మంత్రిగారి సన్నిహితుడిపై ఐటీ దాడులు

IT rides on Minister Narayana near and dear friend

ఆంధ్రప్రదేశ్ అంటేనే ముందు నుండి కూడా డబ్బులకు కేరాఫ్ గా నిలిచింది. మోదీ డీమానిటైజేషన్ చేసినప్పుడు కోట్ల రూపాయల నగదు ఏపిలో చాలా చోట్ల పట్టుబడింది. తాజాగా మరోసారి అలాంటి సంచలనమే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కుడిభుజంగా, అమరావతి నిర్మాణానికి అన్నీ తానై వ్యవహరిస్తున్న మంత్రి నారాయణకు కొత్త కష్టం వచ్చినట్లుంది. ఆయనకు ఎంతో సన్నిహితంగా ఉండే తిరుపతికి చెందిన వైద్యుడు గుణశేఖర్ యాదవ్ ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. తిరుపతి భవానీనగర్‌లోని ఆయన నివాసం వెంకటగిరి అపార్ట్‌మెంట్స్‌లో తనిఖీలు చేశారు. గుణశేఖర్‌ బంధువులు, స్నేహితులు నివసిస్తున్న ఆటోనగర్, ఎంఆర్‌పల్లి ఎల్‌ఎస్‌నగర్, బైరాగిపట్టెడ లోనూ ఐటీ దాడులు జరిగినట్టు సమాచారం.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. తెలుగు మీడియాలో ఈ వార్త పెద్దగా ప్రసారంకాకపోవడం. అవును ఎల్లో జర్నలిజం చెయ్యడం మొదలుపెట్టిందో అప్పటి నుండే ఇలాంటివి కనిపిస్తున్నాయి.తాజాగా మంత్రి నారాయణ సన్నిహిుతుడి మీద జరుగుతున్న ఐటీ దాడు విషయంలోనూ ఇదే జరుగుతోంది. లెక్కలు చూపని భారీ మొత్తంలో నగదు, నగలు, డాక్యుమెంట్లు, ఆస్తులను గుర్తించినట్లు సమాచారం. గుణశేఖర్‌ మంత్రి నారాయణతో ఉన్న సంబంధాలను ఉపయోగించుకొని భారీగానే ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం.

ఇప్పుడు ఐటీ అధికారులు మ‌రింత లోతుగా సోదాలు నిర్వ‌హిస్తే నారాయ‌ణ బినామీల‌కు మ‌రికొంద‌రు బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. అయితే చంద్ర‌బాబు ఐటీ అధికారుల‌పై ఒత్తిడి తెస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఇప్ప‌టికే చిన్న‌బాబు రంగంలోకి దిగి ఐటీ అధికారుల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌లే టీటీడీ మాజీ స‌భ్యుడు శేఖ‌ర‌రెడ్డి ఐటీ అధికారుల‌కు దొర‌క‌డంతో టీడీపీపై ప‌లు ఆరోప‌ణ‌లు రాగా, ఇక నారాయ‌ణ పాత్ర ఉన్న‌ట్లు తెలిస్తే విప‌క్షాలు ఆందోళ‌న‌కు సిద్ధ‌ప‌డ‌టం ఖాయం.

Related posts:
ఆయనకు వంద మంది భార్యలు
ఆరిపోయే దీపంలా టిడిపి?
కృష్ణానదిలో ‘పిరానా’ చేపలు..?
బావర్చి హోటల్ సీజ్
కో.. అంటే కోటి అనేలా నయీం లైఫ్
వత్తిళ్లతో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై
ఓడినా విజేతనే.. భారత సింధూరం
పెళ్లిలో రక్తపాతం.. 51 మంది మృతి
మీది ఏ జిల్లా..? ఇదీ తంటా
ఆ సినిమా స్టోరీలన్నీ చంద్రబాబు నాయుడివే...?!
43 కోట్ల నగదుతో టిడిపి ఎమ్మెల్యే.... ఐటీ శాఖ అధికారుల రైడింగ్‌లో వెలుగులోకి
పది వేల ఉద్యోగాలు పాయే... ఇదంతా చంద్రబాబు పుణ్యమే!
పవర్ లేదు.. ఆక్వాఫుడ్ ఇండస్ట్రీ బాధితులతో పవన్ భేటి
బాబుకు భయం.. మున్సిపల్ ఎలక్షన్ల ఆలస్యం అందుకే
బాబుకు ఇంగ్లీష్ వచ్చా?
హిల్లరీకి భంగపాటు.. ట్రంప్ విజయం
కొత్త నొటును చూసి ఈ పాప ఏమందో తెలుసా?
నా వల్ల కావడం లేదు.. చేతులెత్తేసిన చంద్రబాబు నాయుడు
అమ్మ పరిస్థితి ఏంటి?
హైదరాబాద్ లో ఆ బిల్డింగ్ కూలడానికి ఊహించని కారణం ఇదే!
‘జన్‌ధన్’ వార్నింగ్ పనిచేసింది
దిల్‌సుఖ్‌‌నగర్ బాంబ్ పేలుళ్ల బాధితులకు ఉరిశిక్ష
పార్టీ నుండి ముఖ్యమంత్రినే సస్పెండ్ చేశారు ఎందుకంటే..
న్యూఇయర్ కోసం రెండు స్వీట్ న్యూస్

Comments

comments