జనం అవస్థలను కళ్లకుకట్టిన జగన్

JaganMohanReddy discribe peoples facing problems

ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌టించిన పెద్ద నోట్ల ర‌ద్దుపై వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్ర‌భుత్వం నల్ల‌డబ్బును అరిక‌ట్టడాన్ని తాము స్వాగ‌తిస్తామ‌ని, కాని స‌రైన విధానంలో అమ‌లు చేయ‌క‌పోవ‌టం మూలంగా ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలాంటి పెద్ద అంశాల‌పై నిర్ణ‌యం తీసుకునేట‌పుడు ప్ర‌భుత్వం ప్ర‌తిప‌క్షాల‌ను సంప్ర‌దించ‌టం, ఈ నిర్ణ‌యం త‌ర్వాత ఏర్ప‌డే ప్ర‌భావం నుండి బ‌య‌ట‌ప‌డే చ‌ర్య‌లు వంటివి తీసుకోవ‌టం జ‌రుగుతుంద‌ని అన్నారు. కాని కేంద్ర ప్ర‌భుత్వం అలా చేయ‌కుండా నోట్ల ర‌ద్దు చేయ‌టం పై జ‌గ‌న్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ విష‌యంపై ప్ర‌జ‌ల ప‌క్షాన ప్ర‌తిప‌క్షం అండ‌గా నిలుస్తుంద‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు.

ప్రజల గొంతుక వినిపించే ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న వైసీపీ తన బాధ్యతను నిర్వర్తిస్తోంది. అందులో భాగంగా ఏపి ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ పెద్దనోట్ల రద్దుపై ఎంతో ఆలోచనాత్మకంగా సూచనలు చేశారు. ప్రజలుపడుతున్న అవస్థలను ఆయన మీడియా ముందు ఏకరువుపెట్టాడు. నల్లధనాన్ని ఏరివేయడానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుంది అని క్లీయర్ గా చెబుతూనే సామాన్యులు మాత్రం ఇబ్బందిపాలుకాకుండా చూసుకోవాలని మోదీని కోరారు.  డిజిటల్ ఇండియాలో భాగంగా అందరికి బ్యాంకింగ్ సేవలు అందించాలని అన్నారు.

కానీ భారత్ లో వాస్తవ పరిస్థితులు వేరేలా ఉన్నాయి. దేశంలోని 65 శాతం మంది బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్నారని, మరి వారికి నగదును కాకుండా ఆన్ లైన్ లావాదేవీలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ప్రస్తుతం మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్యులు నానాఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జనాలు నగదు లేక బ్యాంకుల ముందు క్యు కడుతున్నారని అన్నారు. ఈ పరిస్థితిపై అన్ని రాజకీయ పార్టీల సభ్యులతో కమిటీ ఏర్పాటుచేయాలని కోరారు. ఈ కమిటీలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గురించి తెలిసిన అనుభవజ్ఞులైన నిపుణులు ఉండాలని అన్నారు. పాత నోట్ల చలామణిపై మరో నెల రోజులు పొడగించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ముందుగా తగు చర్యలు తీసుకోకుండా నిర్ణయం అందరిని ఇబ్బందిపాలుచేసిందని అన్నారు. అందుకే ఓ నెల వరకు కేంద్రం టైం ఇచ్చి, అంత వరకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన సలహానిచ్చారు.

Related posts:
ఉగ్రవాదిలో చూడాల్సింది.. మతమా..? మారణహోమమా..?
జగన్ గెస్ట్ యాక్టర్ అయితే మరి చంద్రబాబు..??
కాశ్మీర్ కోసం ఇండియా, పాక్ ఆరాటం వెనక చరిత్ర ఇది
కాశ్మీర్ పై నెహ్రూ నిర్ణయం అప్పుడు ఒప్పు.. ఎప్పటికీ తప్పు
శుక్రవారం వస్తే కాశ్మీర్ లో వణుకు ఎందుకంటే..
చరిత్రలో ప్రశాంతమైన కాశ్మీర్... అతడికి మాత్రమే సాధ్యమైంది
బాబు నిర్లక్ష్యానికి సచివాలయమే సాక్షి
చిరుకు పవన్ అందుకే దూరం
అన్నదమ్ముల సవాల్
జనాలకు ‘బూతు’లొస్తున్నాయ్.. (ప్రత్యేక సాయం అంటేనే)
చంద్రబాబుకు పవన్ లెంపకాయ
మమ్మల్ని క్షమించు.. మమ్మల్ని మన్నించు
బుల్లెట్ లేదు.. రక్తం లేదు అయినా పాక్ కు చావు దెబ్బ
రెండున్నరేళ్లు వృధా! ఇక నుండి పాలన గాడిలోకి?
మెరుపు దాడి... నిజమా-కాదా?
కేవలం 57 సీట్లు మాత్రమే ఎందుకు?
ఏలూరు వెనక ఇంత కథ ఉందా?
తమ్ముడు ఎవరిని ప్రశ్నిస్తాడు?
నోట్ల మీద బ్యాన్ తొలిసారి కాదు
మోదీని మించిన బ్లాక్ మనీ ప్లాన్
పవన్ క్షమాపణలు చెప్పాలి
కుక్కలు చించిన విస్తరే.. ఎన్టీఆర్ పార్టీ పెడితే
ఆ కంపెనీ దెబ్బకు పేటిఎం ఢమాల్!
జయను ఎందుకు ఖననం చేశారంటే?

Comments

comments