బాబుకు ఇంగ్లీష్ వచ్చా?

Jagan questions babu on his English

విభజన తర్వాత జరుగుతున్న పరిణామాలపై వైయస్ జగన్ మరోసారి స్పందించారు. ఏపి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న తప్పులను జగన్ ప్రజా సమక్షంలో నిలదీస్తున్నారు. తాజాగా జగన్ నిర్వహించిన కర్నూల్ యువభేరిలో చంద్రబాబును ప్రశ్నించారు. ముందు నుండి కూడా ప్రత్యేక హోదా కల్పిస్తామని.. చివరకు మోసం చేశారని కేంద్రం మీద నిప్పులు చెరిగారు. ఇక కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన మీద చంద్రబాబు స్పందించిన తీరు మీద జగన్ సెటైరికల్ గా కౌంటర్ వేశారు. అసలు చంద్రబాబు నాయుడుకు ఇంగ్లీష్ వచ్చా.. అని జగన్ యూత్ ముందు చంద్రబాబును ప్రశ్నించారు.

కర్నూల్ యువభేరిలో జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఇవ్వం.. అంటూ క్లీయర్ గా అర్థరాత్రి ఓ ప్రకటన చేస్తే.. ఆ ప్రకటన చేసిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి బాబు వత్తాసు పలికారని అన్నారు. అర్థరాత్రి ప్రకటన చేస్తే వెంటనే హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టి మరీ అరుణ్ జైట్లీ ప్రకటనను తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. కాగా జగన్ అసలు చంద్రబాబు నాయుడుకు ఇంగ్లీష్ వచ్చా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రకటనలో ఎక్కడా కూడా ప్రత్యేక ప్యాకేజ్ అనే మాట రానేలేదని.. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ప్రెస్ మీట్ లో కేంద్రం ప్రకటించిన ప్యాకేజ్ ను స్వాగతిస్తున్నాం అని ప్రకటన చేశారు. అసలు ఆయనకు అర్థమై అలా అన్నారా..? ఆ ప్రకటనను ఇంగ్లీష్ వచ్చిన ఎవరైనా అర్థం చేసుకుంటారని అన్నారు. కానీ చంద్రబాబుకు మాత్రం అర్థంకాలేదని అన్నారు. మొత్తానికి కేంద్రం చేసిన ప్రకటనకు బాబు గంగిరెద్దులా తలూపారు.. ఆంధ్రుల గౌరవాన్ని కించపరిచారు అని చెప్పకనే చెప్పారు జగన్.

Related posts:
పది వేలలోపే ఎల్ఈడీ టీవీ
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
సముద్రం పై ప్రేమ.. బట్టలు లేకుండా చేసింది
ఇనుప రాడ్ తో శీల పరీక్ష
గ్రౌండ్ లో రాందేవ్ బాబా ఏం చేశాడంటే..
గోరక్షక్ పై మోదీ మాట.. అసదుద్దీన్ మాటకు మాట
నిమ్జ్ బాధిత కుటుంబాలకు ఊరట
జగన్, కేటీఆర్ లకు రాఖీబంధం
పివి సింధు తెచ్చింది పతకం.. కురిసింది కనక వర్షం
పెళ్లిలో రక్తపాతం.. 51 మంది మృతి
అప్పుడొస్తా నా సత్తా చూపిస్తా
సన్మానం చేయించుకున్న వెంకయ్య
ప్రత్యేక హోదాపై జగన్ చిత్తశుద్ధి
తెలంగాణలో 2019 గెలుపు గోడలపై రాసుంది
మావో నాయకుడు ఆర్కే ఎక్కడ?
వెయ్యి రకాల వెరైటీలు... వంద కోట్లతో అతిథులకు భోజనాలు
కేంద్ర మంత్రికే నోట్ల ఇబ్బంది
అకౌంట్లలోకి 21వేల కోట్లు
మరో బాంబ్ పేల్చిన నరేంద్ర మోదీ
ఛాయ్‌వాలా@400కోట్లు
డబ్బు మొత్తం నల్లధనం కాదు
మంత్రి గంటా ఆస్తుల జప్తు
అప్పుడు చిరు బాధపడ్డాడట
మెరీనా బీచ్‌లో ఉద్రిక్తత

Comments

comments