జగన్‌కు తెలుసు.. ముద్రగడకు తెలిసొచ్చింది?

Jagan know about that but Mudragada

కాపుల కోసం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో తునిలో మీటింగ్ పెట్టి అక్కడ హింసకు తావిచ్చారు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం. కాగా తుని ఘనటపై కాస్త కఠువుగా ఉన్న ప్రభుత్వం నిందితులను అరెస్టు చేసి వెంటనే రిమాండ్ కు తరలించింది. తమ వాళ్లను వెంటనే విడుదల చెయ్యాలనే తక్షణ డిమాండ్‌తో దీక్షకు దిగారు ముద్రగడ.కిర్లంపూడిలో ముందుగా విషం బాటిల్ పట్టుకొని దీక్షకు దిగగా.. పోలీసులు బలవంతంగా ఆయనను కిర్లంపూడి నుండి రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు.

ఇక అక్కడి నుండి అసలు కథ మొదలైంది. కాపు నాయకులు చాలా మంది ఏకమయ్యారు. ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. సాక్షి ఛానల్ ను చాలా చోట్ల బ్యాన్ చెయ్యడం జరిగింది అని మరింత రెచ్చిపోయారు ఓ వర్గానికి చెందిన వాళ్లు. వాళ్లకు తోడు ఓ పార్టీకి చెందిన నాయకులు. అలా చిలికిచిలికి గాలి వానగా మారుతున్న ముద్రగడ దీక్షపై రోజులు గడుస్తున్నా కానీ ప్రభుత్వం నుండి మాత్రం ఎలాంటి స్పందన రాకపోవడంతో కాపు నాయకులు డైలమాలో పడ్డారు. అసలు ఈ మొత్తం వ్యవహారం మీద ప్రభుత్వం చర్చలు జరపడానికి… ముద్రగడతో చర్చించడానికి ఎవరూ ముందుకురాలేదు. దీనికి కారణం ఏంటో అందరికి తెలుసు.

ముద్రగడ పద్మనాభంకు చాలా మొండి మనిషి అనే పేరుంది. ఎవరు చెప్పినా కానీ మాట వినేరకం కాదు అని కేవలం తన పంతం కోసం మాత్రమే ఏదైనా చేస్తారు అనే పేరుండటంతో ఎవరూ కూడా ముద్రగడ దీక్షను విరమింపజెయ్యడానికి ముందుకురాలేదు. తుని ఘటనలో అరెస్టైన వారి విడుదల కోసం ముద్రగడ పదమూడు రోజుల పాటు దీక్ష చేశారు. దీనిపై మంత్రులు, టిడిపి నేతలు పదేపదే ప్రశ్నలు సంధించడం గమనార్హం. ఇన్ని రోజుల పాటు ఆయన ఇలా ఎలా ఉండగలుగుతున్నారని వారు అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఓ రకంగా ముద్రగడ మీద అపనమ్మకాన్ని కలిగిచింది అని అనుకోవాలి.

కాపు నాయకుడు ముద్రగడ దీక్షపై ముందు నుండి నెగిటివ్ గా ప్రజల్లోకి తీసుకెళ్లిన అధికార పార్టీ అంతకంతకు అలాగే ప్రచారం చేసింది. ఇది ముద్రగడ దీక్షలోని సీరియస్‌నెస్‌ను తగ్గించేలా.. ఇది కూడా టిడిపి వ్యూహమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వీటన్నింటి కారణంగా దీక్ష ప్రభావం అంతగా కనిపించలేదనే వాదనలు కూడా ఉన్నాయి. అదే సమయంలో, కాపు నేతలలో ఐక్యత లేకపోవడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు. ముద్రగడ దీక్ష అనంతరం మూడు నాలుగు రోజులకు గాని చిరంజీవి, దాసరి నారాయణ రావు వంటి నేతలు బయటకు రాలేదని అంటున్నారు.

అయితే ఇక్కడ జగన్ నుండి ముద్రగడ నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంటూ కొంత మంది ప్రచారం నిర్వహిస్తున్నారు. జగన్ లాంటి నాయకుడు ఓ ప్రతిపక్ష నాయకుడు..  రైతుల కోసం .. విద్యార్థుల కోసం అంటూ దీక్షలు చేసే ఆయన కూడా చంద్రబాబు గురించి బాగా తెలిసి.. ఒళ్లు దగ్గర పెట్టుకుంటాడని.. మరి అలాంటిది జగన్ కు తెలిసినంత కూడా ముద్రగడకు తెలియదా..? అని ప్రశ్నిస్తున్నారు. జగన్ దీక్ష చేస్తే కేవలం రెండు, మూడు రోజుల టైం లిమిట్ పెట్టుకొనిదీక్ష చేస్తారు.. మరి ముద్రగడ మాత్రం అది ఎందుకు మర్చిపోయారు అని అంటున్నారు.

దీక్ష వల్ల ముద్రగడ అనుకున్నది సాధించినా కానీ దాని ప్రభావం జనాల్లో కనిపించకుండా పార్టీ శ్రేణుల సహాయంతో చంద్రబాబు చెక్ పెట్టగలిగారు. నిజానికి ముద్రగడ దీక్షకు దిగిన మూడు, నాలుగు రోజులకు పరిస్థితి తారుమారు కావాల్సింది. ఉద్రిక్తత మధ్య ప్రభుత్వం నుండి ఏదో ఒక నిర్ణయం రావాల్సి ఉండేది కానీ అలా జరగలేదు. ఓ రకంగా ముద్రగడ దీక్షతో రికార్డు కొట్టారని కూడా ప్రచారం జరుగుతోంది.

స్వతహాగా బీపీ, డయాబెటిక్ పేషెంటైన ముద్రగడ పద్మనాభం ఏకంగా 13 రోజులు ‘ఫీడింగ్’ లేకుండా నెట్టుకురావడాన్ని అందరూ ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు. దీక్షల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నజగన్ రెండు, మూడు రోజుల లిమిటెడ్ నిరాహార దీక్షలకే కమిటవుతున్నారు. రకరకాల డిమాండ్లతో టెంట్లేసుకుని దీక్షలు చేపట్టిన చాలామంది నేతలు, వాళ్లు సృష్టించిన రికార్డులు మూడునాలుగు రోజులకు మించి లేవు. ఈ క్రమంలో ముద్రగడ దీక్ష చరిత్రకెక్కి తీరుతుందంటూ కొంత మంది ముద్రగడ దీక్షపై సెటైర్లు వేస్తున్నారు.

Related posts:
వయాగ్రాను కనుక్కున్నది అందుకే..
సల్మాన్ పరిస్థితి రేప్ చేసిన మహిళగా మారిందట
ఆవిడతో లేచిపోయిన ఈవిడ
అతడి అంగమే ప్రాణం కాపాడింది
తెలంగాణలో పచ్చదనం కోసం ఫైరింజన్లు
తాగుబోతుల తెలంగాణ!
ఆరిపోయే దీపంలా టిడిపి?
మైఖేల్ జాక్సన్ వాళ్ల బాబు వీడే..
‘నమో నారాయణ’ అంటే మోదీ ఎందుకు నవ్వాడు..?!
మా టీవీ లైసెన్స్ లు రద్దు
కోమటిరెడ్డి కొడుకుది యాక్సిడెంట్ కాదా..? హత్యా..?
విరుచుకుపడుతున్న జగన్ డిజిటల్ సేన
పోరాటం అహంకారం మీదే
జియోకు పోటీగా రిలయన్స్ ఆఫర్లు
కర్ణాటక, తమిళనాడుల కావేరీ జలవివాదం.. అంతకు మించిన రాజకీయ కోణం
వాట్సాప్ వదిలి అల్లో.. కొత్త ఫీచర్లు ఏంటంటే
వైయస్ జగన్ కు లోకేష్ బహిరంగ లేఖ ఎందుకంటే..
తలాక్ తాట తీస్తారా..? ఉమ్మడి పౌరస్మృతి వస్తుందా?
మెగాఆక్వాఫుడ్ బాధిుతలతో జగన్
చంద్రబాబుకు అదే ఫ్యాషన్
ఆ సిఎంను చూడు బాబు...
మోదీ ప్రాణానికి ముప్పు
బంగారంపై కేంద్రం ప్రకటన ఇదే..
ఈసారి ఆ తప్పుకు తావివ్వకూడదు

Comments

comments