పవన్ పనికిమాలిన స్ట్రాటజీ అదే!

strategy

ఎంతో అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతు అరాచకాలకు గురవుతూ.. పొలాలు పోగొట్టుకుంటూ ఒకవైపు, అతివృష్టి – అనావృష్టిలతో బాధలుపడుతు మరోవైపు విచ్చలవిడి అవినీతిని అడ్డుకోలేక నిస్సహాయస్థితిలో ఉన్నప్పుడు.. తమకోసం నిలిచి పోరాడే నాయకుడిని చూస్తారు ఎవరైనా.

ఇటువంటి నేపథ్యంలో పవన్ అభిమానులు తమ నాయకుడు ప్రజల వద్దకి వెళ్లి ఓదార్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రజలకోసం పోరాటం సాగించి తగిన న్యాయం చేస్తారని అనుకున్నారు అందరు. కానీ.. పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ విచిత్రంగా ఉంది. సినిమాల్లో ట్విస్టుల్లాగా జనాల మనసులతో, అభిమానుల ఆశలతో ఒక ఆట ఆడుకుంటున్నాడు. ప్రశ్నిస్తాడు అనుకున్న పవన్.. ఏం ప్రశ్నించాలో తెలియక.. ఎవరిని ప్రశ్నించాలో తెలియక.. రెండున్నర సంవత్సరాలు గడిచినా రాజకీయం ఏం చేయాలో తెలియక.. అప్పుడప్పుడు వచ్చి తలలో నరాలు తెగెలా అరిచి నాకు నడుము నొప్పి.. నా దగ్గర డబ్బుల్లేవు.. మీరు నా సినిమా గట్టిగా చూడలేదు.. నాకు సినిమాలే ఆధారం.. డబ్బులకోసం మిమ్మల్ని దేహీ అని అడుక్కోవాలా.. అని అందరి దగ్గర సినిమాలు చేయడానికి పర్మిషన్ తీసుకుని కనుమరుగయ్యాడు. ఎవరూ కూడా ప్రత్యేక హోదా సాధించకపోతే, అప్పుడు వచ్చి తన సత్తా చూపిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్‌ని చూసి ఇక రాడేమో.. ఎన్నికలప్పుడు మాత్రమే కనిపిస్తాడు అనుకున్నారు చాలా మంది.

తిరిపతిలో ప్రత్యేక హోదా అని ధ్వజమెత్తి, ఆ తరువాత ఆత్మగౌరవం పేరిట సభ పెట్టి అభిమానుల ఆశల్ని కాకినాడ రేవులో ముంచేశాడు పవన్ కళ్యాణ్. అసలు ఆయన స్ట్రాటజీ ఏమిటో అర్ధం కాని పరిస్థితి. నేను ఒకడు నడిపిస్తే నడుస్తానా అంటాడు.. నాకు పౌరుషం లేదా అని అరుస్తాడు.. కనిపించకుండాపోతాడు కొన్నాళ్ళు.

భాదితుల దగ్గరకు ప్రతిపక్ష నేతలు వెళుతుంటే.. అదే భాదితులను మరింత ఇబ్బంది పెట్టి హైదరాబాద్ పిలిపించుకోవడం మరీ దారుణమైన స్ట్రాటజీ. పోనీ వచ్చిన భాదితులకు అండగా నిలిచి పోరాడుతా అని చెబుతాడు అనుకుంటే.. అసలు కారకుడైన చంద్రబాబును వెనకేసుకొచ్చే ధోరణి ప్రతి అభిమానిని ఇబ్బింది పెట్టే పరిస్థితి తమ నాయకుని వాలకం చూసి.

మెగా ఫ్యామిలిని ఉపయోగించి ఎవరో రాజకీయంగా పరితపిస్తున్నట్లుగా ఉంది. అటు చిరంజీవికి, ఇటు పవన్ కళ్యాణ్‌కు ఇష్టం లేకపోయినా.. ఎవరో వీరిని ప్రత్యామ్నాయం పేరుతో ప్రయోగిస్తున్నట్లు అనిపిస్తుంది. పైగా ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేయకపోగా ఒక పార్టి పెట్టి అందులోకి టీడీపీతో విసుగెత్తిన నాయకులను తీసుకుని ఒకవేళ అరకొరగా గెలిస్తే.. మళ్ళీ అదే టీడీపీ అధికారంలోకి రావడనికి వేసిన స్ట్రాటజీతో ముందుకు పోతున్నట్లు కనిపిస్తుంది వీరి వ్యవహారం. ఏది ఏమైనా అదే జరిగితే మాత్రం ఇదొక చిత్తశుద్ధితో పనిచేసే నాయకుని లక్షణం కాదని.. ఇదొక పనికమాలిన రాజకీయ స్ట్రాటజీ అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఇది సినిమా కాదు.. షూటింగ్ అయిపోయిన తరువాత రిలీజ్ ప్రమోషన్స్ కోసం కనిపించడానికి. ఇది ప్రజలకు సంబంధించిన విషయం. రాజకీయాలకు అతీతంగా కష్టం వస్తే చాలు ప్రజలకు అండగా నిలవాలి, హైదరాబాద్ వదిలి రావాలి, ప్రజలకు చేయూతనివ్వాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి, పోరాడాలి.. అడిగింది నెరవేర్చేవరకు.

Related posts:
కేసీఆర్ చెప్పిన కుట్రలో నిజమెంత...?
బ్రెగ్జిట్ వరమా..? శాపమా..?
టిఆర్ఎస్‌తో బిజెపి మైండ్ గేమ్
పివి నరసింహారావు.. దేశానికి ఠీవి కాంగ్రెస్ కు బిపి
తెలుగు రాష్ట్రాల మధ్య హైకోర్టు ఫైట్..టిఆర్ఎస్ కు ఐదు లాభాలు
పూలు అమ్మిన చోట కట్టెలు కూడా అమ్మలేక
కాశ్మీర్ కోసం ఇండియా, పాక్ ఆరాటం వెనక చరిత్ర ఇది
కాశ్మీర్ విషయంలో చరిత్ర క్షమించని తప్పు చేసిన నెహ్రూ
కాశ్మీర్ లో ఆర్టికల్ 370 మంటలు
ఉప్పెనలా జగన్ డిజిటల్ సేన
జీఎస్టీ బిల్ కథ..
ఏపికి ప్రత్యేక హోదాపై గర్జించిన ‘విజయ’సాయిరెడ్డి
ఆ రెండు బాణాలు మోదీ వైపే..?
జగన్ బ్రహ్మాస్త్రం గడప గపడకు
రజినీకాంత్ మళ్లీ పుడతాడా..?
రక్తం మరిగింది అన్నారు.. ఎందుకు కరిగిపోయారు?
అక్కడి మీడియా ఇలా మొరుగుతోంది
అప్పుడు కక్కుర్తి.. ఇప్పుడు కూల్చివేత?
మెరుపు దాడి... నిజమా-కాదా?
మీకో దండం.. ఏం జరుగుతోంది?
సర్జికల్ స్ట్రైక్ క్రెడిట్ ఎన్నికల్లో ఓ పాచికా?
చైనాకు టెర్రర్ మరక.. భారత్ ఎత్తుగడకు డ్రాగన్ ఉక్కిరిబిక్కిరి
కాపీ క్యాట్ పవన్.. జగన్‌ను ఫాలో అవుతున్న జనసేనాని
మోదీని మించిన బ్లాక్ మనీ ప్లాన్

Comments

comments