కాగా సుప్రీంకోర్టు ఇప్పటికే నాలుగు వారాల్లో ఈ కేసును పరిష్కరించాలని హైకోర్టును ఆదేశించడంతో కోర్టులో వాదనలు నడిచాయి. ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు తరఫు లాయరు వాదించిన విధానం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా చంద్రబాబు నాయుడు తరఫున హైకోర్టులో వాదనలు వినిపించారు.

సిద్దార్థ లూధ్రా వాదనలు విన్న వారంతా కోర్టులో చట్టం ఇలా ఉంటుందా..? లా పాయింట్లు ఇలా ఉంటాయా..? అనేలా అనిపించింది. అసలు ఓటుకు నోటు కేసులో ఏం జరిగిందో అందరికి తెలుసు. అయినా కూడా లా పాయింట్ల పేరుతో చంద్రబాబు లాయరు చేసిన వాదన ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయన వాదన సారాంశం ఏంటి అంటే ఓటుకు నోటు కేసులో అవినీతి ఎక్కడ ఉంది..? ఆ కేసును నమోదు చేసిన యాక్ట్ కరెక్ట్ కాదు అని. ఇంతకీ సిద్ధార్థ్ లూథ్రా ఏమని వాదించారో తెలుసా..?

లూథ్రా తన వాదన ఇలా ఉంది “ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడమన్నది ప్రజా విధుల్లో భాగం కాదని సుప్రీం కోర్టు గతంలోనే స్పష్టం చేసింది. ఈ కేసులో ఫిర్యాది  నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్. తమకు అనుకూలంగా ఓటు వేయడానికి టిడిపి లంచం ఇవ్వచూపారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై ఏసిబి అధికారులు పిసి యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. పబ్లిక్ సర్వీసులో భాగం కాని నేరానికి ఈ యాక్ట్ ఎలా వర్తిస్తుందో అర్థం కాకుండా ఉంది. ఉదాహరణకు… ఒక మునిసిపాలిటీలో ఇంజినీరు తన విధికి సంబంధించి లంచం తీసుకుంటే అది పిడి యాక్ట్ కింద కేసు నమోదు చేయాల్సిన నేరం. ఆ ఇంజనీరే ఎన్నికల్లో ఓటు వేయడానికి డబ్బు తీసుకున్నట్టయితే వ్యక్తిగతం. పబ్లిక్ సర్వెంట్ హోదాలో అతను ఓటు వేయలేదు. ఓటు హక్కు ప్రజా విధుల్లో భాగం కానే కాదు” అని  అన్నారు.

‘‘ పైగా ఈ కేసులో ఇప్పటికే ఏసిబి చార్జిషీట్ కూడా దాఖలు చేసిందని, ఏసీబీ కోర్టు ఆదేశాలతో మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వస్తే ఒకే కేసులో రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయడానికి చట్టం ఒప్పుకుంటుందా’’ అని ప్రశ్నించారు. ఈ వాదోపవాదనలు విన్న తర్వాత చంద్రబాబునాయుడు అభిమానుల్లో ఆనందం పొంగి పొర్లుతోంది. అవినీతి నిరోధక చట్టం కిందకు రాని కేసులో అనవసరంగా తమ నాయకుడిని ఇరికించారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయినా ఇదంతా కాదు.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు అండ్ కో కోట్ల రూపాయలు ఇవ్వాలని చూడడం వందకు వంద శాతం వాస్తవం. దొంగ అని అందరికి తెలిసినా కూడా దొరగా బిల్డప్ ఇవ్వడం చంద్రబాబుకే చెల్లుతుంది అని చాలా మంది పెదవి విరుస్తున్నారు.

Related posts:
యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే
మైఖేల్ జాక్సన్.. ఓ కామాంధుడు..?
ఆయన 256 ఏళ్లు ఎలా బ్రతికాడు..?
10 ఏళ్ల బాలుడిని రేప్ చేసిన 16 ఏళ్ల అమ్మాయి
మోదీ.. రంగుపడిందా..? చంద్రబాబు రంగుపోయిందా..?
కేసీఆర్ ఆరోగ్యంపై కవిత ఏం చెప్పిందంటే..
సైన్యం చేతికి టర్కీ
రాఖీ సావంత్ మోదీని అలా వాడేసింది
నయీం బాధితుల ‘క్యూ’
ఏపీకి టోపీ..ప్రత్యేక హోదా లేదు....!
అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది..?
అడవిలో కలకలం
టాటాకు టాటా చెప్పిన రాజన్.. మిస్ట్రీ సన్నిహితుడి రాజీనామా
అర్నాబ్ గోస్వామి రాజీనామా ఎందుకు? సోషల్ మీడియాలో వెరైటీ స్పందన
మద్యాంధ్రప్రదేశ్, అత్యాచార ప్రదేశ్
మోదీ హీరో కాదా?
బంగారం రేటు మరీ అంత తగ్గిందా?
చంద్రబాబు హైదరాబాద్ అందుకే విడిచాడా?
నల్లడబ్బును మారుస్తున్న బ్లాక్ షీప్
వైసీపీలోకి అందరూ ఆహ్వానితులే
రాహుల్ గాంధీ ఊరించేదేనా?
ఏపికి డబ్బేది? జగన్ ప్రశ్న
ఓ కుక్క 600 కిమీల శబరిమల యాత్ర
జయలలిత మరణంపై నిజాలు తేలేనా?

Comments

comments