బాబును ఉతికిఆరేశారు… కర్నూల్‌లో జగన్ ‘చెల్లెళ్లు’

Jagan Sisters attacked on chandrababu Naidu

ఏపిలో ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారు. విభజన సమయంలో ఏపికి ఇస్తామన్న ప్రత్యేక హోదాపై ఇప్పుడు కేంద్రం మాట మార్చడం.. దానికి చంద్రబాబు కూడా వత్తాసు పలకడం మీద తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఏపి భవిష్యత్తును తాకట్టుపెట్టిన చంద్రబాబు నాయుడు  బండారాన్ని బయటపెట్టేందుకు వైసీపీ అధినేత వైయస్ జగన్ చేస్తున్న పర్యటనలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న దురాగతాలను ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు జగన్ కు బాసటగా బాబు బండారాలను బట్టబయలు చేస్తున్నారు.

వైసీపీ అధినేత వైయస్ జగన్ తాజాగా కర్నూల్‌లో యువభేరి నిర్వహించారు. ఎంతో మంది విద్యార్థులు తమ నాయకుడు వైయస్ జగన్ కు మద్దతుగా అక్కడికి చేరుకున్నారు. కాగా జగన్ చంద్రబాబు నాయుడు ఎలా మాట మార్చారు అన్న దానిపై వీడియోలతో సహా చూపించారు. దాంతో అక్కడికి వచ్చిన యూత్ చంద్రబాబు నాయుడు మీద తమ ఆగ్రహాన్ని వెల్లగక్కారు. వైయస్ జగన్ యువతతో ఫేస్ టు ఫేస్ మాట్లాడారు. అలా కొంత మంది అమ్మాయిలు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవడమే కాకుండా తెలుగు తమ్ముళ్లకు ఖంగారుపెడుతున్నాయి.

ఏపికి ప్రత్యేక హోదా కల్పన విషయంలో నారా చంద్రబాబు నాయుడు మాట మార్చిన తీరు ముఖ్యంగా యువతను ఆగ్రహానికి గురి చేసింది. దాంతో చంద్రబాబు నాయుడు మీద తమ ఆగ్రహాన్ని జగన్ జగన్ సాక్షిగా కర్నూల్ యవభేరిలో చూపించారు. అందులో ఓ విద్యార్థిని మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనల కోసం మన డబ్బులతో వెళతారు.. మరి ఆయన చేసిన విదేశీ పర్యటన వల్ల రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి అని నిలదీసింది.

అదే యువభేరిలో మరో విద్యార్థిని కూడా చంద్రబాబు నాయుడుకు గట్టి షాకిచ్చింది. చంద్రబాబు నాయుడు చేసిన తప్పుకు తమకు ఎందుకు శిక్ష అని నిలదీసింది. మరో విద్యార్థిని అయితే మాటల తూటాలు పేల్చింది. ఈ మాటలుగనక చంద్రబాబు వింటే మాత్రం నిజంగా షాక్ తింటారు. ‘‘వైయస్ జగన్ మీటింగ్ లకు వెళితే పిల్లలు చెడిపోతున్నారని చంద్రబాబు నాయుడు అంటున్నారు. మరి ఆయన పార్టీ ఎమ్మెల్యేలు నడి రోడ్డు మీద ఎమ్మార్వోను కొట్టొచ్చు.. ఆయన కొడుకేమో విదేశాల్లో మద్యం తాగి అమ్మాయిలతో అసభ్యంగా ఫోటోలు దిగవచ్చు.. ఆయన కేబినెట్ లోని మంత్రి కొడుకు నడిరోడ్డు మీద అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించవచ్చు.. ఎందుకు అని అడిగితే కుక్క అడ్డొచ్చింది అంటారు.. ప్రతిదానికి కుక్క అడ్డొస్తుంది.. కుక్కకన్నా విశ్వాసం ఉంటదేమో.. మా ఓట్లు వేపించుకొని గెలిచిన ఆ నాయకులకు లేదా..?’’

Related posts:
కేసీఆర్ చెప్పిన కుట్రలో నిజమెంత...?
ఇండియా, పాక్ మధ్యలో తెలంగాణ కేసు
ఉగ్రవాదుల టార్గెట్ హైదరాబాద్ ఎందుకు..?
చెట్టు చెట్టే.. చిరంజీవి చిరంజీవే.. రెండు నాలుకలు
‘గతుకుల’ హైదరాబాద్ అసలు లోపం అదే
ముద్రగడకు నాడు పవన్ అందుకే దూరం
దీక్షల వల్ల వచ్చేదేముంది..?
ఎవరు చాణిక్యులు..?
ఆరిన దీపాల మధ్య పవన్ ఆవేదన
ఏపికి ప్రత్యేక హోదా ఓ సంజీవని
మీది ఏ జిల్లా? జిల్లాలు- వాటి పరిధి- జిల్లా మ్యాప్‌లు
మమ్మల్ని క్షమించు.. మమ్మల్ని మన్నించు
అల్లుడికి పండగ.. మామకు పరేషాన్
ఏం చేస్తున్నావ్ సామీ! ఏంది ఈ పాలన
మెరుపు దాడి... నిజమా-కాదా?
పెడన నుండి పోటు... టిడిపిలో ఇదే చర్చ
బాబుకు అవకాశం లేదు... కేసీఆర్ కు తిరుగులేదు
కేజ్రీవాల్, రాహుల్ లు చేసేది రాజకీయాలేనా?
మోదీని వేధిస్తున్న ఏటీఎం కష్టాలు
జనం అవస్థలను కళ్లకుకట్టిన జగన్
మోదీ భజన అందుకేనా?
ఆ కంపెనీ దెబ్బకు పేటిఎం ఢమాల్!
మోదీ మంచి చేస్తే భయం ఎందుకు?
శశికళ ‘సిఎం’ స్ట్రాటజీ

Comments

comments