మెరీనా బీచ్‌లో ఉద్రిక్తత

Jalli kattu protest became violent

తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెన్నైతో సహా చాలా చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఓవైపు నిరసనకారులు.. మరోవైపు పోలీసులు.. చెన్నైలోని మెరీనా బీచ్ ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారుల్ని బీచ్ నుంచి ఖాళీ చేయించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. బీచ్ లో భారీగా పోలీసులు మోహరించారు. బీచ్ కు వచ్చే రోడ్లన్నీ క్లోజ్ చేశారు. ఏ ఒక్కరిని లోనికి వదట్లేదు.. మరోవైపు ఆందోళనకారుల వేదికల్ని ఖాళీ చేయిస్తున్నారు పోలీసులు. బీచ్ నుంచి నిరసన కారులను బలవంతంగా ఖాళీ చేయిస్తుండటంతో ఆందోళనకు దిగారు. రోడ్లపైకి వచ్చి మానవహారం నిర్వహించారు. బీచ్ ఖాళీ చేయించేందుకు బలవంతం చేయటంలో జల్లికట్టు ఆందోళన హింసాత్మకంగా మారింది.

పోలీసులు బలవంతంగా నిరసనకారులను తరలిస్తుండటంతో మెరీనా బీచ్ సమీపంలోని ఐస్ హౌస్ పై ఆందోళనకారులు పెట్రోల్ బాంబులతో విరుచుకుపడ్డారు. వాహనాలను నిప్పు పెట్టారు. రాళ్లు రువ్వారు. మంత్రి అనుమణి, కమిషనర్ పై రాళ్లతో విరుచుకుపడ్డారు. కర్రలతో దాడి చేశారు. ఐస్ పోలీస్ స్టేషన్ పై పెట్రోల్ బాంబులు విసరటంతో.. వాహనాల దగ్ధం అయ్యాయి. హింసాత్మకంగా మారిన ఆందోళనల్లో 20 మంది గాయపడ్డారు.నిరసనకారులు మాత్రం.. పోలీసుల ఒత్తిడికి తలగ్గొట్టేదు. జల్లికట్టుపై ఆర్డినెన్స్ ఒక్కటే సరిపోదని, శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్ చేస్తున్నారు. అడ్డుకుంటే సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరస్తున్నారు. కొందరు సముద్రంవైపునకు పరుగెత్తే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని, బలవంతంగా వ్యాన్లలో ఎక్కించి అక్కడి నుంచి పంపేశారు. మరోవైపు జాతీయగీతాన్ని ఆలపిస్తూ పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు నిరసనకారులు.

జల్లికట్టు మీద జరుగుతున్న ఆందోళన కార్యక్రమంలో భాగంగా చెన్నైలోని మెరీనా బీచ్, మధురైలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కాగా మధురైలో చోటుచేసుకున్న ఘటనపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నక్సల్స్ సహకారంతో లేదంటే నక్సల్స్ సానుభూతిపరుల సహకారంతో ఈ హింస జరిగి ఉంటుంది అని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క చెన్నైలోని ఐటీ కారిడార్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ వాహనాలతో పాటు ప్రైవేట్ వాహనాలను కూడా అటువైపుగా తిరగనివ్వకుండా, మొత్తం బంద్ నిర్వహించారు. స్కూల్లు, కాలేజీల్లో విద్యార్థులు చిక్కుకొని తిరిగి ఇంటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

Related posts:
కాటేసిందని పాముకు శిక్ష
హనీమూన్ కు భర్తలేకుండా వెళ్లిన భార్య
తాగుబోతుల తెలంగాణ!
గుజరాత్ సిఎం రాజీనామా
అరుణాచల్ ప్రదేశ్ మాజీ సిఎం ఆత్మహత్య
నిమ్జ్ బాధిత కుటుంబాలకు ఊరట
జగన్ అన్న.. సొంత అన్న
కాశ్మీరు వేర్పాటు వాదులకు దిమ్మతిరిగే షాక్
ఇలా కాదు అలా... పాక్‌కు మంటపెట్టారు
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
31 జిల్లాల తెలంగాణ... కొత్తగా నాలుగు జిల్లాలు
తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్..... భారత్ దెబ్బకు ఒక్కిరిబిక్కిరి
8మందిని వేసేశారు... సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్.. తీవ్ర వివాదం
బెంగళూరుకు భంగపాటే
సుష్మా స్వరాజ్‌కు అనారోగ్యం
మోదీ హీరో కాదా?
కేంద్ర మంత్రికే నోట్ల ఇబ్బంది
పైసల్లేవ్..ప్రకటనలూ లేవ్
రాహుల్ గాంధీ ఊరించేదేనా?
గజిని మహ్మద్ గా మారిన రేవంత్
బంగారం బట్టబయలు చేస్తారా?
ఏపికి డబ్బేది? జగన్ ప్రశ్న
డబ్బు మొత్తం నల్లధనం కాదు
ఎప్పటికీ అది శశి‘కలే’నా?

Comments

comments