నింగిలోకి ఎగిరేది రాకెట్.. కాదు మన కీర్తి

ISRO Getting ready to create a new record with twenty Sattilites

భారత్ వెలుగులు విరజిమ్ముతోంది. అన్నింటి కన్నా కూడా మన అంతరిక్ష పరిశోధనలు మంచి ఫలితాలను, తక్కువ ఖర్చుతో రాబట్టుకోవడం ఒక్క ఇస్రో నుండి మాత్రమే సాధ్యమవుతోంది. అలాంటి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సరికొత్త రికార్డును క్రియేట్ చేసేందుకు సిద్దమైంది. ఒకే టైంలో పోలార్ శాటిలైట్ లాంచ్ వుమికిల్ (PSLV) c34 ద్వారా 20 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడానికి సిద్దమైంది. దీనికి సంబందించిన కౌంట్ డౌన్ స్టార్టయింది.

ఈసారి ఈ రాకెట్‌కు సంబంధించిన ఎక్స్‌ఎల్‌ రకాన్ని ఉపయోగిస్తున్నారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో రాకెట్లను పంపడం ఇస్రోకి కొత్తేమి కాదు. 2008లోనే పీఎస్‌ఎల్‌వీ ద్వారా ఒకేసారి 10 ఉపగ్రహాలను పంపింది. 20 శాటిలైట్లలో భారత్‌కు చెందిన కార్టోశాట్‌-2సి, మన దేశ విద్యా సంస్థలకు సంబంధించిన రెండు ఉపగ్రహాలు, అమెరికా, కెనడా, జర్మనీ, ఇండొనేషియాకు చెందిన 17 ఉపగ్రహాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది కార్టోశాట్‌-2సి. దీని బరువు 727.5 కిలోలు. 20 ఉపగ్రహాల మొత్తం బరువు 1,288 కిలోలు. గూగుల్‌కు చెందిన 110 కిలోల స్కైశాట్‌ కూడా వీటిలో ఉంది.

ఇస్రో ప్రయోగాలు దాదాపుగా విజయాలనే సాధించాయి. అన్నింటికన్నా చంద్రయాన్ ఇస్రో కీర్తిని అవదులు లేకుండా చేసింది. పెద్ద సంఖ్యలో శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపిన దేశాల్లో మనకంటే ముందు స్థానంలో రష్యా, అమెరికా ఉన్నాయి. 2014 జులై 19న రష్యాకు చెందిన డీఎన్‌ఈపీఆర్‌ రాకెట్‌ 37 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇప్పటివరకూ ఇదే రికార్డు. అమెరికాకు చెందిన మినోటార్‌-1 రాకెట్‌ 2013 నవంబర్‌ 19న ఒకేసారి 29 ఉపగ్రహాలను మోసుకెళ్లింది.

ఇస్రో ప్రయోగించే కార్టోశాట్‌-2సి ఉపగ్రహం దేశ సైనిక సామర్థ్యాన్ని ఇనుమడింపచేయనుంది. ఇది నిఘాకు సంబంధించి ఎంతో ఉపయోగపడనుంది. ఇలాంటి ఉపగ్రహాలు అమెరికా, చైనా, ఇజ్రాయిల్‌ వద్ద మాత్రమే ఉన్నాయి. తాజాగా స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో దాన్ని సాకారం చేసింది. ఇది అంతరిక్షం నుంచి అత్యంత ఖచ్చితమైన చిత్రాలు, వీడియోలను తీసి, భూమికి చేరవేస్తుంది. ఇందులో ప్యాన్‌క్రొమాటిక్‌ కెమెరా, మల్టీస్పెక్ట్రల్‌ పరికరం వల్ల ఈ సామర్థ్యం ఒనగూరింది. గతంలో పంపిన కార్టోశాట్‌- 2, 2ఎ, 2బి ఉపగ్రహాల్లోని కెమెరాలకు 0.8 మీటర్ల కచ్చితత్వం ఉంది. ప్రస్తుతం పంపే కార్టోశాట్‌-2సిలో దాన్ని మరింత ఆధునికీకరించి, 0.65 మీటర్ల కచ్చితత్వం సాధించేలా రూపొందించారు.

కార్టోశాట్‌-2సి ఉపగ్రహం సైనిక అవసరాలకే కాక ప్రకృతి విపత్తుల సమయాల్లో సేవలు అందిస్తుంది. విపత్తు విస్తృతిని అంచనా వేయడానికి, సహాయ చర్యలకు ఉపయోగపడనుంది. కార్టోశాట్‌-2సిలో అందించే చిత్రంలోని ప్రాంత ఉష్ణోగ్రత, వాటి చుట్టుపక్కల ఉష్ణోగ్రతలను అంచనా వేయవచ్చు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రణాళికలకు, తీరప్రాంత నిర్వహణకు, రహదారుల నెట్‌వర్క్‌ పరిశీలనకు, నీటి సరఫరాపై అధ్యయనానికి, భూవినియోగతీరుపై మ్యాప్‌లు తయారుచేయడానికి ఈ ఉపగ్రహాన్ని ఉపయోగించవచ్చు. దీనికి అయిన ఖర్చు అక్షరాల 350 కోట్లు. ఇది ఐదేళ్ల పాటు సేవలు అందిస్తుంది.

Related posts:
సముద్రం పై ప్రేమ.. బట్టలు లేకుండా చేసింది
పెళ్లికి రావద్దు అంటూ న్యూస్ పేపర్లో యాడ్స్
సింగ్ ఈజ్ కింగ్
ఆరిపోయే దీపంలా టిడిపి?
మోదీకి సిద్దు బల్లే భలే షాక్
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌దే
వత్తిళ్లతో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై
ఫ్రీలాన్సింగ్‌తో ఇంత డబ్బు వస్తుందా..? నిజమే
ఓటుకు నోటులో ’టైమింగ్ అదిరింది‘
స్థూపం కావాలి
జియోకు పోటీగా రిలయన్స్ ఆఫర్లు
కొండంత అండ.. చేయి చేయి కలిపి చేయూత
గూగుల్ బర్త్ డే.. విశేషాలు ఇవే
తమిళనాడు అమ్మ వారసులు ఎవరు?
కొత్త జిల్లాల వెనక కేసీఆర్ రాజకీయ కుట్ర?
తలాక్ తాట తీస్తారా..? ఉమ్మడి పౌరస్మృతి వస్తుందా?
ఓటుకు నోటు కేసులో అవినీతిలేదా?
నయీం కేసులో ఆర్.కృష్ణయ్య విచారణ
వంద, యాభై నోట్లు ఉంటాయా?
నోట్లపై గాంధీ బొమ్మ తొలగించాలట!
నోట్లరద్దు తెలిసి హెరిటేజ్ డీల్!
కొత్త క్యాంపు కార్యాలయంలోకి కేసీఆర్
తెలంగాణ 3300 కోట్లు పాయె
బ్యాంకులకు మూడు రోజులు సెలవులు

Comments

comments