అంత దైర్యం ఎక్కడిది..?

Jagan told about his courage

ఏపి ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ తాజాగా కేఎస్ఆర్ తో కలిసి ఎన్ఆర్ఐలతో ముఖాముఖి మాట్లాడారు. ఆయన తొలిసారిగా తెలుగు మీడియాలో ఓ ప్రొగ్రాంలో పాలుపంచుకున్నారు. కాగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందే కేఎస్ఆర్ వేసిన ప్రశ్న, దానికి జగన్ చెప్పిన సమాధానం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. జగన్ మీద ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి.. అప్పుడు అధికారంలో ఉన్న సోనియా గాంధీని ఎదురించారు.. ఇప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీని ఎదురిస్తున్నారు. అసలు ఏంటి మీ దైర్యం..? అని కేఎస్ఆర్ జగన్ ను ప్రశ్నించారు.

జగన్ దీనికి చిరునవ్వుతో సమాధానమిచ్చారు. గతంలో తన మీద కేసులు పెట్టింది.. కేవలం తెలుగుదేశం, కాంగ్రెస్ సీనియర్ నాయకులే అని గుర్తు చేశారు. వైయస్ బ్రతికున్నంత వరకు, కాంగ్రెస్ లో తాను ఉన్నంత వరకు మంచి వాడినే అని కానీ మాట నిలబెట్టుకునేందుకు బయటకు వస్తే మాత్రం చెడ్డవాడిగా మారాను అని అన్నారు. ఏపికి ప్రత్యేక హోదా కోసం ఎవరితో అయినా కొట్లాడడానికి తాను సిద్ధం అని అన్నారు. ఏపికి ప్రత్యేక హోదా రాకపోతే అందరికి నష్టం అని అన్నారు. ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు లేదంటే చెన్నైలాంటి నగరాలకు వెళ్లాల్సిన దుస్థితి ఉంటుదని అన్నారు. అందుకే తాను ప్రత్యేక హోదా కోసం గట్టిగా పోరాడుతున్నానని అన్నారు. హోదా ఖచ్చితంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రజల కోసం పోరాటం చెయ్యడంలో తగ్గేది లేదు.. ప్రజల సంక్షేమం కోసం ఎవరితో అయినా పొరాడేందుకు తాను సిద్ధమే అని జగన్ అన్నారు. ప్రత్యేక హోదా ఏపికి ఖచ్చితంగా వస్తుందని.. అయితే అది రేపే వస్తుందా నెల తర్వాత వస్తుందా..? అని చెప్పలేను కానీ  ఖచ్చితంగా వస్తుందని మాత్రం జగన్ ధీమా వ్యక్తం చేశారు.

Related posts:
నేను స్వాతిని మాట్లాడుతున్నా అంటోంది.. ఎవరా స్వాతి??
అతడికి గూగుల్ అంటే కోపం
ఆ కండోమ్ లకు వ్యతిరేకంగా ఆశా వర్కర్ల పోరాటం
స్వర్ణలత భవిష్యవాణి ఏమంటోంది..?
అలా వస్తే పెట్రోల్ ఫ్రీ .. అది కూడా ఫుల్ ట్యాంక్
ఆట ఆడలేమా..?
స్థూపం కావాలి
నవాజ్.. ఆవాజ్ తగ్గించు
జియోకు 9900 కోట్లు కట్టాల్సిందే... ఎయిర్‌టెల్, వోడాఫోన్, ఐడియాలకు షాక్
తమిళనాడు అమ్మ వారసులు ఎవరు?
సోషల్ మీడియా దెబ్బకు చైనా తుస్సుమంటోంది
చిల్లర కష్టాలకు ఎన్.బి.ఐ ఉపశమనం
వంద, యాభై నోట్లు ఉంటాయా?
కొత్త నొటును చూసి ఈ పాప ఏమందో తెలుసా?
కేసీఆర్ - నమోకు జై.. డిమోకు జైజై
జియో భారీ ఆఫర్ తెలుసా?
పైసల్లేవ్..ప్రకటనలూ లేవ్
తమిళనాట అప్పుడే రాజకీయాలా?
అసెంబ్లీలో దొంగతనం చేసిన ఎమ్మెల్యే
ఆ తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఖల్లాస్
తొలి క్యాష్‌లెస్ టెంపుల్..యాదాద్రి
జయలలిత మరణంపై నిజాలు తేలేనా?
మెరీనా బీచ్‌లో ఉద్రిక్తత
పళనికే సీఎం పీఠం.. పన్నీర్‌కి మిగిలిన కన్నీరు

Comments

comments