ఆ కత్తికి పదును పెడుతున్నారా..?

Jagan may use Undavalli Arun Kumar as weapon on Chandrababu Naidu

ఏ వస్తువునైనా వాడాలి.. అలా వాడనిపక్షంలో ఆ వస్తువు పనికిరాకుండా మూలకుపడుతుంది. కానీ ఆ ఆయుధం పదును.. దాని పనితనం తెలిసిన వాళ్లు మాత్రం కరెక్ట్ గా వాడుతుంటారు. మరి అలాంటి స్ట్రాటజీనే వాడుతున్నారు వైయస్ జగన్. ఇంతకీ ఆ ఆయుధం ఎవరో తెలుసా..? ఉండవల్లి అరుణ్ కుమార్.. ఒకప్పుడు ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో బాగా వినిపించిన పేరు. మాజీ రాజమండ్రి ఎంపీ.. పెద్దగా ప్రజా బలం లేకపోయినా  క్షేత్ర స్థాయిలో మంచి అనుభవం ఉన్న నేత . వైఎస్ హయాంలో ఒక్కసారి రాజమండ్రి ఎంపీగా గెలవగలిగాడు కానీ, కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా ఉండేవారు.

ఉండవల్లి వృత్తిరిత్యా ఓ లాయర్.. లా పాయింట్లు బాగా తెలిసిన వాడు.. అందుకే వైఎస్ గతంలో తన మీడియా శత్రువు రామోజీని దెబ్బ తీసేందుకు ఉండవల్లిని అస్త్రంగా మలచుకున్నాడు. అయితే ఇప్పుడు ఉండవల్లి పేరుకు కాంగ్రెస్ లోనే ఉన్నా.. అంత యాక్టివ్ కాదు. ఈ పరిస్థితుల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ ను వైసీపీ అధ్యక్షుడు జగన్ తాజాగా కలసి పరామర్శించడం చర్చనీయాంశమైంది. జగన్ మోహన్ రెడ్డి ఆయన ఇంటికి ఏకాంతంగా వెళ్లి చర్చించారు. ఇటీవలే ఉండవల్లి తల్లి చనిపోవడం వల్లే జగన్ ఆయన ఇంటికి వెళ్లారన్నది వైసీపీ వర్గాల కథనం.

కానీ.. ప్రస్తుతం జగన్ టీమ్ లో వ్యుహకర్తలు లేరు. తండ్రితో అనుబంధం ఉన్న కేవీపీ రామచంద్రరావు దూరమయ్యారు. ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన సీనియర్ మైసూరా రెడ్డి కూడా టీడీపీలోకి జంప్ అయ్యారు. సో.. ఇప్పుడు వైసీపీకి ఓ సమర్థుడైన వ్యూహకర్త అవసరం. అందుకే ఉండవల్లి వంటి సీనియర్ ను పార్టీలోకి ఆహ్వానించేందుకే జగన్ స్వయంగా ఉండవల్లి ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది. రాజకీయ నాయకులు ఎవరు కలిసినా దాని వెనక ఖచ్చితంగా రాజకీయ కోణం ఉంటుంది అని చాలా సార్లు ప్రూవ్ అయింది. కాబట్టే ఉండవల్లిని తమ పార్టీలోకి చేర్చుకునేందుకు, చంద్రబాబును ఇబ్బందిపెట్టేందుకే ఉండవల్లలాంటి కత్తికి సానపెడతారేమో చూడాలి.

Related posts:
బురఖా నిషేదం.. వేస్తే భారీ జరిమాన
గులాబీవనంలో కమలం?
కటకటాల్లో కోడి.. ఖమ్మంలో వింత
పెళ్లికి రావద్దు అంటూ న్యూస్ పేపర్లో యాడ్స్
తెలుగుదేశంలోకి నాగం జనార్దన్ రెడ్డి
పాక్ తో భారత్ కు అణుయుద్ధం తప్పదు!
పుష్కరాల్లో సెల్ఫీ బాబూ
పివి సింధుకు కేసీఆర్ 5 కోట్ల నజరానా
పెళ్లిలో రక్తపాతం.. 51 మంది మృతి
నయీం జీవితంపై రాంగోపాల్ వర్మ సినిమాలు
‘స్టే’ కావాలి..?
స్టే ఎలా వచ్చిందంటే..
అమ్మకు ఏమైంది?
గెలిచి ఓడిన రోహిత్ వేముల
మెగాఆక్వాఫుడ్ బాధిుతలతో జగన్
బినామీలకు గుబులే.. బ్రహ్మాండం పగిలే
నక్సలైట్ల కోసం మహిళా కమాండోలు
నోట్ల రద్దుపై బిల్ గేట్స్ ఏమన్నారంటే?
యుపీలో ఘోర రైలు ప్రమాదం
భారత్‌కు స్విస్ అకౌంట్ల వివరాలు
చెబితే 50.. దొరికితే 90
పైసల్లేవ్..ప్రకటనలూ లేవ్
బాంబ్ పేల్చేసిన డొనాల్డ్ ట్రంప్
శోభన్ బాబుతో జయ ఇలా..

Comments

comments