ప్రత్యేక హోదా వచ్చితీరుతుంది

Jagan Said AP will get special status

ఏపి ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ ఏపికి ప్రత్యేక హోదా వస్తుందా..? రాదా.? అనేదానిపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఏపి ఎదర్కొంటున్న అన్ని అవరోధాలను ఎదుర్కోవాలి అంటే కేవలం ప్రత్యేక హోదా ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు. అసాధ్యమనుకున్న తెలంగాణ వచ్చినపుడు.. పార్లమెంట్‌లో ప్రధాని హామీ ఇచ్చిన ప్రత్యేకహోదాను సాధించుకోవడం గొప్ప విషయమేమీ కాదన్నారు. అబద్ధాలు చెప్పే రాజకీయ నాయకులను నిలదీసే పరిస్థితి రావాలనీ, అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుందన్నారు. ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం అవసరమైతే తమ పార్టీ పార్లమెంట్ సభ్యులతో రాజీనామా చేయించే కార్యక్రమం చేస్తామని చెప్పారు.

ఏపికి ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్ల కేంద్రం ఇవ్వడం లేదని అన్నారు జగన్. ప్రత్యేక హోదాపై చంద్రబాబు రాజీపడిపోరని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా ఈ రోజు వస్తుందని.. రేపు వస్తుందని.. సంవత్సరంలో వస్తుందని నేను చెప్పను. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నారు. అలాంటిది పార్లమెంట్‌లో ప్రధాని ఇచ్చిన మాట ప్రత్యేక హోదాను సాధించుకోవడం గొప్ప విషయమేమి కాదని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. 2019 ఎన్నికల్లో మాపై ఆధారపడే ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటవుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. అప్పుడు రాష్ట్రానికి హోదా ఎవరిస్తే వారికి మద్దతు ఇస్తామ‌ని వెల్ల‌డించారు. మొత్తంగా ఏపికి ప్రత్యేక హోదా రావడం ఖాయం అని జగన్ క్లారిటీ, ధీమా ఇచ్చారు.

Related posts:
రూపాయికి ఎకరా.. ఇస్తావా చంద్రబాబు?
ఫేస్ బుక్ లో ఆఫీస్ లోనూ వేధింపులు
సముద్రం పై ప్రేమ.. బట్టలు లేకుండా చేసింది
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
ఫ్రాన్స్ లో ఘోరం.. 84 మంది మృతి
నయీం బాధితుల ‘క్యూ’
ముద్రగడ సవాల్
అంత దైర్యం ఎక్కడిది..?
అమ్మ తర్వాత అమ్మ.. ఎవరు ఈమె?
వేలకోట్ల అధిపతి (అక్రమాల్లో..)
చంద్రబాబు ఆస్తులు ఇవేనట!
జగన్ సభలో బాబు సినిమా
మావో నాయకుడు ఆర్కే ఎక్కడ?
మోదీని ఏకంగా ఉరి తియ్యాలంట!
దేశభక్తి మీద సైనికుడి సమాధానం
గాలిలో విమానం.. అందులో సిఎం
నకిలీ కరెన్సీకి అంత భారీ శిక్షా?
అమ్మ పరిస్థితి ఏంటి?
తమిళులకు డిసెంబర్ కలిసిరాదా?
వార్దాకు వణికిపోతున్న చెన్నై
నువ్వు ఫిక్స్ చేసినా సరే..నన్ను ఫిక్స్ చెయ్యమన్నా సరే..
మోదీ వేసిన ఉచ్చులో మాయావతి
ఓ కుక్క 600 కిమీల శబరిమల యాత్ర
బాబు సర్కార్ కు పవన్ వార్నింగ్

Comments

comments