విరుచుకుపడుతున్న జగన్ డిజిటల్ సేన

Jagan-pawan-counter23

ఏపిలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా తమ మైండ్ సెట్ ను అంతకంటే వేగంగా మార్చుకుంటున్నారు. తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్లను ఒక్కసారిగా తమ పోస్టులతో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా ఆయా పార్టీల అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లు రాజకీయ వేడిని రాజేస్తున్నాయి. మరీ ముఖ్యంగా జగన్ డిజిటల్ సేన పవన్ కళ్యాణ్ మీద, ఆయన అప్రోచ్ మీద తీవ్రంగా విరుచుకుపడింది.

ఏపిలో ప్రత్యేక హోదా కోసం ఎవరూ పోరాడటం లేదు..? అందుకే తాను రంగంలోకి దిగినట్లు చేసిన కలరింగ్ కు సోషల్ మీడియాలో జగన్ డిజిటల్ సేన ఏకిపారేసింది. పవన్ కళ్యాణ్ చేసిన నిర్వాకాన్ని ప్రశ్నిస్తూ వాళ్లు ప్రశ్నల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ తిరుపతి వేదికగా చేసిన రాజకీయాలు, చంద్రబాబు నాయుడు వేసిన పాచికలో మాదిరిగా ఆయన ప్రవర్తించిన విధానం ఇలా రకారకాల కారణాలపై జగన్ డిజిటల్ సేన ఉవ్వెత్తున ఎగిసిపడింది.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వహయాంలో కాల్ మనీ అనే అతి పెద్ద దుశ్శాసన పర్వం జరిగినా కానీ జనసేన అధినేత ప్రశ్నిస్తానని, ప్రశ్నించకుండా ఎందుకు దాక్కున్నాడు అని జగన్ డిజిటల్ సేన నిలదీసింది. రాష్ట్రం మొత్తం కాల్ మనీ మీద అగ్గి మీద గుగ్గిళంలా మారినా కానీ నిమ్మకు నీరెత్తినట్లు కనీసం పట్టించుకోకుండా పవన్ ఇప్పుడు మాత్రం ఎందుకు అంతలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు అని ప్రశ్నిస్తున్నారు.

కాల్ మనీ లో భాగంగా అధికార పార్టీకి చెందిన నాయకులు కూడా సెక్స్ రాకెట్ లో పాలుపంచుకున్నారు. తెలుగింటి ఆడపడుచులు తనకు బలం అని చెప్పిన పవన్ కళ్యాణ్ కు ఆనాడు ఆడవాళ్లు ఎవరూ గుర్తుకురాలేదా..? ప్రతి అంశాన్ని తాను ప్రశ్నిస్తాను అని ఆడవాళ్ల మానప్రాణాల అంశం కూడా పట్టించుకోకుండా ఇప్పుడు మాత్రం గురువింద నీతులు చెబుతున్నారు అని జగన్ సేన విరుచుకుపడింది.

అన్నింటికి మించి అవినీతిలో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి ర్యాంకులో నిలిపిన అదే చంద్రబాబు నాయుడు గురించి పవన్ కనీసం ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఎందుకు అని జగన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. నాడు ఎన్నికల టైంలో తెలుగుదేశం పార్టీ, బిజెపిలను మోసుకెళ్లిన పవన్ మరి అవినీతిలో ర్యాంకులు సాధించినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు అని అడుగుతున్నారు. పైగా ఓటుకు నోటు వ్యవహారంలో పవన్ ఎందుకు మాట్లాడలేదు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి తెర తీసినా కానీ ఏమీలేదన్నట్లు కలరింగ్ ఇచ్చిన పవన్ మాత్రం మౌన మునిలా మాట్లాడకుండా ఎందుకు ఉన్నారు.

డబ్బులు లేకుంటే లేదా కావాలనుకుంటే సినిమాలు చేసుకోవాలి అంతే కానీ ప్యాకేజీల కోసం రాజకీయాలు చేయడం ఏంటని జగన్ వీరాభిమానులు ప్రశ్నిస్తున్నారు. కనీసం పవన్ తో ఎవరు ఉన్నారు అని వారు నిలదీస్తున్నారు. ఒకవేళ తాను ఒక్కడినే అన్ని సాధించేలా ఉంటే గత ఎన్నికల్లో ఎందుకు పోటీ చెయ్యలేదు. పోటీ చేసి అసెంబ్లీలో.. ప్రజా క్షేత్రంలో నిలదీయవచ్చు కదా..? కానీ అలా ఎందుకు చెయ్యలేదు..? జగన్ డిజిటల్ సేన దీనిపై ప్రశ్నలు సంధించింది.

ఓ అభిమాని చనిపోతే వారి కుటుంబాన్ని పరావమర్శించి వెళ్లాలి అంతేకానీ .. శవరాజకీయాలు చెయ్యడం ఏంటి అని వైసీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. గత రెండున్నర సవత్సరాలుగా రాష్ట్రంలో ఎన్నో పరిణామాలు జరిగాయి. కానీ పవన్ మాత్రం ఒక్క అంశంపై కూడా ఎందుకు స్పందించలేదు. ఓటుకు నోటు కేసులో నిందితులుగా ఉన్న వారితోనే పవన్ ఇన్నాళ్లు ఎందుకు సంబందాలు నెరిపారు అని కూడా జగన్ అభిమానులు సోషల్ మీడియా సైట్లలో కడిగేస్తున్నారు.

పవన్ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మని..అతడు చెప్పినట్లు ఆడుతున్నాడని  సొంత పార్టీ పెట్టుకొని ప్రజల తరఫున పోరాడాల్సిన వ్యక్తి ఇలా అవినీతిపరమైన టిడిపి,దాని అధినేత చంద్రబాబు నాయుడుకు దాసోహమై ఆ పార్టీ చెప్పినట్లు పని చెయ్యడం దిగజారుగుతనమే అని జగన్ డిజిటల్ సేన దుయ్యబట్టింది.

రెండున్నర సంవత్సరాలుగా వైయస్ జగన్ రాష్ట్ర సమస్యలపైనా, ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తున్న చంద్రబాబు కళ్లు పెట్టుకున్న పవన్ కు కనిపించడంలేదు.. అలాగే మా విజయసాయిరెడ్డి పార్లమెంట్ వేదికగా ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ ను గట్టిగా వినిపించినా కూడా అవేవీ పవన్ చెవిలో పడలేదా..? మరి ఇప్పుడొచ్చి ప్రత్యేక హోదా అంటూ పవన్ ఎందుకు హడావిడి చేస్తున్నావు అని జగన్ అభిమాని ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యబద్దంగా దీక్షలు చేస్తూ ప్రత్యేక హోదా కోసం జగనన్న పోరాటం చేస్తుంటే అలా కాదు దీక్షల వల్ల వచ్చేదేమీలేదు.. రోడ్ల మీదకు వచ్చి అరవాలని పవన్ పిలుపునివ్వడం ఏంటి అని నిలదీస్తున్నారు. మొత్తంగా ఒంటికన్నుతో చూస్తున్న పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియా వేదికగా ఉతికిఆరేస్తున్నారు జగన్ అభిమానులు. జగన్ చేస్తున్న ప్రయత్నాలను గుర్తించని పవన్ కు బాగా తలంటింది జగన్ డిజిటల్ సేన.

Related posts:
చచ్చిపోదామన్న ఆలోచనను చంపేస్తారు
జగన్‌కు తెలుసు.. ముద్రగడకు తెలిసొచ్చింది?
విందులో ఆమెకు ఛాలెంజ్ విసిరిన లోకేష్
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
సానియాను ఆ ప్రశ్న వేసి.. క్షమాపణలు చెప్పిన జర్నలిస్ట్
తెలంగాణలో పచ్చదనం కోసం ఫైరింజన్లు
గుడ్డు పోయిందా కాదు.. రైలింజన్ పోయిందా..? అని అడగండి
నా స్కూల్ కంటే మీ మీటింగులే ఎక్కువా..?
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌దే
పాక్‌కు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ర్యాలీలు
ఫ్రీలాన్సింగ్‌తో ఇంత డబ్బు వస్తుందా..? నిజమే
నిప్పువా.. ఉప్పువా..? ఎవడడిగాడు
కాశ్మీరు వేర్పాటు వాదులకు దిమ్మతిరిగే షాక్
బుల్లెట్‌ను ప్రశ్నించిన బ్యూటీ.. పాక్ ఆర్మీని కడిగేసింది
ఆమె కారు కోసం రోడ్డేస్తున్న సర్కార్
పెట్టుబడులు అలా వస్తాయి... చంద్రబాబు మొహం చూసి కాదు
లోకేషా.. ఏంటీ ఆ మాటలు
యుపీలో ఘోర రైలు ప్రమాదం
అకౌంట్లో పదివేలు వస్తాయా?
దివీస్ పై జగన్ కన్నెర్ర
60 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనా?
‘జన్‌ధన్’ వార్నింగ్ పనిచేసింది
డిజిటలైజేషన్ కు 500 దెబ్బ
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారంటే...

Comments

comments