పంజా విసిరిన జననేత

Panja

తలుకుబెలుకు రాళ్లు తట్టెడైతేనేమి.. మేలి వజ్రం ఒక్కటి చాలు అన్నట్లు చంద్రబాబు నాయుడు చేసిన కుయుక్తులకు జగన్ ఒకే ఒక దెబ్బతో సమాధానమిచ్చారు. సైలెంట్ గా చాలా తెలివిగా  జగన్ తీసుకున్న స్టెప్ చంద్రబాబుకు తీవ్ర కష్టాలు తెచ్చిపెట్టింది. ఆపరేషన్ ఆకర్ష్ తో వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేసిన ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును వైసీపీ అధ్యక్షుడు జగన్ తెలివిగా దెబ్బతీసినట్టు కనిపిస్తోంది. చంద్రబాబు గురించి ప్రస్తావించినప్పుడల్లా ఏదో ఒక రకంగా ఓటుకు నోటు కేసు అంశాన్ని ప్రస్తావించే జగన్మోహన్ రెడ్డి… తాజాగా ఓటుకు నోటు కేసును మరోసారి తెరపైకి తీసుకురావడంలో బాగా సక్సెస్ అయ్యారనిపిస్తోంది.

ఓటుకు నోటు కేసులోచంద్రబాబు పాత్రపై విచారణ జరపాలని వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఏసీబీ కోర్టును ఆశ్రయించడం… కోర్టు దీనికి సానుకూలంగా స్పందించడంతో జగన్ వ్యూహం ఫలించిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కేసు విచారణను సెప్టెంబర్ 29 లోపు పూర్తి చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించడంతో… చంద్రబాబు ఈ కేసులో ఇరుక్కుపోతాడేమో అనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఏపీ ముఖ్యమంత్రి ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకునే అవకాశం ఉందని కొందరు చెబుతున్నా… అలా జరిగినా వైసీపీ చంద్రబాబును ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలా చేయడం వల్ల చంద్రబాబు తనపై విచారణ జరగకుండా అడ్డుకుంటున్నారనే ప్రచారాన్ని వైసీపీ మొదలుపెట్టే అవకాశం ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు.

ఒకవేళ చంద్రబాబు నాయుడు అతిగా ఆలోచించి దానికి ముందుకు వెళితే మాత్రం రాజకీయంగా పెద్ద దెబ్బే అవుతుంది. జగన్ వేసిన ప్లాన్ లో ఖచ్చితంగా చంద్రబాబు బలికావల్సి వస్తుంది. అలా కాదు అని కేసు ఎదుర్కొనే పరిస్థితిలో కూడా చంద్రబాబు నాయుడు సిద్ధంగా లేడు. ఇలా ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందాన తయారు చేశాడు జగన్. వైసీపీలోని నాయకులను ఒక్కొక్కరిగా తన పార్టీలోకి చేర్చుకున్న చంద్రబాబు.. జగన్ ఒక్క దెబ్బకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చంద్రబాబు నాయుడు పై జగన్ పరోక్షంగా ఆళ్ల రామకృష్ణా రెడ్డి రూపంలో విసిరిన పంజా బాగా గట్టిగా తలిగింది. దాంతో బిక్కుమంటూ చంద్రబాబు ఈ కేసు నుండి తప్పించుకోవడానికి లాయర్లతో మంతనాలు జరుపుతున్నారు.

Related posts:
అంతే బాబూ.. టైం అలాంటిది మరి!
బిల్డింగ్ కుంగింది.. బాబు ఎడమకన్ను అదిరింది
బ్లాక్ బెర్రీ యూజర్లకు వెర్రీ బ్యాడ్ న్యూస్
చంద్రబాబుపై మోదీ నిఘా.. కారణం చైనా
కేంద్రం నిధులు.. గుటకాయస్వాహా
ఏపిలో మంత్రి పదవి కోసం రన్ రాజా రన్
నా దేశంలో ఇలానే జరుగుతుంది..
తెలుగుదేశంలో ఆగష్టు భయం
కేసీఆర్ కు కేవీపీ 123 సహాయం
రాంగోపాల్ వర్మకు నయీం దొరుకుతాడా..?
అహా... అందుకేనా..?!
ఏపిలో జగన్ Vs పవన్
స్టే వస్తే కురుక్షేత్రమే
నయీం కేసులో మాజీ మంత్రి... రౌడీలా ప్రవర్తించిన మంత్రివెంట రౌడీ బ్యాక్‌గ్రౌండ్
పేదోళ్లవి కూల్చు.. పెద్దలవి ఆపు
చంద్రబాబుకు లోకేష్ మీద డౌట్ ?
చినబాబుకు దీపావళి గిఫ్ట్!
ఏపి సిఎంగా నారా బ్రాహ్మణి?
సోము వీర్రాజు సైలెంట్.. దాని కోసమే?
బ్రాహ్మణి దెబ్బకు బుల్లెట్ ఎక్కిన బాలయ్య
దేశంలో నోట్ల రద్దు... బాబుగారి ఐడియానే!
పెద్దనోట్లపై కేసీఆర్ ఏమనుకుంటున్నారు?
తెలంగాణ సర్కార్‌కు కరెన్సీ దెబ్బ
రెండు వేల నోట్లు కూడా రద్దు?!

Comments

comments