ఉప్పెనలా జగన్ డిజిటల్ సేన

YSRCP Digital Media

అవకాశాలను అందిపుచ్చుకోవడం యూత్ కు ఉండే లక్షణం. అలాంటి యూత్ కు ఐకాన్ గా చెప్పుకునే ఏపి ప్రతిపక్ష నాయకుడు జగన్ కు చాలా మంది యువత సపోర్ట్ గా నిలుస్తున్నారు. ముఖ్యంగా టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కుతున్న వేళ జగన్ కు అనుకూలంగా ప్రభుత్వం తీరును, చంద్రబాబు వైఖరిని, లోకేష్ అసమర్థతను ఎండగడుతూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. అన్ని పార్టీలు డిజిటలైజ్ అవుతున్న తరుణంలో డిజిటల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్, సపోర్ట్ జగన్ కు పెరిగింది.

గతంలో టెక్నాలజీ అంటే తానే కనిపెట్టాను అని చెప్పుకునే ఏపి సిఎం చంద్రబాబు నాయుడుకు అదే టెక్నాలజీతో చెక్ చెబుతున్నారు జగన్ ఫాలోవర్స్. ప్రత్యర్థి బలహీనతలను కొట్టడం మామూలే.. కానీ వైసీపీ, జగన్ కు అనుకూలంగా ఉన్న వాళ్లు మాత్రం గతంలో చంద్రబాబు తనకు బలం అనుకున్న టెక్నాలజీతోనే, డిజిటల్ మీడియా ద్వారానే ఎండగడుతున్నారు. ఏపిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ కు అంతకంతకు బలం పెరుగుతోంది. క్రితం ఎన్నికల్లో అతి తక్కువ ఓటింగ్ పర్సంటేజ్ తో అధికారానికి దూరమైన జగన్ కు తామున్నామంటూ చాలా మంది సపోర్ట్ గా నిలుస్తున్నారు.

గతంలో డిజిటల్ మీడియా విషయంలో కాస్త వెనుకబడిన వైసీపీకి ఇప్పుడు అదే డిజిటల్ మీడియాలో బలం అనూహ్యంగా పెరిగింది. అలా బలాన్ని పెంచుకున్న జగన్ డిజిటల్ సేన చంద్రబాబు నాయుడుకు, ఆయన మద్దతుదారులకు చమటలు పట్టిస్తోంది. చంద్రబాబు నాయుడు మాట్లాడిన ప్రతి తప్పుడు మాటను ఈ సేన ఎప్పటికప్పుడు ఎండగడుతోంది.

జగన్ డిజిటల్ సేన దేనిపై ఎక్కువగా స్పందిస్తున్నారంటే..
వెన్నుపొటుదారు అనే ముద్ర నారా చంద్రబాబు నాయుడుకు శాపంగా మారింది అని చెప్పుకోవచ్చు. సీనియర్ ఎన్టీఆర్ జయంతి, వర్థంతి నాడు  ఎన్టీఆర్ ను వెన్నుపోటుపొడిచింది  చంద్రబాబే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు కూడా అదే రకంగా చంద్రబాబు నాయుడును టార్గెట్ గా చేసుకొని సోషల్ మీడియాలో యుద్ధం చేస్తున్నారు.

రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి తెర తీసిన ఓటుకు నోటు కేసు టైంలో అయితే చంద్రబాబు నాయుడును జగన్ డిజటల్ సైన్యం ఓ రేంజ్ లో ఉతికేసింది. కనీసం సమాధానం కూడా చెప్పుకోలేని టిడిపి ఆ టైంలో కిమ్మనకుండా కూర్చుంది. ప్రజల్లోకి నోటుకు ఓటును రకరకాలుగా తీసుకెళ్లింది ఈ సైన్యం. అందులో భాగంగా రకరకాల జోకులు, ఇమేజ్ లు తయారు చేయించి విపరీతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి చంద్రబాబు తీరును ఎండగట్టారు.

ఇక రైతుల నుండి భూములను బలవంతంగా లాక్కొన్ని అమరావతి పేరుతో చేస్తున్న అవకతవకలపై కూడా చంద్రబాబుకు ఎదురుగాలి వీచేలా చేసింది. రైతుల నుండి భూములను లాక్కోవడంపై పవన్ కళ్యాణ్  వ్యతిరేకించడం కూడా వీరికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇక ఏపిలో తీవ్ర కలకలం రేపిన కాల్ మనీ అంశంలో అయితే టిడిపి నాయకుల వైఖరిని, వారి తప్పులను ఎత్తి చూపి, జనాలు వాళ్లను చీదరించుకునేలా చేసింది జగన్ డిజిటల్ సేన. ఆడవాళ్లకు తమ ప్రభుత్వం హయాంలో పూర్తి స్థాయి రక్షణ అని ఎప్పుడూ చెప్పుకునే చంద్రబాబు నాయుడు, తన దగ్గరి వాళ్లే కాల్ మనీలో భాగస్వాములు అయినా ఏమీచెయ్యలేకపోయారని దుమ్మెత్తిపోసింది.

వెలగపూడిలో తాత్కాలిక  సచివాలయ భవనం నిర్మాణం దశలొ ఉన్నప్పుడే భవనం కుంగిపోవడం మీద కూడా సోషల్ మీడియాలో సెటైర్లు పడ్డాయి.ఇక రాష్ట్రంలోనే కాదు దేశం నుండే అవినీతిని నిర్మూలిస్తా అని బీరాలు పలికిన చంద్రబాబు అసలు స్వరూపాన్ని నడి బజారులో బట్టలు లేకుండా చూపించింది . తాజాగా ఓ సర్వే వివరాల ప్రకారం దేశంలోనే అవినీతిలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపిని  నిలిపిన చంద్రబాబుకు ఎడాపెడా వాయించింది ఈ డిజిటల్ సేన.

ఇలా చంద్రబాబు నాయుడు చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతూ.. ప్రభుత్వం తప్పు చేస్తే వెంటనే సోషల్ మీడియాలో కొరడా ఝులిపిస్తోంది జగన్ డిజిటల్ సేన. చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఇంతలా ఉప్పెనలా విరుచుకుపడే డిజిటల్ సేన  లేదు అంటే అతిశయోక్తి కాదు. వైసీపీ పార్టీకి అనుకూలంగా అంతకంతకు మద్దతు పెరిగేలా డిజిటల్ మీడియాలో కొత్త విప్లవానికి తెర తీసింది.

జగన్ డిజిటల్ సేన ఒక పక్కన చంద్రబాబు నాయుడును టార్గెట్ గా చేస్తూనే నారా లోకేష్ ను అసమర్థ నేతగా జోకులు పేలుస్తోంది.  ఆయన చేసిన వ్యాఖ్యలు, విదేశాల్లో దిగిన ఫోటోలను బాగా వాడుకుంటోంది. గతంలో మోదీకి అనుకూలం సోషల్ మీడియా ప్రచారం చేస్తూనే, యుపిఎ  విదానాలను ఎండగట్టింది. అదే సమయంలో రాహుల్ గాంధీని ఓ అసమర్థ నాయకుడిగా చూపించింది. ఇప్పుడు జగన్ డిజిటల్ సేన కూడా ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది. డిజిటల్ మీడియా బలంతో మోదీ ప్రధానమంత్రి  పీఠాన్ని అధిరోహించారు. మరి ఏపిలో అదే డిజిటల్ మీడియా బలంతో జగన్ సిఎం కుర్చీ ఎక్కుతారేమో.. చూడాలి.

Related posts:
ఉగ్రవాదుల టార్గెట్ హైదరాబాద్ ఎందుకు..?
జగన్ ఆస్తుల విషయంలో బాబు ఎందుకు తగ్గుతున్నాడు...?
తెలుగువాళ్లను వెర్రివెంగళప్పలను చేస్తున్నారే..?!
ఆ రెండు బాణాలు మోదీ వైపే..?
ఏపిలో రాజకీయానికి నిదర్శనం వాచ్ మెన్ రాందాస్
పవన్, అల్లు అర్జున్ పాటలపై గరికపాటి సెటైర్లు
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్టీఆర్ సినిమా సహాయం
పవన్ చంద్రుడి చక్రమే
అన్నదమ్ముల సవాల్
బాబు Khan
కర్ణాటక, తమిలనాడుల మధ్య కావేరీ వివాదం
పాక్‌కు పోయేదేముంది.. భారత్‌కు వచ్చేదేముంది ?
తొందరపడి ఆంధ్రజ్యోతి ముందే కూసింది
తప్పించుకోవచ్చు.. చంద్రబాబుకు అదొక్కటే అవకాశం
అప్పుడు రాముడు.. ఇప్పుడు చంద్రుడు
దేశం మెచ్చిన జేమ్స్ బాండ్.. ధోవల్ అంటే పాక్ హడల్
ఇష్టానుసారంగా జిల్లాలు... బ్రతిమాలినా-బెదిరించినా-రాజీనామా చేసినా చాలు
రాజధాని పిచ్చిలో నియోజకవర్గాల నిర్లక్ష్యం
10 వేలకోట్ల రచ్చ - తిప్పి కొట్టిన జగన్ డిజిటల్ సేన
టిఆర్ఎస్ లో వర్గపోరు.. వరంగల్ నుండే
నోటిదూల డొనాల్డ్ ట్రంప్ పతనానికి కారణం
వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?
40 Vs 40.. జగన్, బాబుల్లో ఎంత తేడా ఉందో తెలుసా?
జనం అవస్థలను కళ్లకుకట్టిన జగన్

Comments

comments