పెట్టుబడులు అలా వస్తాయి… చంద్రబాబు మొహం చూసి కాదు

Jagan said how inverstements come to state

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద కర్నూల్ యువభేరి వేదికగా జగన్ మాటల తూటాలు పేల్చారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయినప్పటి నుండి ప్రత్యేక హోదా మీద రకరకాలుగా మాట మారుస్తున్నారని అన్నారు. ఏపికి చాలా అన్యాయం జరిగింది అని, అందుకు కేంద్రం ఇచ్చే ప్రత్యేక హోదా ఒక్కటే పరిష్కారం అని అన్నారని గుర్తు చేశారు. కానీ కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు కానీ ఏపికి పలానా చేయబోతున్నాం అని చేసిన ప్రకటనకు మాత్రం స్వాగతం పలికారు అని అన్నారు. అయినా ప్రత్యేక హోదా లేకుండా వచ్చిన ప్రకటనను స్వాగతించడం ఏంటి..? అని ఆయన నిలదీశారు.

ఏపికి ప్రత్యేక హోదాను మించిన ప్యాకేజీ ఇస్తే అంతకన్నా సంతోషం ఉంటుందా..? అని చంద్రబాబు అనడం మీద జగన్ తనదైన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో జగన్ డిఫరెంట్ గా వివరించారు. ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు రావాలంటే పరిశ్రమలకు రాయితీలు కల్పించాలని అన్నారు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు మొహం చూసో లేదంటే జగన్ మోహం చూసే పెట్టుబడులు రావు అని ఆయన వ్యాఖ్యానించారు. కానీ అలాంటి రాయితీలను కల్పించే ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడు మాత్రం నాటకాలాడుతున్నారని, త్వరలోనే పార్టీని, చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపే రోజు ఉంది అని అన్నారు.

ప్రత్యేక హోదా వల్లే పరిశ్రమలు, ఉద్యోగాలు లభిస్తాయని, హోదాతో కేంద్రం ఇచ్చే నిధుల్లో 90శాతం గ్రాంటు ఇస్తారని వివరించారు. హోదా లేకుంటే గ్రాంటుగా ఇచ్చే నిధులు 30శాతమే ఉంటుందని అన్నారు. హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే పారిశ్రామిక రాయితీలు ఇస్తారని అన్నారు. 16సార్లు బాబు విదేశాలకు వెళ్లారని, ప్రైవేటు జెట్లలోనే పోతారని అన్నారు. బాబు, జగన్ మోహాలు చూసి రారని, రాయితీలుంటేనే పరిశ్రమలు వస్తాయని జగన్ అన్నారు. చంద్రబాబుకు ఇది అర్దం కావడం లేదని అన్నారు.

Related posts:
కేసీఆర్ ఆరోగ్యంపై కవిత ఏం చెప్పిందంటే..
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
సానియాను ఆ ప్రశ్న వేసి.. క్షమాపణలు చెప్పిన జర్నలిస్ట్
చేతులు కాలిన తర్వాత మైకులు పట్టుకున్న కాంగ్రెస్
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
కబాలీగా మారిన చంద్రబాబు నాయుడు
కో.. అంటే కోటి అనేలా నయీం లైఫ్
పుష్కరాల్లో సెల్ఫీ బాబూ
ఆ సినిమా స్టోరీలన్నీ చంద్రబాబు నాయుడివే...?!
ఏపీ బంద్.. హోదా కోసం
ముద్రగడ సవాల్
కర్ణాటక, తమిళనాడుల కావేరీ జలవివాదం.. అంతకు మించిన రాజకీయ కోణం
జియో దిమ్మతిరిగేలా.. బిఎస్ఎన్ఎల్ ఆఫర్లు
గూగుల్ బర్త్ డే.. విశేషాలు ఇవే
కాశ్మీర్ భారత్‌లో భాగమే
తలాక్ తాట తీస్తారా..? ఉమ్మడి పౌరస్మృతి వస్తుందా?
దిగజారుతున్న చంద్రబాబు పాలన
తెలిసి కూడా జయలలిత నిర్లక్ష్యం
గాలి జనార్థన్ రెడ్డి నోట్ల మాయ
చంద్రబాబు నల్లడబ్బు ఎక్కడ పెట్టాడంటే..
పాకిస్థాన్ లో కూడా నోట్లరద్దు
నరేంద్రమోదీ@50 రోజులు
చంద్రబాబుకు షాకిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే
ప్రత్యేక హోదా కోసం సోషల్ మీడియాలో వినూత్న ఉద్యమం

Comments

comments