ఆ 80 కోట్ల మందే టార్గెట్?

IT Industry must target that 80 crores people

భారతదేశంలో లెక్కల ప్రకారం అక్షరాస్యుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. కానీ కేవలం అక్షరాస్యులు అయితే మాత్రమే ఇండియా డిజిటల్ ఇండియాగామారదు. డిజిటల్ ఇండియాలో మొదటి కీలక అడుగు ఒక్కటే.. అదే భాష. అందరికి ఇంగ్లీష్ అవసరం. ఆన్ లైన్ అనగానే మొదటిగా తెలియాల్సింది ఇంగ్లీష్. సెల్ ఫోన్ తీసుకున్నా, కంప్యూటర్ తీసుకున్నా.. దాన్ని ఆపరేట్  చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ రావాలి. అయితే దేశంలోని 80 కోట్ల మందికి ఇంగ్లీష్ భాష మీద అవగాహన లేకుండాపోవడం భారత్ డిజిటల్ అడుగుకు  మొదటి అడ్డంకు. అయితే ఇప్పుడు ఆ 80 కోట్లనే టార్గెట్ చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

డిజిటల్ ఇండియాలో భారత్ మరింత అభివృద్ధి సాధించాలి అంటే మాత్రం ఖచ్చితంగా అందరికి ఐటీ సేవలు అందాలి. అలా ఐటీ సేవలు అందాలంటే కనీసం ఇంగ్లీష్ లో అవగాహన ఉండాలి. కానీ మన భారతీయుల్లో చాలా మందికి ఆ అవగాహనలేదు. అయితే ఇంగ్లీష్ రాని 80 కోట్లను టార్గెట్ చేసి ఐటీని విస్తరించాలని ఐటీ పరిశ్రమ పితామహుడు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వ్యవస్థాపక సీఈఓ ఎఫ్.సి. కోహ్లి వెల్లడించారు. నిజమే భారత్ ఏటా 100 బిలియన్ల ఐటీ ఉత్పత్తులను చేస్తున్నా కానీ స్వదేశంలో ఇంకా అందరికి ఐటీ ఫలాలు అందడం లేదు. అయితే ఐటీ సేవలను అందుకోలేకపోతున్న 80 కోట్ల మందిని టార్గెట్ చేస్తే ఐటీ పరిశ్రమను మరింత విస్తరించిన వారవుతారు అని ఎఫ్.సి. కోహ్లి చెప్పిన మాటలు అక్షర సత్యాలు. మరి ప్రభుత్వాలు దీనిపై దృష్టిసారిస్తే మరిన్ని ఫలితాలను అందుకోవడం మాత్రం ఖచ్చితం.

Related posts:
పోకిమన్ గో హిట్.. అడితే ప్రాణాలు ఫట్
మిస్టర్ వరల్డ్ గా తెలంగాణ వ్యక్తి
కో.. అంటే కోటి అనేలా నయీం లైఫ్
మా టీవీ లైసెన్స్ లు రద్దు
జగన్ అన్న.. సొంత అన్న
ఫ్రీలాన్సింగ్‌తో ఇంత డబ్బు వస్తుందా..? నిజమే
స్టే ఎలా వచ్చిందంటే..
అప్పుడొస్తా నా సత్తా చూపిస్తా
ప్రత్యేక హోదాపై జగన్ చిత్తశుద్ధి
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
ప్రత్యేక హోదా వచ్చితీరుతుంది
పిహెచ్‌డి పై అబద్ధాలు
పవర్ లేదు.. ఆక్వాఫుడ్ ఇండస్ట్రీ బాధితులతో పవన్ భేటి
చైనా టపాసులు ఎందుకు వద్దంటే..?
ఇంతకీ జగన్ ది ఏ ఊరు..!
బెంగళూరుకు భంగపాటే
కరెన్సీ కష్టాల నుండి విముక్తి
గాల్లోకి లేచిన లక్ష్మీదేవి.. మోదీ మహిమ
థియేటర్లో ఆ పాటకు లేచినిల్చోవాల్సిందే
నకిలీ కరెన్సీకి అంత భారీ శిక్షా?
తెలిసి కూడా జయలలిత నిర్లక్ష్యం
రోహిత్ వేముల విషయంలో బిజెపిని టార్గెట్ చేసిన పవన్
దేశభక్తి అంటే ఇదేనా?
ఆ తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఖల్లాస్

Comments

comments