43 కోట్ల నగదుతో టిడిపి ఎమ్మెల్యే…. ఐటీ శాఖ అధికారుల రైడింగ్‌లో వెలుగులోకి

IT Officials raids on TDP MLA and caught 43 crore spot cash

ఏపిలో అవినీతి పెరిగింది అని వాదించే వారికి మరో ఆధారం లభించింది. ఇప్పటికే అన్ని శాఖల్లో అవినీతికి చంద్రబాబు నాయుడు తలుపులు బార్లా తెరిచారు అని మాటలతో దాడి చేస్తున్న ప్రతిపక్షాలకు అధికారపక్ష ఎమ్మెల్యే వ్యవహారం మరో ఆయుదాన్ని అందించింది. చిత్తూరు ఎమ్మెల్యే డిఎ సత్యప్రభ ఇంటిపై ఐటీ అధికారులు నిర్వహించిన దాడుల్లో భారీగా నగదు, ఆస్తులు లభించినట్లు తెలిసింది.  ఈ నెల 23, 24 తేదీల్లో నిర్వహించిన ఐటీ దాడుల్లో దాదాపుగా 265 కోట్ల రూపాయల వరకు ఆస్తులు గుర్తించినట్లు తెలిసింది.

సత్యప్రభ భర్త ఆదికేశవుల నాయుడు మాజీ ఎంపి, టిటిడి మాజీ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన మరణానంతరం పరిశ్రమలన్నింటినీ ఆయన కుమారుడే చూసుకుంటున్నారు. గతంలో డి.కె.ఆదికేశవులనాయుడు ప్రముఖ పారిశ్రామికవేత్త విజయమాల్యాతో కలిసి కింగ్‌ఫిషర్‌ మరికొన్ని సంస్థలలో పార్టనర్స్‌గా ఉన్నారు. వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి మాల్యా పరారైన విషయం తెలిసిందే. కాగా తాజాగా డిఎ సత్యప్రభ ఇంటిలో దొరికిన 43 కోట్ల నగదు మీద వెంటనే వివరాలు వెల్లడించాలని, 265 కోట్ల ఆస్తుల పత్రాలను చూపించి ఐటీ రిటర్న్స్ దాఖలు చెయ్యాలని ఐటీ శాఖ అధికారులు ఆదేశించారని తెలిసింది. మొత్తానికి చిత్తూరుకు చెందిన టిడిపి ఎమ్మెల్యే అంత డబ్బును కలిగి ఉండటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.

Also Read:  చెత్త టీంతో చంద్రబాబు

Related posts:
యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే
దేవుడి మీద కోపం.. ఎంత పని చేశాడో..?!
ఎవరీ జకీర్..? ఉగ్రవాదులతో సంబందం ఏంటి..?
పోకిమన్ గో హిట్.. అడితే ప్రాణాలు ఫట్
బిగ్ గేట్స్ తో బాబు.. దేనికోసం అంటే
దాని వల్లే చంద్రబాబు ర్యాంకు గల్లంతట
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌దే
జగన్, కేటీఆర్ లకు రాఖీబంధం
బాబా రాందేవ్ సమర్పించు...పతంజలి జీన్స్
రాజీనామాలు అప్పుడే
హైదరాబాద్‌లో కూల్చివేతలు షురూ
ఏటీఎంలో మందులు.. అది కూడా ఏపిలో
బాబు కుటుంబానికి వార్నింగ్.. ఆత్మాహుతి దాడికి సిద్ధం అంటూ మావోల లేఖ
కరెన్సీ నోట్లపై మోదీ ఏమన్నారు
బెంగళూరుకు భంగపాటే
మోదీ అడిగిన పది ప్రశ్నలు ఇవే
అకౌంట్లలోకి 21వేల కోట్లు
కేవలం 500 రూపాయిల్లో పెళ్లి
జైలు నుండి పరారైన ఉగ్రవాది దొరికాడు
ఆ పెళ్లి గురించి మోదీకి తెలుసా?
జయ మరణం ముందే తెలుసా?
మోదీ మీద మర్డర్ కేసు!
అందుకే భూకంపం రాలేదట

Comments

comments